ar murugadoss

మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేశ్

Submitted by arun on Wed, 01/03/2018 - 15:48

టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసింది. ఇలయదళపతి విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ చిత్రంలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. గతంలో విజయ్ సరసన భైరవ సినిమాలో కలిసి నటించింది కీర్తి సురేష్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. సన్ గ్రూప్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ, ఇతర కథానాయికలకు కీర్తి సురేశ్ గట్టిపోటీనే ఇస్తోందని చెప్పాలి.     

'స్పైడ‌ర్' రివ్యూ

Submitted by nanireddy on Wed, 09/27/2017 - 17:09

'ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌ముందే స‌మ‌స్య‌ల్లో ఉన్న‌వారిని కాపాడి సంతోషించే క‌థానాయ‌కుడు.. ఓ మ‌నిషిని చంపి వాళ్ల బంధువులు ఏడిస్తే అది చూసి సంతోషించే శాడిస్టిక్ ప‌ర్స‌నాలిటీ డిజార్డర్ ఉన్న‌ ప్ర‌తినాయ‌కుడు.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య న‌డిచే మైండ్‌గేమ్ సినిమానే స్పైడ‌ర్‌'. అగ్ర క‌థానాయ‌కుడు మ‌హేష్‌బాబు, అగ్ర ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ క్రేజీ కాంబినేష‌న్‌లో భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన ద్విభాషా చిత్ర‌మిది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య ప్ర‌తినాయ‌కుడిగా, క్రేజీ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి హేరిస్ జైరాజ్ సంగీత‌మందించారు.

'స్పైడ‌ర్' క‌థ ఏమిటంటే..

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 15:16

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ తెర‌కెక్కించే సినిమాలు రెగ్యుల‌ర్‌గా ఉండ‌వు. ఏదో ఒక సందేశాన్ని క‌థ‌లో అంత‌ర్లీనంగా ప్ర‌స్తావిస్తూ ఆయ‌న త‌న సినిమాల్ని తెర‌కెక్కిస్తుంటారు. 'గ‌జిని' చిత్రంతో తెలుగు వారికి ప‌రిచ‌య‌మైన‌ మురుగ‌దాస్ 'స్టాలిన్‌', 'తుపాకి' చిత్రాల‌తో మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ఆయ‌న తాజా చిత్రం 'స్పైడ‌ర్' రేపు విడుద‌ల కానుంది. ఈ చిత్రం క‌థ‌పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే మురుగ‌దాస్‌నే నేరుగా ఈ సినిమా క‌థేంటో చెప్పుకొచ్చారు.. ఓ ఇంట‌ర్వ్యూలో.

'స్పైడ‌ర్‌'.. 2500 థియేట‌ర్స్‌లో

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 19:57

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన స్పై థ్రిల్ల‌ర్ 'స్పైడ‌ర్‌'. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. హేరిస్ జైరాజ్ సంగీత‌మందించిన ఈ సినిమా ఈ నెల 27న ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాని తెలుగు, త‌మిళ భాష‌ల్లో దాదాపు 2,500 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌స్తున్న 'స్పైడ‌ర్‌'.. యుఎస్ఎలో ఇప్ప‌టికే హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల అడ్వాన్స్ బుకింగ్‌ని ప్రీమియ‌ర్స్‌కే సొంతం చేసుకుంది.

ర‌కుల్‌.. న్యూ ల‌వ్‌

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 14:53

ప్ర‌స్తుతం ద‌క్షిణాదిన‌ బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. ఈ ముద్దుగుమ్మ న‌టించిన కొత్త చిత్రం 'స్పైడ‌ర్' ఈ నెల 27న ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది. మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా విడుద‌ల కానుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ర‌కుల్ ఆశ నెర‌వేరుతుందా?

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 15:52

క‌న్న‌డ చిత్రంతో కెరీర్‌ని మొద‌లుపెట్టిన ఉత్త‌రాది భామ ర‌కుల్ ప్రీత్‌సింగ్‌.. ఆ త‌రువాత తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో సినిమాలు చేసింది. అయితే తెలుగులో మాత్ర‌మే ఈ ముద్దుగుమ్మ‌కి స్టార్‌డ‌మ్ ద‌క్కింది. తెలుగు త‌రువాత ర‌కుల్ ఎక్కువ‌గా న‌టించింది త‌మిళ చిత్రాల్లోనే. అయితే అక్క‌డ ఆమెకి పెద్ద గుర్తింపు అయితే ద‌క్క‌లేదు. 'అలా మొద‌లైంది' రీమేక్ అయిన 'ఎన్న‌మో ఏదో' త‌రువాత  మూడేళ్ల గ్యాప్ తీసుకుని రెండు త‌మిళ చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌బోతోంది ర‌కుల్‌. ఆ చిత్రాలే 'స్పైడ‌ర్‌', 'దీర‌న్ అధిగారం ఒండ్రు'. వీటిలో ముందుగా 'స్పైడ‌ర్' థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

క‌థ‌, ద‌ర్శ‌కుడుపై ఆధార‌ప‌డి ఉంటుంది - మ‌హేష్‌

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 15:38

స్టార్ హీరో ఇమేజ్ ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటారు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు. 'నిజం', 'నాని', '1-నేనొక్క‌డినే', 'శ్రీ‌మంతుడు' చిత్రాల‌ను ఈ త‌ర‌హాలోనే క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్‌తో చేసుకుపోయారు మ‌హేష్‌. ఇక మ‌హేష్  తాజా చిత్రం 'స్పైడ‌ర్' కూడా కాస్త ప్ర‌యోగాత్మ‌కం అనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా చేశారీ సూప‌ర్‌స్టార్‌. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిందీ చిత్రం.

14 ఏళ్ల 'ఠాగూర్‌'

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 12:03

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన చిత్రాల‌లో 'ఠాగూర్' ఒక‌టి. లంచంపై పోరాటం చేసిన ఓ కామ‌న్‌మ్యాన్‌ క‌థగా 'ఠాగూర్' తెర‌కెక్కింది. త‌మిళంలో ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సూప‌ర్‌హిట్ చిత్రం 'ర‌మ‌ణ' (విజ‌య్ కాంత్ క‌థానాయ‌కుడు)కి రీమేక్ వెర్ష‌న్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి తెలుగులో వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాకి మ‌ణిశ‌ర్మ అందించిన సంగీతం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

విడుద‌లకి ముందే 'స్పైడ‌ర్' రికార్డ్‌

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 20:24

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన ద్విభాషా చిత్రం 'స్పైడ‌ర్‌'. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన‌ ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ తెర‌కెక్కించారు. ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా ఈ నెల 27న విడుద‌ల కానుంది.

మ‌ళ్లీ దీపావ‌ళే టార్గెట్‌?

Submitted by nanireddy on Thu, 09/21/2017 - 12:48

ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌..సందేశాన్ని జోడించి యాక్ష‌న్‌ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో త‌న‌దైన ముద్ర వేసిన త‌మిళ ద‌ర్శ‌కుడు పేరిది. 'గ‌జిని', 'స్టాలిన్‌', 'తుపాకి' వంటి చిత్రాల‌తో తెలుగువారికి చేరువైన ఈ ద‌ర్శ‌కుడు ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబుతో తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో 'స్పైడ‌ర్‌'ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ద‌స‌రా కానుక‌గా ఈ నెల 27న  ఈ సినిమా విడుద‌ల కానుంది.