third front

ఈ చర్చలు ప్రారంభం మాత్రమే

Submitted by arun on Mon, 03/19/2018 - 17:47

ఫెడరల్ ఫ్రంట్‌ నాయకత్వాన్ని భవిష్యత్తే నిర్ణయిస్తుందని ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో రెండు గంటల పాటు ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించారు కేసీఆర్‌. ఈ చర్చలు ప్రారంభం మాత్రమేనన్న కేసీఆర్‌...కలిసి వచ్చే పార్టీలతో చర్చలు జరుపుతామన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరముందని స్పష్టం చేశారు.  ప్రజల అవసరాలు తీర్చడంలో కాంగ్రెస్, బీజేపీలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. అయితే బీజేపీ, లేకపోతే కాంగ్రెస్ తప్ప దేశానికి దేశాన్ని పాలించింది ఎవరని సీఎం అన్నారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు.

సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికిన మమతా బెనర్జీ

Submitted by arun on Mon, 03/19/2018 - 15:44

బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. బెంగాల్‌ సెక్రటేరియట్‌కు వచ్చిన కేసీఆర్‌ అండ్‌ టీమ్‌కి మమతా సాదర స్వాగతం పలికారు. అనంతరం సెక్రటేరియట్‌లో మమతా బెనర్జీ, కేసీఆర్‌ సమావేశమయ్యారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యమని ప్రకటించిన కేసీఆర్‌‌ జాతీయ రాజకీయాలు, ఫ్రంట్‌ ఏర్పాటుపై మమతా బెనర్జీతో చర్చిస్తున్నారు. నాన్‌ బీజేపీ, నాన్‌ కాంగ్రెస్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సహకరించాలని కోరనున్నారు.

కేసీఆర్ ఫ్రంట్ కు గండి కొడుతున్న కాంగ్రెస్

Submitted by arun on Fri, 03/16/2018 - 14:41

‘కాంగ్రెస్, బీజేపీ దేశ ప్రజలను మోసం చేశాయి.. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పును తీసుకొస్తా.. కాలం కలిసొస్తే థర్డ్ ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తా.. అద్భుతాలు చేసి చూపిస్తా’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలకు.. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం గండి కొట్టడం మొదలు పెట్టింది. ఉత్తరప్రదేశ్ లో ఉప ఎన్నికల ఫలితాలనే ఇందుకు భూమికగా కాంగ్రెస్ వాడుకుంటోంది.

మాది థర్డ్‌ ఫ్రంట్ కాదు.. ఫ‌స్ట్ ఫ్రంట్ : మ‌ంత్రి కేటీఆర్

Submitted by lakshman on Sat, 03/10/2018 - 20:41

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు విఫ‌ల‌మ‌య్యాయ‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు. భార‌త్ కేవ‌లం రెండు పార్టీల రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌గా ఉండ‌టం స‌రికాద‌ని ఆయ‌న త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఈసంద‌ర్భంగా థర్డ్‌ ఫ్రంట్, ఎన్డీఏ కూటమిపై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మాది థర్డ్‌ ఫ్రంట్ కాదు.. ఫస్ట్ ఫ్రంట్ అని అన్నారు.  

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై కేంద్రం గురి

Submitted by arun on Sat, 03/10/2018 - 11:35

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ స్టేట్‌మెంట్ తర్వాత.. తెలంగాణపై కేంద్రం ఫోకస్ పెంచిందా..? మంత్రులతో పాటు కీలక పదవుల్లో ఉన్న టీఆర్ఎస్ నేతలందరిపై ఎందుకు నిఘా పెంచారు.? రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్ బ్యూరో కేంద్రానికి రిపోర్ట్ ఇస్తోందా.? కేసీఆర్‌, కేంద్రం, ఫెడరల్ ఫ్రంట్‌.. అంతా బాగానే ఉన్నా.. సింక్ లేకుండా వెనక కనిపిస్తున్న వాట్సాప్ సింబల్‌కు ఏంటి లింక్.? అది తెలుసుకోవాలంటే.. ముందు ఇది తెలుసుకోవాలి..

థర్డ్ ఫ్రంట్ పై.. కాంగ్రెస్ ఆలోచన ఇదేనట!

Submitted by arun on Fri, 03/09/2018 - 15:58

కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో.. ఇప్పుడు అందరికంటే కాంగ్రెస్ లోనే ఆందోళనకర పరిస్థితులు ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. దేశ వ్యాప్తంగా ఇప్పుడు 20 రాష్ట్రాల్లో (21 ఉండేవి.. కానీ ఏపీలో ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కాదు.. కేవలం టీడీపీ సర్కారే ఉంది) ఎన్డీయే ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు పని చేస్తున్నాయి.

కేసీఆర్‌ ‘థర్డ్‌ఫ్రంట్‌’ ప్రకటన వెనక మోదీ!

Submitted by arun on Tue, 03/06/2018 - 17:19

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ జపం వెనుక అసలు సీక్రెట్ ఏంటి..? మూడో ప్రత్యామ్నాయం ఆలోచన ఎవరిది..? అసలు థర్డ్ ఫ్రంట్ వెనక ఎవరున్నారు..? మూడో కూటమిపై కాంగ్రెస్ ఎందుకు విమర్శలు మొదలు పెట్టింది.

థర్డ్ ఫ్రంట్ అంటే కాంగ్రెస్ భయపడుతోందా..?.. బీజేపీకి లేని భయం కాంగ్రెస్‌‌కే ఎందుకు..?..మూడో కూటమి వల్ల ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?

కేటీఆర్‌ను సీఎం చేయడానికే...

Submitted by arun on Tue, 03/06/2018 - 17:10

థర్డ్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం. కేటీఆర్‌ను సీఎం చేయాలని ఆలోచనతోనే కేసీఆర్ జాతీయ నాయకుడిగా ఎదగాలని చూస్తున్నారని అది కరెక్ట్ కాదని చెప్పారు. త్వరలోనే తమ పార్టీ పేరు ప్రకటిస్తామన్నారు కోదండరాం. అమరవీరుల స్ఫూర్తితో ఈ నెల 10న హైదరాబాద్ లో జరిగే మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు
 

కేసీఆర్ ప్రకటన వెనక మోదీ ఉన్నారేమో?: మంత్రి అచ్చెన్నాయుడు

Submitted by arun on Tue, 03/06/2018 - 14:43

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. థర్డ్ ఫ్రంట్ వెనుక ప్రధాని మోడీ ఉన్నారన్న సందేహం వ్యక్తమవుతోందన్నారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి కేసీఆర్ ఈ ప్రకటన చేశారన్నారు. జరగబోయే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల ప్రభావం దేశరాజకీయాలపై ఉంటుందని, కర్ణాటకలో సిద్దరామయ్యే మళ్లీ గెలుస్తాడని చెప్పారు అచ్చెన్నాయుడు. 
 

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పై కాంగ్రెస్ లో అనుమానాలు

Submitted by arun on Tue, 03/06/2018 - 12:29

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ను ఒంటిరి చేసేందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ను తెరమీదకు తెస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ అన్న మోడీ ఎజెండానే కేసీఆర్ అమలు చేస్తున్నారని వారు మండిపడతున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పట్టించుకోని కేసీఆర్.. వ్యవసాయ సంక్షోభంపై మొసలికన్నీరు కారుస్తున్నారని వారంటున్నారు.