Sridevi

అనురాగ దేవత సినిమా

Submitted by arun on Sun, 11/04/2018 - 13:46

ఇది 1980లో విడుదలైన తెలుగు చిత్రం. జీతేంద్ర, రీనారాయ్, తాళ్ళూరి రామెశ్వరి నటించిన హిందీ చిత్రం 'ఆశా' ఆధారంగా ఎన్.టి.ర్ సొంతముగా  నిర్మించిన సినీమా. ఈ సినిమాకు పరుచూరి సోదరులు రచన చేశారు (ఎన్.టి.ఆర్ కు తొలిసారిగా). ఈ సినిమాలోని నటులు...నందమూరి తారక రామారావు, జయసుధ, శ్రీదేవి, నందమూరి బాలకృష్ణ. అలాగే ఈ సినిమా కథ ...... ఎన్.టి.ఆర్ లారీ ద్రైవర్. శ్రీదేవి పేరున్న గాయకురాలు. వారిరువురికి పరిచయం కలుగుతుంది. శ్రీదేవి అతన్ని ప్రేమిస్తుంది. ఐతే ఆ డ్రైవర్ కు అప్పటికే పెళ్లైపోయి ఉంటుంది (జయసుధ తో). ఒక ప్రమాదం వల్ల వారిరువురూ విడిపోతారు. జయసుధను ప్రమాదం నుండి బాలకృష్ణ కాపాడుతాడు.

శ్రీదేవి నగీనా గా “న భూతొ న భవిష్యతి”

Submitted by arun on Wed, 10/24/2018 - 16:44

నటిగా  శ్రీదేవి నటనకి మన దేశంలో ఎంతోమంది... ముగ్ధులు అయిపోతారు... అలా అందరికి నచ్చే సినిమా.. నగీనా. ఇది  1986లో విడుదలైన భారతీయ ఫాంటసీ నిండిన హింది సినిమా. ఈ చిత్రాన్ని హర్మేష్ మల్హోత్రా నిర్మించి దర్శకత్వం వహించాడు. దీనికి జగ్‌మోహన్ కపూర్ కథను అందించగా, రవి కపూర్ స్క్రీన్‌ప్లే వ్రాశాడు. దీనిలో శ్రీదేవి ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా కథ రజని అనే ఒక నాగకన్య ఒక మానవున్ని పెళ్ళి చేసుకుని తన జతగాడిని చంపిన దుష్ట మాంత్రికునిపై ప్రతీకారం తీర్చుకొనడం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో ఇంకా రిషి కపూర్, అమ్రిష్ పురి, సుష్మ సేథ్, ప్రేం చోప్రాలు నటించారు. ఈ సినిమా విడుదల కాగానే విజయవంతమయ్యింది.

నా పెళ్లి అక్కడే జరుగుతుంది: జాన్వి కపూర్‌

Submitted by arun on Fri, 10/05/2018 - 16:23

శ్రీదేవి న‌ట వార‌సురాలిగా జాన్వి కపూర్‌ బాలీవుడ్ తెరంగేట్రం చేసింది. క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన 'ధ‌డ‌క్' సినిమాతో జాన్వి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమాతోనే న‌టిగా జాన్వి మంచి మార్కులు సంపాదించుకుంది.ఈ సినిమా తరవాత ఆమెకు వరుస ఆఫర్లు వెల్లువెత్తున్నాయి.  ప్రస్తుతం ఆమె కరణ్ జోహార్ యొక్క 'తక్త్' మూవీ చేస్తోంది. ప్రముఖ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా డిజైన్ చేసిన పెళ్లికుమార్తె దుస్తులు ధరించి ‘బ్రైడ్స్‌ టుడే’ మ్యాగజైన్‌కు ఫొటోషూట్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా వారు నిర్వహించిన ఇంటర్వ్యూలో జాన్వి మాట్లాడింది.

ఆమె మరణం నాలో ఎన్నో మార్పులు తెచ్చింది!

Submitted by arun on Sat, 05/26/2018 - 12:57

అందాల తార శ్రీదేవి మృతి చెంది ఇన్ని రోజులవుతున్నా ఆమె స్మృతులు సినీ ప్రముఖులను వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా, శ్రీదేవి గురించి ప్రముఖ హీరో నాగార్జున ప్రస్తావించారు. శ్రీదేవి మరణించారంటే తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, ఆమె మరణం తనకు జీవిత పాఠం నేర్పిందని ఓ ఇంటర్వ్యూలో నాగార్జున అన్నారు. శ్రీదేవి హఠాన్మరణం తనలో వ్యక్తిగతంగా మార్పు తీసుకొచ్చిందని, తనకు ప్రియమైన వారిని మరింత ప్రశంసించేలా, వారికి ఇంకా దగ్గరయ్యేలా చేసిందని చెప్పారు. దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమలలో నటిగా ఒకే రకమైన ప్రాముఖ్యతను సంపాదించుకున్న శ్రీదేవి చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను మాటల్లో చెప్పలేమని అన్నారు.  

