Casting Couch

నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితుణ్నే..యువ నటుడు

Submitted by arun on Sat, 07/14/2018 - 16:08

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పెద్ద దుమారాన్ని రేపుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ ఇలా భాషల ఇండస్ట్రీలలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని అనేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే కాస్టింగ్ కౌచ్ అమ్మాయిలకు మాత్రమే కాదని తను కూడా ఎదుర్కొన్నట్లు నటుడు రవికిషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో పురుషులకు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయా అని అందరూ ఆశ్చర్యపోయారు.

లారెన్స్‌పై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి!

Submitted by arun on Fri, 07/13/2018 - 17:41

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ కొంతకాలం పాటు ప్రకంపనలు రేపిన నటి శ్రీరెడ్డి.. ఫేస్‌బుక్‌లో శ్రీ లీక్స్ అంటూ తనకు గుర్తొచ్చినప్పుడల్లా.. ఏదో ఒక పోస్ట్ పెట్టి సంచలనం రేపుతోంది. తాజాగా తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ కొరియోగ్రాఫర్‌‌గా, దర్శకుడిగా, హీరోగా రాణిస్తున్న రాఘవ లారెన్స్ గురించి తన ఫేస్‌బుక్ ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టింది.‘ఓ రోజు నేను నా స్నేహితుల ద్వారా లారెన్స్‌ మాస్టర్‌ని హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ గోల్కొండ హోటలో కలుసుకున్నాను. ఆ సమయంలో లారెన్స్ తనని తన రూమ్‌కి పిలిపించారు. అక్కడికి వెళ్లాకా రాఘవేంద్ర స్వామి ఫోటో, రుద్రాక్షలు చూసి నాకు చాలా అద్భుతం అనిపించింది.

అగ్ర‌ద‌ర్శ‌కుడిపై శ్రీరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు...ఆ రోజు గ్రీన్‌పార్క్ హోటల్‌లో....

Submitted by arun on Thu, 07/12/2018 - 13:58

తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై పోరాటం చేస్తూ అర్దనగ్న ప్రదర్శనకు దిగడం ద్వారా ఇండస్ట్రీలో ఉన్న ఈ సమస్యపై నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ పడేలా చేసింది శ్రీరెడ్డి. ఆ తర్వాత హీరో నాని, పలువురు దర్శకులు, నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరెడ్డి ప్రముఖ తమిళ దర్శకుడు, సౌత్‌లో మహేష్ బాబు, విజయ్, సూర్య లాంటి పెద్ద హీరోలతో భారీ సినిమాలు తీసిన ఏఆర్ మురుగదాస్ మీద సంచలన ఆరోపణలు చేసింది.

ఫోన్లు చేసి గెస్ట్‌ హౌస్‌కు రమ్మనేవారు: ఆమని

Submitted by arun on Tue, 07/03/2018 - 12:44

తన కెరీర్‌లో కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొన్నాను అని చెప్పింది నటి ఆమని. ఒక దశలో హీరోయిన్‌గా వెలిగిన ఆమని ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తల్లి, అత్త పాత్రల్లో బిజీగా ఉంది ఆమని. వివాహం చేసుకున్న తర్వాత నటనకు కొంత దూరం అయిన ఆమె ఇప్పుడు తిరిగి బిజీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో సినీ రంగంలో తన అనుభవాల గురించి వివరించింది ఈ నటి. ‘చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో నేనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. కొత్త నిర్మాతల నుంచి నాకు ఫోన్లు వచ్చేవి. ఒంటరిగా గెస్ట్‌ హౌస్‌కు రమ్మనేవారు. తోడుగా అమ్మను తీసుకురావద్దు అని చెప్పేవారు.

ఆ నిర్మాత గురించి తెలిసి కూడా ఆమె గెస్ట్ హౌస్ కి ఎందుకు వెళ్లింది? : నటుడు పృధ్వీ

Submitted by arun on Sat, 06/30/2018 - 14:10

తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదని కమెడియన్ పృథ్వి తెలిపాడు. కొంత మంది వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. ''సినిమా కోసం నిర్మాత కొన్ని కోట్లు ఖర్చు చేస్తారు.. అలాంటిది కథకు సరిపోయే హీరోయిన్ ను మాత్రమే ఆయన తీసుకుంటారు. మల్లీశ్వరి సినిమాలో కత్రినా కైఫ్ లాంటి అమ్మాయిని కథకు సెట్ అవుతుందనే తీసుకొచ్చారు. ఇక్కడున్న వాళ్లతో ఆ పాత్ర చేయించలేమని అన్నారు. కొన్నేళ్ల కిందటి వరకు తెలుగు అమ్మాయిలే హీరోయిన్లుగా రాణించారు. ఇప్పుడు టాప్ హీరోల సరసన సరిపోయే తెలుగు అమ్మాయిలను చూపించండి'' అంటూ ఎదురు ప్రశ్నించారు.

సినీ రంగంలో మగవారికీ క్యాస్టింగ్ కౌచ్ తప్పట్లేదు‌.. ఇలాంటి హీరోయిన్లే ఎక్కువ: ప్రముఖ నటుడు

Submitted by arun on Mon, 06/11/2018 - 15:29

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి గళం విప్పినప్పటి నుంచి ఈ అంశం గురించిన ప్రస్తావన కొనసాగుతూనే ఉంది. మహిళా నటులు పలువురు తమకు జరిగిన అన్యాయాన్ని బట్టబయలు చేశారు. అయితే, సినీ పరిశ్రమలో మహిళా నటులకే కాదు మగవారికీ క్యాస్టింగ్ కౌచ్ తప్పట్లేదంటూ ‘రేసు గుర్రం’ సినిమా ద్వారా  టాలీవుడ్ కు  పరిచయమైన నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాస్ట్‌ కౌచింగ్‌ ఆడవారికే కాదు, మగవారికీ ఎదురవుతోందని ఆయన సంచలన కామెంట్ చేశారు. మగవారిని లైంగికంగా వేధించే హీరోయిన్ల సంఖ్య సినీరంగంలో ఎక్కువగాఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు, హిందీ, బోజ్‌పూరీ భాషలలో పలుసినిమాలలో రవికిషన్‌ నటించారు.

క్యాస్టింగ్‌ కౌచ్‌పై రేణుక సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Tue, 04/24/2018 - 16:40

గత కొంతకాలంగా టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న క్యాస్టింగ్‌ కౌచ్‌ వివాదంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. క్యాస్టింగ్‌ కౌచ్‌ ఒక్క సినీ పరిశ్రమకే పరిమితం కాలేదని ప్రతిచోటా ఉందన్నారు. బాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశంపై కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై స్పందించిన  రేణుకా చౌదరి చట్టసభల నుంచి అన్ని ప్రాంతాల్లోనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందన్నారు. అత్యాచారాల విషయంలో ప్రభుత్వాలు కూడా డ్రామాలు ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు. చట్టాలు ఎన్ని చేసినా మనుషుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు.

డైరెక్టరా.. బ్రోకరా..శ్రీ ఎపిసోడ్‌లో వర్మ ప్లానేంటి?

Submitted by arun on Thu, 04/19/2018 - 13:41

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. థ్రిల్లర్‌ సీరియల్‌కి ఏమాత్రం తగ్గకుండా కథ ఆసక్తికరంగా నడుస్తోంది. రోజుకో కొత్త పాత్ర ఎంటరవుతుంటే లేటెస్ట్‌గా పొలిటికల్‌ డ్రామా కూడా జతకలిసింది. ఇప్పుడు తాజాగా ఓ బ్రోకర్‌ కూడా వచ్చిచేరాడు. అతనెవరో కాదు ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ. 

శ్రీరెడ్డికి రాంగోపాల్ వర్మ రూ.5 కోట్ల ఆఫర్ ఎందుకు ఇచ్చారు..?

Submitted by arun on Thu, 04/19/2018 - 10:09

HMTV దగ్గరున్న శ్రీరెడ్డి ఆడియో టేప్ గురించి డైరెక్టర్ వర్మ ఏమంటున్నారు...? అసలు పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్ చేయమని శ్రీరెడ్డికి వర్మ ఎందుకు సలహా ఇచ్చారు..? ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కుటుంబంతో శ్రీరెడ్డికి ఉన్న వివాదంలో డీల్ సెటిల్ చేయడానికి ఆర్జీవీ ప్రయత్నించాడా..? రాంగోపాల్ వర్మ వెర్షన్ ఏంటి..?  

జీవితారాజ‌శేఖ‌ర్.. రెడీగా ఉండు: శ్రీరెడ్డి సంచ‌ల‌న పోస్టింగ్‌

Submitted by arun on Wed, 04/18/2018 - 15:44

కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా గళమెత్తి ఏకకాలంలో ప్రశంసలు, విమర్శలుఎదుర్కొంటున్న నటి శ్రీరెడ్డి..‘ఈ జీవితం ఇక చాలు! ఫస్ట్‌టైమ్‌ ఒంటరినయ్యాను.. అందరికీ ధన్యవాదాలు’ అంటూ వైరాగ్య వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మొబైల్‌ స్విచాఫ్‌ చేయడంతో ఒక్కసారిగా కలకలంరేగింది. అయితే, కొద్ది గంటల తర్వాత తిరిగి సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యారామె. తనపై వస్తున్న అన్ని విమర్శలకు బదులిస్తానని అన్నారు. `ఈ జీవితానికి ఇక చాలు` అంటూ కొద్దిసేపు క్రితం త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టింగ్ చేసిన శ్రీరెడ్డి తాజాగా మ‌రో సంచ‌లన పోస్టింగ్ చేసింది. త‌న పోరాటం ఆపేది లేద‌ని, ఇక‌పై లీగ‌ల్‌గా పోరాటం చేస్తాన‌ని వెల్ల‌డించారు.