bandh

ప్రత్యేక హోదా కోసం ఏపీలో బంద్‌

Submitted by arun on Mon, 04/16/2018 - 10:32

ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ఏపీలో బంద్‌ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపుతో ప్రధాన ప్రతిపక్షాలైన వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీలు బంద్‌లో పాల్గొంటున్నాయి. ఉదయం ఐదు గంటల నుంచే బస్టాండ్ల వద్ద విపక్షాలు ధర్నాలు చేపట్టాయి. దీంతో బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. రోడ్డెక్కిన ఒకటీ అరా బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేయగా, పాలిటెక్నిక్ పరీక్షలను వాయిదా వేశారు.

రేపటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్

Submitted by arun on Thu, 03/01/2018 - 17:31

డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ రేపటి నుంచి ఐదు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్‌ పాటించాలని దక్షిణాది రాష్ట్రాల సినిమా నిర్మాతల మండలి నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో థియేటర్లను బంద్‌ చేస్తున్నట్టు సురేష్‌బాబు తెలిపారు. ఇంగ్లిష్  సినిమాలకు వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు వసూలు చేయని డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు.. ప్రాంతీయ చిత్రాలకు మాత్రం వీపీఎఫ్‌ తగ్గించడం లేదన్నారు. వీపీఎఫ్‌ ధరలు తగ్గించే వరకు థియేటర్ల బంద్‌ కొనసాగుతుందని స్పష్టంచేశారు.