AP Assembly

అందరూ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయలేదు : చంద్రబాబు

Submitted by arun on Fri, 04/06/2018 - 17:15

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీపై మరోసారి ఫైరయ్యారు. వైసీపీకి చెందిన ఎంపీలందరూ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఎంపీలంటే అందరూ ఒకటేనని ఐదుగురు మాత్రమే ఎందుకు రాజీనామా చేశారని అన్నారు. రాయబారాలు నడిపేందుకు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయలేదా ? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నమ్మకం ద్రోహం చేసిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. చివరి బడ్జెట్‌లో కూడా అన్యాయం చేసినందునే తమ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగిందన్నారు. విభజన హామీలు అమలు చేయాలంటూ అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. అండగా ఉంటామన్న కేంద్రం...నాలుగేళ్లయినా పట్టించుకోలేదని స్పష్టం చేశారు.

అమిత్‌షా లేఖకు బాబు కౌంటర్‌

Submitted by arun on Sat, 03/24/2018 - 16:41

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖపై సీఎం చందబాబు స్పందించారు. అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు... అమిత్‌ షా రాసిన లేఖలో అన్ని వక్రీకరణలే ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదని చెప్పారు..., హోదాతో సమానంగా ఇస్తామన్న ప్యాకేజీ ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. విభజన హామీలను కేంద్రం పట్టించుకోలేదని, ఏపీకి ఒక రూల్‌... మరో రాష్ట్రాలకు మరో రూలా? అని నిలదీశారు. ఈశాన్న రాష్ట్రాలకు అన్నీ ఇస్తున్నారు... ఏపీని మాత్రం విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


 

బీజేపీ, టీడీపీ మధ్య పట్టిసీమ వార్‌

Submitted by arun on Thu, 03/22/2018 - 08:50

ఏపీ సర్కార్‌పై కమలం నేతల ఎదురుదాడి మొదలయింది. ఇప్పటి వరకు మిత్రపక్షంగా కొనసాగుతూ వచ్చిన బీజేపీ చంద్రబాబు అవిశ్వాస తీర్మానంతో పంథా మార్చుకుంది. పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సీబీఐ చేత విచారణ జరిపించాలని విష్ణుకుమార్‌ రాజు డిమాండ్ చేశారు. దీనిపై టీడీపీ నేతలు తమ దైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీకి కొత్త నిర్వచనం చెప్పారు. అంతేకాదు నెలలోనే ఎంత మార్పు వచ్చిందంటూ మంత్రులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చంద్ర‌బాబు కంట‌త‌డిపై క‌త్తిమ‌హేష్ సెటైర్లు

Submitted by lakshman on Wed, 03/14/2018 - 03:36


ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి.  ఈ సెష‌న్స్ లో మాట్లాడిన చంద్ర‌బాబు భావోద్వేగంతో క‌న్నీరుపెట్టుకున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్ ప్ర‌క‌ట‌న‌ల‌తో కేంద్రంపై అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కిన చంద్ర‌బాబు.  నాడు రాష్ట్ర‌విభ‌జ‌న సంద‌ర్భంగా ఇచ్చిన హామీల్ని నెర‌వేరుస్తామ‌ని పీఎం మోడీ తెలిపార‌ని అన్నారు.  కానీ ఇప్పుడు మాత్రం అమ‌రావతి నిర్మాణ కోసం స‌హ‌క‌రించాలని కేంద్రాన్ని కోరుతుంటే ..బీజేపీ నేత‌లు మాత్రం డ్రీమ్ సిటీ అని హేళన చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి సహకరించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అన్నారు.

కేంద్రంపై నిప్పులు చెరిగిన చంద్ర‌బాబు

Submitted by lakshman on Tue, 03/13/2018 - 18:05

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు వాడివేడిగా కొన‌సాగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు కేంద్రం ఏపీకి చేస్తున్న అన్యాయం గురించి చ‌ర్చించారు. నాడు రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా ప్రతిప‌క్షంలో బీజేపీ ఎన్నో హామీల్ని ఇచ్చింద‌ని, ఆ హామీల్లో ఎన్ని నెర‌వేర్చిందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాదు ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇవ్వలేమ‌ని చెప్పిన కేంద్ర ఆర్ధిక‌మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌క‌ట‌న‌పై తూర్పార‌బ‌ట్టారు. 

బీజేపీ మంత్రులపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

Submitted by arun on Thu, 03/08/2018 - 12:15

మంత్రి పదవులకు రాజీనామా చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. బాగా పని చేశారని సీఎం చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు. మంత్రులు సమర్థవంతంగా పని చేసిన కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావులను చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందించారు. దేవదాయ, ధర్మదాయ శాఖలో మాణిక్యాలరావు, వైద్య, ఆరోగ్య శాఖలో కామినేని శ్రీనివాస్‌లు ఎన్నో మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా పనిచేసిన మాణిక్యాలరావు..

నీలాంటి వాడిని ఎప్పుడూ చూడలేదని సీఎం అన్నారు

Submitted by arun on Thu, 03/08/2018 - 11:14

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులా ఎవరు కష్టపడే వ్యక్తులు లేరన్నారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌. నాలుగేళ్ల పాటు మంత్రిగా పని చేయడం సంతృప్తిగా ఉందన్న ఆయన టీడీపీ, బీజేపీ నేతలందరూ కలిసి తనను గెలిపించారని గుర్తు చేశారు. తానీ స్థాయిలో ఉండటానికి కారణం బీజేపీనే కారణమన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితం తెదేపాతోనే ప్రారంభమైంది. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నాను. 2014లో వెంకయ్యనాయుడు సూచన మేరకు భాజపాలో చేరాను.

నేను నిప్పులా బతికాను: సీఎం చంద్రబాబు

Submitted by arun on Wed, 03/07/2018 - 17:00

ఏపీ హక్కుల సాధనలో తాను ఎక్కడా రాజీపడలేదని, లాలూచీ రాజకీయాలు ఎప్పుడూ చేయలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. తనపై ఎలాంటి కేసులు లేవని, నిప్పులా బతికానని చెప్పుకొచ్చారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, దేశంలో సీనియర్‌ నేతల్లో తొలిస్థానంలో ఉన్నానని చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి ఏపీలో కేంద్రాన్ని ఎప్పుడూ నిధులు అడగలేదని, ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం కాబట్టే సహకరించాలని కోరుతున్నామన్నారు. సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నానని మరోసారి చంద్రబాబు స్పష్టం చేశారు.


 

బీజేపీ ఎదురుదాడికి దిగితే.. ప్రజలు క్షమించరు : చంద్రబాబు

Submitted by arun on Wed, 03/07/2018 - 16:47

హోదా ఉన్న రాష్ట్రాలకు ఇస్తున్న రాయితీలను ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని తాను ఎన్నడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు హోదా ద్వారా ఇస్తున్న రాయితీలన్నింటినీ ఏపీకి ఇవ్వాలని ఆనాడే స్పష్టంగా చెప్పానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే తాము డిమాండ్ చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి, ఎదురుదాడికి దిగితే ప్రజలు క్షమించబోరని అన్నారు. 

ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

Submitted by arun on Mon, 03/05/2018 - 09:43

 ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తున్నారు. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. 29వ తేదీ వరకూ మొత్తం 18 పనిదినాల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా భావిస్తున్నారు. బీఏసీ సమావేశంలో దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటారు. 8వ తేదీన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈసారి కూడా సమావేశాలకు హాజరుకాకూడదని వైకాపా ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి.