Vizianagaram

విజయనగరం అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన జగన్

Submitted by arun on Tue, 10/02/2018 - 10:19

వైసీపీ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిని జగన్ ప్రకటించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం లోని మూడు లాంతర్ల జంక్షన్ లో ఈ ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేస్తారని చెప్పారు. 2004లో వైఎస్సార్ సీఎం అయ్యే వరకు కూడా విజయనగరం జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉండేదని, వైఎస్సార్ సీఎం అయ్యాక ఐదేళ్ల కాలంలో విజయనగరం జిల్లాలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టారని అన్నారు.

విజయనగరంలో కాల్పులు

Submitted by arun on Sun, 03/25/2018 - 11:31

విజ‌య‌న‌గ‌రంలో అర్ధ‌రాత్రి కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. రియ‌ల్ఎస్టేట్ వ్యాపారిపై గుర్తుతెలియ‌ని దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. కాల్పుల్లో వ్యాపారి అప్ప‌ల‌రాజుకు తీవ్ర‌గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం విశాఖకు తరలింపు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్ధిక లావాదేవీలు కారణమని పోలీసుల అనుమానం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏ ఎఎస్పీ ఏవీ రమణ, సీసీఎస్ డిఎస్పీ చక్రవర్తి. నిందితుడు పాఠనేరస్థుడు బొత్స మోహన్ గా గుర్తించారు.