దుబాయ్ హోట‌ల్లో శ్రీదేవి ఎందుకు మ‌ర‌ణించిందంటే

Submitted by lakshman on Mon, 03/12/2018 - 00:23

అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణానికి కారణం ఏంటి.? కనిపించడానికి అత్యంత అందంగా.. అత్యంత ఆరోగ్యంగా ఉన్న శ్రీదేవి ఎలా చనిపోయింది..? ఎందుకు చనిపోవాల్సి వచ్చింది..? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌న్నీ ఆమె మ‌ర‌ణించిన త‌రువాత ఉత్ప‌న్న‌మ‌య్యాయి. అంతేకాదు ఆమె అందం కోసం తీసుకున్న అతి జాగ్ర‌త్త‌ల వ‌ల్ల ప్రాణాలు పోయాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. 

శ్రీదేవి అంకితభావానికి హాట్సాఫ్

Submitted by arun on Fri, 03/09/2018 - 15:37

అందాల అతివ.. అతిలోక సుందరి.. శ్రీదేవి మరణించి చాలా రోజులు గడుస్తున్నా.. బాలీవుడ్ దర్శకులు, ప్రముఖులు, సినీ పెద్దలు ఇంకా కోలుకోలేకపోతున్నారు. తేరుకోలేకపోతున్నారు. ఆమెతో కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. ఆవేదనకు గురవుతున్నారు. తాజాగా.. ఈ జాబితాలో.. బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ చేరిపోయారు.

గతంలో.. గుమ్రాహ్ సినిమా షూటింగ్ చేస్తున్నపుడు.. వర్షంలో హీరోయిన్ తడుస్తూ చేయాల్సిన ఓ సీన్ ఉందట. అప్పుడు శ్రీదేవి జ్వరంతో బాధపడుతోందని.. తాజాగా ఓ సందర్భంలో మహేష్ భట్ గుర్తు చేసుకున్నారు. అప్పుడు షూటింగ్ వాయిదా వేద్దామని తాను శ్రీదేవిని అడిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు.

మనసుని కదిలిస్తున్న శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్‌ లేఖ

Submitted by arun on Tue, 03/06/2018 - 17:48

జాన్వీ కపూర్, అతిలోక సుందరి శ్రీదేవి మొదటి కూతురు హీరోయిన్ గా మారి, ఓ సినిమా చేస్తున్న తను, ఫస్ట్ టైం తల్లి లేకుండా బర్త్ డే జరుపుకుంటోంది. అమ్మే సర్వస్వంగా పెరిగిన జాన్వీ, తన పుట్టిన రోజున, తల్లి జ్ఞాపకాలతో గడుపుతోంది. ఇద్దిర మధ్య అనుబంధాన్ని తన ఒక్క ట్వీట్ లెటర్ లోనే తెలిసేలా చేసి కదిలించింది. 
 

ఆస్కార్‌ వేడుకలో శ్రీదేవి, శశికపూర్‌కి నివాళి

Submitted by arun on Mon, 03/05/2018 - 12:16

90వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన వేడుక సినీతారల సందోహం, సందడి మధ్య కన్నులపండువగా జరిగింది. అవార్డులు ప్రకటించే ఏడాదిలో కన్నుమూసిన సినీ ప్రముఖులకు నివాళులర్పించడం ఆస్కార్‌లో సంప్రదాయంగా వస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల కన్నుమూసిన అతిలోక సుందరి శ్రీదేవిని ఆస్కార్ వేదిక గౌరవించింది. శ్రీదేవి జ్ఞాపకార్థం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేదికపై అమెకు నివాళులర్పించారు.

శ్రీదేవి మరణానికి కారణం.. తెలిసిపోయింది!

Submitted by arun on Mon, 03/05/2018 - 12:13

అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణానికి కారణం ఏంటి? కనిపించడానికి అత్యంత అందంగా.. అత్యంత ఆరోగ్యంగా ఉన్న శ్రీదేవి ఎలా చనిపోయింది? ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు ఇప్పుడిప్పుడే సమాధానాలు బయటికి వస్తున్నాయి. అందంపై అమితాసక్తి.. ఆహార్యంపై ఎడతెగని ప్రేమ.. ఈ రెండే శ్రీదేవి అకాల మరణానికి కారణమన్న మాట బలంగా వినిపిస్తోంది.

రామేశ్వరంలో కలిసిపోనున్న శ్రీదేవి…!

Submitted by lakshman on Sat, 03/03/2018 - 19:50

అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయినా.. ఆమె అందం మాత్రం ఇంకా మనల్ని విడిచిపెట్టడం లేదు. శ్రీదేవి బతికే ఉందేమో.. నిన్నటివరకూ జరిగింది కలేనేమో .. అని అనుకునే వాళ్లు కూడా ఇంకా ఉన్నారంటే.. ఎంత మాత్రం అతిశయోక్తి కానేకాదు. అంతగా తన అందంతో సమ్మోహనం చేసిన శ్రీదేవి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె అంత్యక్రియలను శాస్త్రోక్తంగా జరిపించిన కుటుంబం.. ఇప్పుడు అస్తికలను కూడా సంప్రదాయం ప్రకారం రామేశ్వరంలో కలిపేందుకు ఆమె కుటుంబం నిర్ణయించింది.