T-20 cricket

ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకపై భార‌త్‌ విజయం

Submitted by arun on Tue, 03/13/2018 - 08:08

ముక్కోణపు టీ20 సిరీస్‌ నాలుగో మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని భారత్ జట్టు మరో తొమ్మిది బంతులు ఉండగానే ఛేదించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన లంక జట్టు ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించింది. ఉనాద్కత్‌ వేసిన తొలి ఓవర్‌లోనే 15 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత ఓవర్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ తొమ్మిది పరుగులే ఇచ్చాడు. మూడో ఓవర్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ గుణతిలకను ఔట్ చేశాడు. కాసేపటికే కుశాల్‌ పెరీరాను సుందర్‌ పెవిలియన్‌‌కి పంపాడు. మూడో వికెట్‌కు కుశాల్‌ మెండిస్‌తో కలిసి 62 పరుగులు చేసిన ఉపుల్ తరంగ వెనుదిరిగాడు.