surya

పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలవబోతున్న సూర్య...?

Submitted by lakshman on Thu, 01/18/2018 - 08:11

ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు, 2019లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైకాపా అధినేత వైఎస్ జగన్, చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు, ప్రముఖ తమిళ నటుడు సూర్య నుంచి అనూహ్య మద్దతు లభించింది. "ప్రజలకు ఏదో చేయాలన్న తపన, గొప్ప ఆలోచన,  ఆశయాలతో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేపట్టారు" అని ఆయన వ్యాఖ్యానించాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నుంచే తనకు వైఎస్‌ఆర్‌ కుటుంబంతో పరిచయం ఉందని సూర్య చెప్పారు. వైఎస్‌ జగన్‌, తాను కలుసుకొని మాట్లాడినప్పుడు రాజకీయ అంశాలు పెద్దగా చర్చకు రావని.. అయినా ప్రజలకు ఏదో చేయాలన్న తపన వైఎస్‌ జగన్‌ లో గమనించానని సూర్య అన్నారు.

గేటు దూకిన హీరో సూర్య

Submitted by arun on Mon, 01/15/2018 - 15:05

కోలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌.... హీరో సూర్య తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో హల్‌చల్‌ చేశారు. స్థానిక మేనక థియేటర్‌లో గ్యాంగ్‌ సినిమా షోలో ప్రేక్షకులను పలకరించారు. సూర్యని చూసేందుకు అభిమానులు క్యూ కట్టారు. అయితే థియేటర్‌ బయట జనం భారీగా తరలిరావడంతో... సూర్య వెనుక గేటు దూకి వెళ్లారు.
 

రివ్యూ: గ్యాంగ్‌

Submitted by arun on Fri, 01/12/2018 - 16:00

నటీనటులు : సూర్య, కీర్తి సురేశ్‌, రమ్యకృష్ణ , కార్తీక్‌
జానర్‌ : యాక్షన్‌, డ్రామా, వినోదం
దర్శకుడు : విఘ్నేశ్‌ శివన్‌
సంగీతం : అనిరుధ్‌
నిర్మాత : కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా

సూర్య హీరోగా, యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంయుక్తంగా నిర్మించిన ‘గ్యాంగ్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడులైంది. మొదటిసారిగా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. తమిళ హీరో అయిన సూర్యకి తెలుగులో మంచి మార్కెట్‌ ఉంది. తన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్‌ అవుతుంటాయి. మరి సూర్య గత సినిమాల్లాగే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు చేరువైందో లేదో తెలుసుకుందాం..

ఫ్యాన్స్‌ కాళ్లకు నమస్కరించిన సూర్య

Submitted by arun on Thu, 01/11/2018 - 17:24

అభిమానుల‌ను ఆద‌రించ‌డంలో త‌మిళ హీరోలు మిగ‌తా భాష‌ల సినీ హీరోల‌తో పోల్చితే ఒక అడుగు ముందే ఉంటారు. అభిమానం త‌ట్టుకోలేక ఒక్క‌సారిగా త‌మ ద‌గ్గ‌రికి వ‌చ్చిన వారిని చిరాకు ప‌డ‌కుండా ప్రేమ‌గా ఆద‌రిస్తుంటారు. విక్ర‌మ్ ఓ అభిమానిని కౌగిలించుకోవ‌డం, అభిమాని అంత్య‌క్రియ‌ల‌కు న‌టుడు కార్తీ హాజ‌రై ఏడ‌వ‌డం ఇలా చాలా ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల సూర్య కొత్త చిత్రం 'గ్యాంగ్‌' త‌మిళ ప్రీ రిలీజ్ వేడుక‌లో కూడా ఇలాంటి ఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది. సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రం‘గ్యాంగ్‌’. కీర్తి సురేశ్‌ కథానాయిక. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అజ్ఞాతవాసి కూడా చూడండి : సూర్య

Submitted by arun on Sat, 01/06/2018 - 12:27

‘‘ఈ సంక్రాంతి వేళ ‘గ్యాంగ్‌’ మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుందని ఆశిస్తున్నా. నాకు మాత్రం మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు కావాలి’’ అని అన్నారు సూర్య. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌’. కీర్తి సురేష్‌ కథానాయిక. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కథానాయకుడు సూర్య మాట్లాడుతూ.. ‘‘2018లో అందరి కలలు సాకారం కావాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరి జీవితంలో ‘గ్యాంగ్‌’ అనేది చాలా ముఖ్యమైంది. మన అందరికీ స్కూల్‌, కాలేజ్‌, పనిచేసే చోట గ్యాంగ్‌ కచ్చితంగా ఉంటుంది.

