anr

రావోయి మా ఇంటికి మావో!

Submitted by arun on Sat, 11/24/2018 - 20:20

అప్పట్లో... దొంగరాముడు చిత్రం (1955) వచ్చిన ఒక పాట...అందరి పెదాలపై ఆడేది..అది.. రావోయి మా ఇంటికి మావో అనే పాట....ఈ పాట సంగీతం పెండ్యాల నాగేశ్వర రావు, రచన  సముద్రాల రాఘవాచార్య, గొప్పగా గానం చేసింది... జిక్కి.
రావోయి మా ఇంటికి

రావోయి మా ఇంటికి మావో

మాటున్నది మంచి మాటున్నది

మాటున్నది మంచి మాటున్నది

నువ్వు నిలిసుంటె నిమ్మ సెట్టు నీడున్నది

నువ్వు కూసుంటె కురిసీలో పీటున్నది

నువ్వు తొంగుంటె పట్టె మంచం పరుపున్నది

మాటున్నది మంచి మాటున్నది

రావోయి మా ఇంటికి మావో మాటున్నది

ఆకలైతే సన్నబియ్యం కూడున్నది

‘ఎన్టీఆర్’ “ఏఎన్నార్‌” సోదరులు

Submitted by arun on Fri, 09/21/2018 - 17:13

తెలుగు తెరకి రెండు కన్నులు,

అభినయానికి మూల ఆత్మలు,

వెండితెర యొక్క బంగారు  వెలుగులు,

‘ఎన్టీఆర్’ “ఏఎన్నార్‌” సోదరులు. శ్రీ.కో. 

Tags

ఆకట్టుకుంటున్న ‘యన్‌.టి.ఆర్‌’ సరికొత్త పోస్టర్‌

Submitted by arun on Thu, 09/20/2018 - 17:20

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఎన్‌టీఆర్ చిత్రంలోనుంచి ఈ రోజు ఉద‌యం ఏఎన్ఆర్ ఫ్ట‌స్ లుక్‌ను విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. అక్కినేని జ‌యంతి సంద‌ర్భంగా ఆ పోస్ట‌ర్‌ను లాంచ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కి సంబంధించిన పాత స్టిల్స్ ను చూస్తే ఒకచోట ఎన్టీఆర్ సిగరెట్ ను వెలిగిస్తూ అక్కినేని కనిపిస్తారు. ఈ ఫోటో వాళ్ల సాన్నిహిత్యానికి అద్దం పడుతుంది .. అదే స్టిల్ ను పోస్టర్ గా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ .. అక్కినేనిగా సుమంత్ ఎంతగా కుదిరారనేది ఈ పోస్టర్లో కనిపిస్తోంది .      

జమున గారంటే ఆ రోజుల్లో

Submitted by arun on Sat, 08/18/2018 - 13:21

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ హీరోలయిన ఎన్.టి.ఆర్, ఎఎన్ఆర్ మూడు సంవత్సరాల పాటు ప్రఖ్యాత నటి "జమునా" తో నటించటానికి నిషేధించారట, ఆమెకు బాగా గర్వం ఉంది అని, కానీ “జమున” గారు ఎప్పటికీ తగ్గక, క్షమాపణలు కూడా చెప్పడానికి అంగీకరించక పోవడంతో చివరగా బిఎన్ రెడ్డి మరియు చక్రాపణి గారు వారి మధ్య రాజీ కుదిర్చి ఆ తర్వాత "గుండమ్మకథ" సినిమాకి కలిసి పని చేసారట. శ్రీ.కో.     

అద్భుత దృశ్య కావ్యం 'మేఘ‌సందేశం'కి 35 ఏళ్లు

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 11:31

మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు 200వ చిత్రం 'మేఘ‌సందేశం'. ఇందులో జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద హీరోయిన్లుగా న‌టించారు. దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ దృశ్య‌కావ్యం.. మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. ఎన్నో పుర‌స్క‌రాల‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా నాలుగు జాతీయ అవార్డుల‌ను, ప‌లు నంది అవార్డుల‌ను సొంతం చేసుకుంది.

మ‌రో రెండు రోజుల్లో 'రాజుగారి గ‌ది2' ట్రైల‌ర్‌

Submitted by nanireddy on Mon, 09/18/2017 - 14:13

అక్కినేని నాగార్జున న‌టిస్తున్న తొలి హ‌ర‌ర్ కామెడీ చిత్రం 'రాజుగారి గ‌ది2'. స‌మంత ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ఓంకార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. నాగార్జున పుట్టిన‌రోజుని పుర‌స్క‌రించుకుని ఆగ‌స్టు 29న థ‌మ‌న్ సంగీతంలో విడుద‌ల చేసిన మోష‌న్ పోస్ట‌ర్‌కి మంచి స్పంద‌న ల‌భించిన సంగ‌తి తెలిసిందే.