Murali Mohan

శ్రీరెడ్డిపై మురళీమోహన్ హాట్ కామెంట్

Submitted by arun on Thu, 04/19/2018 - 14:45

శ్రీరెడ్డి అర్ధనగ్న దీక్షను ఎంపీ మురళీమోహన్‌ తప్పుబట్టారు. క్రమశిక్షణ లేనివారికి 'మా' సభ్యత్వం ఇవ్వరని స్పష్టం చేశారు. తానే ‘మా’ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే.. శ్రీరెడ్డికి ఎట్టిపరిస్థితుల్లోనూ సభ్యత్వం ఇవ్వనని తేల్చిచెప్పారు. క్రమశిక్షణ కల్గిన వాళ్లకే మా లో సభ్యత్వం ఉంటుందని ఆయన ఇవాళ రాజమండ్రిలో వ్యాఖ్యానించారు. నగ్న ప్రదర్శనలు చేయడం భారతీయ సంస్కృతి కాదని మురళీ మోహన్ అన్నారు.