LK Advani

అడ్వాణీని మోదీ ఇలా అవమానించారు

Submitted by arun on Wed, 06/13/2018 - 15:53

బీజేపీ సీనియర్‌ నేత ఎల్కే అద్వానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవం ఇవ్వట్లేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోదీ కంటే తమ పార్టీయే ఆయనను ఎక్కువ గౌరవిస్తోందని ముంబయిలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్‌ అన్నారు. తాజాగా, ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేస్తూ మరోసారి ఇదే విషయంపై విమర్శలు గుప్పించారు. ఈ ట్వీట్‌కు క్యాప్షన్‌గా..‘ ఏకలవ్యుడు గురువు కోరిక మేరకు తన కుడి బొటన వేలిని త్యాగం చేశాడు. కానీ బీజేపీ మాత్రం తమ గురువులను దూరం పెట్టింది.

అద్వానీని అవమానించిన మోదీ!

Submitted by arun on Sat, 03/10/2018 - 16:05

బీజేపీ కురువృద్ధుడు, తన గురువు అయిన ఎల్‌కే అద్వానీకి ప్రధాని మోదీ ఏమాత్రం ప్రాధాన్యమివ్వడం లేదన్న సంగతి పాతదే. ప్రాధాన్య సంగతి పక్కనబెడితే కనీస గౌరవం కూడా ఆ సీనియర్ నేతకు మోదీ ఇవ్వడం లేదని తాజా వీడియో ఒకటి చెబుతోంది. ఒక కార్యక్రమంలో అందరికీ ప్రతి నమస్కారాలు చేస్తూ వెళ్లిన మోదీ.. తనకు నమస్కరిస్తున్న అద్వానీకి నమస్కరించకుండా, అసలు ఆయనను ఏమాత్రం లెక్కచేయకుండా పోతున్నట్టుందీ వీడియోలో.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.