ఎప్పటి నుంచో కంటోన్న కల .. ఇప్పుడు నెరవేరింది: సాయిపల్లవి

Submitted by arun on Thu, 12/21/2017 - 11:01

ఫిదా సినిమా సక్సెస్ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది సాయిపల్లవి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ ప్రేమమ్ బ్యూటీ తెలుగులోనే కాదు .. తమిళంలోను ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. అలా తాజాగా ఆమె సూర్య సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి తాజాగా సాయిపల్లవి మాట్లాడుతూ .. " సూర్య నా ఫేవరేట్ హీరో .. ఆయన నటనంటే నాకు చాలా ఇష్టం. 'కాక్క కాక్క' సినిమా చేసిన దగ్గర నుంచి నేను ఆయన అభిమానిగా మారిపోయాను. ఆయనతో కలిసి ఒక సినిమా చేసినా చాలు అనుకుంటూ కలలు కనే దానిని. అయితే అది త్వరగా నెరవేరదనే అనుకున్నాను. కానీ సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య సరసన నటించే ఛాన్స్ వచ్చింది.

కీర్తి సురేష్‌, స‌మంత‌కి ఒకేలా..

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 13:59

2018 సంక్రాంతి క్రేజీ క‌థానాయిక‌లు కీర్తి సురేష్‌, స‌మంత‌కి స‌మ్‌థింగ్ స్పెష‌ల్ కానుంది. కాస్త వివరాల్లోకి వెళితే.. 2018 సంక్రాంతికి కీర్తి సురేష్ న‌టించిన రెండు భారీ బ‌డ్జెట్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. వాటిలో ఒక‌టి తెలుగు చిత్ర‌మైతే.. మ‌రొక‌టి త‌మిళ చిత్రం. కీర్తి న‌టిస్తున్న ఆ తెలుగు చిత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టిస్తున్న 25వ చిత్ర‌మైతే, త‌మిళ చిత్ర‌మేమో సూర్య న‌టిస్తున్న 'తానే సేరంద కూట్ట‌మ్‌'. ఈ రెండు కూడా కీర్తి కెరీర్‌కి కీల‌కమైన సినిమాలే.

విక్ర‌మ్‌తో రిపీట్ చేస్తుందా?

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 13:31

త‌మ‌న్నాకి తెలుగులో కంటే త‌మిళంలో మంచి విజ‌యాలున్నాయి. సూర్య‌తో చేసిన 'అయ‌న్' (తెలుగులో 'వీడొక్క‌డే').. కార్తీతో చేసిన 'ప‌య్యా'(ఆవారా), 'సిరుత్తై'('విక్ర‌మార్కుడు' రీమేక్‌), 'తోళా' (ఊపిరి).. అజిత్‌తో చేసిన 'వీర‌మ్' (వీరుడొక్క‌డే).. ధ‌నుష్‌తో చేసిన 'ప‌డిక్కాద‌వ‌న్‌'.. విజ‌య్‌సేతుప‌తితో చేసిన 'ధ‌ర్మ‌దురై' చిత్రాలు విజ‌యం సాధించ‌డంతో పాటు త‌మ‌న్నాకి త‌మిళ‌నాట మంచి పేరుని తీసుకువ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ చేస్తున్న త‌మిళ చిత్రం 'స్కెచ్‌'. ఇందులో విక్ర‌మ్ హీరోగా న‌టిస్తున్నాడు. విక్ర‌మ్‌తో త‌మ‌న్నా జోడీ క‌ట్ట‌డం ఇదే తొలిసారి.

సూర్యతో పోటీప‌డ‌నున్న విశాల్‌?

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 14:48

గ‌త వారం విడుద‌లైన త‌మిళ చిత్రం 'తుప్ప‌రివాల‌న్‌'తో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు క‌థానాయ‌కుడు విశాల్‌. ప్ర‌స్తుతం ఆయ‌న‌ మూడు త‌మిళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాలే 'ఇరుంబు తిరై', 'క‌రుప్పు రాజా వెల్లై రాజా', 'సండ‌ కోళి2'. వీటిలో 'ఇరుంబు తిరై' ముందుగా విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది. ఈ చిత్రంలో విశాల్‌కి జంట‌గా స‌మంత న‌టిస్తోంది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తొలి చిత్ర‌మిదే కావ‌డం విశేషం. యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి పి.ఎస్‌.మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

 ఈ సంక్రాంతికి రెండు సినిమాలు

Submitted by nanireddy on Mon, 09/18/2017 - 18:02

'నేను శైల‌జ‌', 'నేను లోక‌ల్' చిత్రాల‌తో రెండు వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకుంది కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్‌. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25వ చిత్రంతో పాటు 'మ‌హాన‌టి'లో మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో న‌టిస్తూ బిజీగా ఉందీ ముద్దుగుమ్మ‌. అంతేకాకుండా.. త‌మిళంలోనూ సినిమాలు చేస్తున్న కీర్తి ప్ర‌స్తుతం అక్క‌డి అగ్ర‌క‌థానాయ‌కుల్లో ఒక‌రైన సూర్య‌తో క‌లిసి 'తాన సేరండ్ర కూట్ట‌మ్' అనే సినిమాలో న‌టిస్తోంది.