yanamala ramakrishnudu

ఏపీ ఆర్ధిక మంత్రి యనమల సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Thu, 05/24/2018 - 10:49

ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబును ప్రజల నుంచి దూరం చేసేందుకు బీజేపీ, వైసీపీలు కలిసి కుట్ర చేస్తున్నాయంటూ ఆరోపించారు. 2019 ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో చంద్రబాబుదే కీలకపాత్రన్న ఆయన ... కాంగ్రెస్‌ తో కలుస్తారంటూ వస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బెంగళూరులో వేదికపైనే ఎదురుపడినప్పుడు మాత్రమే అభివాదం చేశారన్నారు. దీని కూడా తప్పుబట్టే స్ధితిలో బీజేపీ, వైసీపీ నేతలున్నారంటూ ఎద్దేవా చేశారు.

ఏపీ బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌

Submitted by arun on Thu, 03/08/2018 - 11:51

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2018-19కిగాను రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం ఏపీ శాసనసభలో ఉదయం11.30గంటలకు బడ్జెట్‌ ప్రసంగ పాఠాన్ని మొదలుపెట్టారు. 2019లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అతిముఖ్యమైనది కాగా ప్రత్యేక హోదా విషయం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌..