deepika padukone

సస్పెన్స్‌కు తెరదించిన లవర్స్‌

Submitted by arun on Mon, 10/22/2018 - 10:57

బాలీవుడ్‌ లో మరో పెళ్లి బాజా మోగబోతోంది. ఇన్నాళ్లూ పీకల్లోతు ప్రేమలో ఉన్న హాట్‌ కపుల్‌ దీపికా పదుకొనె, రణ్‌వీర్‌ సింగ్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తమ వివాహానికి సంబంధించి డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. అలాగే వెడ్డింగ్‌ కార్డును కూడా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 

దీపికా పడుకొనే సంపాదన ఫోర్బ్స్ ప్రకారం

Submitted by arun on Mon, 10/08/2018 - 12:23

దీపికా పడుకొనే అద్భుతమైన నటి  మాత్రమే కాదు, ఫోర్బ్స్ పత్రిక ప్రకారం ప్రపంచంలోని అత్యుత్తమ రెమ్యునరేషన్ తీసుకొనే.. టాప్-10 నటీమణులలో ఆమె కూడా ఒకరు.. ఆవిడకి తన నటనతో వచ్చే  ఆదాయం ఎంతనో మీరే అంచనా వేయవచ్చు. అలాగే.. . ఆమె $ 10 మిలియన్ సంపాదనలతో జాబితాలో ఉన్న ఏకైక భారతీయమహిళ కూడా ప్రాధాన్యత కలిగివుంది. శ్రీ.కో.

రణబీర్ నాకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.. అందుకే దూరమయ్యా: దీపికా

Submitted by arun on Wed, 07/25/2018 - 14:12

బాలీవుడ్ లో ప్రేమలు, బ్రేకప్ లు సర్వసాధారణం. కానీ అక్కడి మీడియా మాత్రం ఈ విషయాలపై దృష్టి ఎక్కువగా పెడుతుంటుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గతంలో సోనమ్ కపూర్, కత్రినా కైఫ్, దీపికా పడుకొనే ఇలా చాలా మంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడు. ప్రస్తుతం అతడు అలియా భట్ తో సన్నిహితంగా మెలుగుతూ కనిపిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం దీపికా-రణబీర్ ల గురించి పలు వార్తలు వచ్చాయి. ఆమె ఏకంగా రణబీర్ కపూర్ పేరుని రెండు అక్షరాలుగా పచ్చబొట్టు కూడా వేయించుకుంది. అంతగా ప్రేమించుకున్న జంట సడెన్ గా విడిపోయారు. బ్రేకప్ అయిన తరువాత చాలా సార్లు ఆమె రణబీర్ విమర్శలు చేసింది.

మరో మూడు నెలల్లో దీపిక, రణ్‌వీర్‌ల పెళ్లి!

Submitted by arun on Wed, 03/07/2018 - 11:37

సినీ నటులు దీపికాపదుకునే.. రణ్‌వీర్ సింగ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారా అంటే.. అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. రాబోయే మూడు నాలుగు నెలలో వీరిద్దరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ కానుందన్న వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. తాజాగా రెండు కుటుంబాల పెద్దలు దీనిపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు కూడా సమాచారం. గతవారమే దీపిక తల్లిదండ్రులు ప్రకాశ్, ఉజ్జల పదుకునే బెంగళూరు నుంచి ముంబై వెళ్లి రణ్‌వీర్ తల్లిదండ్రులతో ముచ్చటించినట్టు తెలుస్తోంది.
 

దీపికా పడుకొనే సక్సెస్ మంత్ర

Submitted by arun on Thu, 02/22/2018 - 11:06

ఒకప్పుడు డిప్రెషన్ ఇప్పుడు పర్ఫెక్షన్ అప్పుడు ఏం జరుగుతుందోనని భయపడింది ఇప్పుడు ఆ భయం దరిచేరకుండా ఏం చేయాలో చెప్తోంది బెదిరించినా భయపెట్టినా ధైర్యం ముందడుగేసింది. డిప్రెషన్‌ను డీల్ చేసి గెలిచేసింది. రియల్ లైఫ్‌లో సక్సెస్‌ను మళ్లీ అందుకుంది. ఆమె బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే.

దుండ‌గుడి కాల‌ర్ ప‌ట్టుకొని చెంప ప‌గ‌ల‌గొట్టిన దీపికా

Submitted by lakshman on Sat, 02/03/2018 - 13:00

పద్మావత్ సినిమా వివాదం పై హీరోయిన్ దీపికా పదుకొని త‌న‌దైన స్టైల్లో రిప్ల‌యి ఇచ్చింది.  డైర‌క్ట‌ర్ బ‌న్సాలీ రాజ్ పుత్ వంశానికి చెందిన క‌ర్ణిసేనను కించ‌ప‌రిచేలా ప‌ద్మావ‌త్ ఉందంటూ ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఆందోళన చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. సినిమా విడుద‌ల కాకుండా ప్ర‌య‌త్నాలు చేశారు. అంతేకాదు సినిమాలో ప‌ద్మావ‌త్ గా యాక్ట్ చేసిన  దీపిక ముక్కు కోసి తెచ్చిన వారికి ఐదు ల‌క్ష‌ల్ని బ‌హుమ‌తిగా ఇస్తామ‌ని క‌ర్ణిసేన ప్ర‌క‌టించింది. క‌ర్ణిసేన‌కు మ‌ద్ద‌త‌కు గా కర్ణిసేన, శ్రీరామ సేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

సాహ‌సం.. సామ‌ర్థ్యం.. మ‌హారావ‌ల్ ర‌త‌న్‌సింగ్‌

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 13:55

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కిస్తున్న చారిత్రాత్మ‌క చిత్రం 'ప‌ద్మావ‌తి'. దీపికా ప‌దుకునే, ర‌ణ‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ హిందీ చిత్రం డిసెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సెప్టెంబ‌ర్ 20న‌ దీపికా పోషిస్తున్న‌ ప‌ద్మావ‌తి పాత్ర‌ ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేసిన చిత్ర బృందం.. ఇవాళ షాహిద్ క‌పూర్ పోషిస్తున్న మ‌హారావ‌ల్ ర‌త‌న్ సింగ్ పాత్ర ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేశారు.

'ప‌ద్మావ‌తి' ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌ అదుర్స్‌

Submitted by nanireddy on Thu, 09/21/2017 - 11:54

సంజ‌య్‌లీలా భ‌న్సాలీ సినిమాలంటే క‌ళాత్మ‌కతకి పెట్టింది పేరు. కెరీర్ ఆరంభం నుంచి ఆయ‌న శైలే అంత‌. ప్ర‌స్తుతం సంజ‌య్‌ తెర‌కెక్కిస్తున్న చిత్రం 'ప‌ద్మావ‌తి'. దీపికా ప‌దుకునే టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న‌ ఈ సినిమాలో ర‌ణ‌వీర్ సింగ్, షాహిద్ క‌పూర్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ పోస్ట‌ర్స్‌ని ఇవాళ విడుద‌ల చేశారు. ప‌ద్మావ‌తిగా దీపికా ఫ‌స్ట్‌లుక్ చూసిన‌వారంతా అదుర్స్ అంటున్నారు.