Hmtv Agri

వ్యవసాయంలో డ్రోన్ల శకం !

Submitted by arun on Mon, 03/19/2018 - 17:15

కాలం మారుతోంది. మారుతోన్న కాలంతో పాటే శాస్త్రసాంకేతిక రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. నిత్య నూతన ప్రయోగాలు, పరిశోధనలతో సరికొత్త ఆవిష్కరణలు, యంత్రాలు పరిచయమవుతున్నాయి. మానవ శ‌్రమని తగ్గించే నూతన యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వస్తున్నాయి. ఈ కోవకి చెందినదే డ్రోన్. ఇది ఆధునిక సాగుగతిని మార్చగలిగే పరిశోధన ఫలంగా నిలుస్తోంది.  వ్యవసాయ రంగంలో తన సత్తాను నిరూపించుకునేందుకు సిద్ధమైన డ్రోన్‌ టెక్నాలజీపై ప్రత్యేక కథనం.

వరిసాగులో విప్లవం సృష్టించిన సుగుణమ్మ

Submitted by arun on Tue, 03/13/2018 - 11:57

కన్నీటి కష్టాలకు కుంగిపోలేదు అడుగడుగునా ఎదురైన సమస్యలకు చలించలేదు.. అప్పుల బాధ తో చెట్టంత కొడుకు పోయినా ఆ తల్లి ముగ్గురు బిడ్డల బాగు కోసం అరక పట్టింది చెలక దున్నింది ఆధునిక వ్యవసాయ పద్ధతి లో శ్రీ వరి సాగు చేసి అందరితో శభాష్ అనిపించుకుంటోంది వరిసాగులో విప్లవం సృష్టించింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట పండించి ఆదర్శంగా నిలుస్తోంది వరంగల్ జిల్లాకు చెందిన సుగుణమ్మ. అమెరికా లో 40 దేశాలు పాల్గొన్న సదస్సు లో తన వ్యవసాయ మెళకువలను ప్రదర్శించి ఆదర్శ రైతు గా ఖండాంతర ఖ్యాతి గడించింది. సొంత భూమి లేకున్నా సొంత కాళ్లపై నిలబడి సాగులో రాణిస్తున్న సుగుణమ్మపై ప్రత్యేక కథనం. 

"రైతేరాణి"

Submitted by arun on Thu, 03/08/2018 - 16:47

వ్యవసాయం అనగానే అది మగాళ్ల జోన్ అనుకుంటారు. మహిళలు రాణించే రంగం కాదనే అభిప్రాయం కూడా బలంగానే ఉంటుంది. లెక్కలేనంత మంది మహిళలు వ్యవసాయరంగంలో పని చేస్తుంటారు. వాళ్లెవరినీ రైతులనలేం. కానీ మహిళల్లో రైతులున్నారని నిరూపిస్తున్నారు సూర్యపేటకు చెందిన శ్రీమతి శిల్ప. ఐదారు ఎకరాల్లో వ్యవసాయం చేయలేక అన్నదాతలు అవస్థలు పడుతున్న ఈరోజుల్లో 9 ఎకరాల్లో సేంద్రియ విధానంలో మల్బరీని సాగు చేస్తూ పట్టు పురుగుల పెంపకం చేపడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ మహిళా రైతు. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణించగలరంటూ విజయపథంలో ముందుకు సాగుతోంది.

కందుకూరు ఆకుకూరల టేస్టే వేరు..ఎగబడి కొంటున్న వినియోగదారులు

Submitted by arun on Wed, 03/07/2018 - 15:41

కండబలాన్ని గుండె నిబ్బరాన్ని పంట చేనుకు అంకితం ఇచ్చే రైతుకు నష్టాలు, కష్టాలు ఈ రోజుల్లో సర్వసాధరణమైపోయాయి ఎప్పుడైతే  సంప్రదాయ సాగుని విస్మరించి పురుగుమందుల వెంట పడ్డాడో అప్పుడే రైతన్న కు ఇబ్బందులు మొదలయ్యయి. పెట్టుబడి కొండంత కానీ వచ్చే దిగుబడి , రాబడి  గోరంతే వీటన్నింటిని ఎదిరించి ఖమ్మం జిల్లాకు చెందిన రైతు సేంద్రియ పద్ధతులతో ఆకుకూరలు పండిస్తున్నాడు లాభాల బాటలో పయనిస్తున్న రైతు సుధాకర్ రెడ్డి.

సేంద్రియ విధానంలో జామ సాగు చేస్తున్న కృష్ణా జిల్లా రైతు...ఎకరానికి 5 టన్నుల దిగుబడి

Submitted by arun on Wed, 03/07/2018 - 14:20

పంటల సాగు విధానం మారాలి అప్పుడే రైతు వ్యవసాయంలో రాణించగలుగుతాడు. అదే విషయాన్ని తెలుసుకున్న కృష్ణా జిల్లా రైతు, భవిష్యత్తులో ఆధునిక సాగు విధానంలో వచ్చే నష్టాన్ని ముందుగానే గుర్తించాడు. రసాయనాల సాగుకు దూరంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ జామ సాగులో మంచి ఫలితాలను అందుకుంటున్నాడు. పండ్ల తోటల సాగులో మేటి అని అనిపించుకుంటూ లాభాల బాటలో దూసుకెళుతున్నాడు.అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. 

ఒక్క గుడ్డు రూ.12

Submitted by arun on Tue, 03/06/2018 - 16:54

రోజూ తినండి గుడ్డు... వెరీ గుడ్డు అంటూ....గుడ్డు తింటే ఎన్నో లాభాలున్నాయని ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. మాములు గుడ్లలోనే ఎన్నో పోషకాలు లభిస్తాయి. అలాంటిది తూర్పుగోదావరి జిల్లాలో ఉత్పత్తయ్యే కోడి గుడ్లను తింటే ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదంటున్నారు వాటి ఉత్పత్తిదారులు. ఇంతకీ ఆ గుడ్డులో ఉన్న స్పెషాలిటీ ఏంటి. మామూలు గుడ్లకు ఈ గుడ్లకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం

వ్యవసాయంలో నయా ట్రెండ్..ఆస్ట్రేలియా ద్రాక్షపై యువ శాస్త్రవేత్త పరిశోధన

Submitted by arun on Tue, 03/06/2018 - 12:58

రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలన్నా...అధిక ఆదాయం పొందాలన్నా...వాణిజ్య పంటలతోనే సాధ్యమవుతుంది.  స్థానికంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో తన పంటను అమ్ముకున్నప్పుడే రైతు సాగులో రాణించగలుగుతాడు అందుకే సాగులో రైతులు అధిక ఆదాయం పొందాలనే ధ్యేయంతో తెలంగాణకు చెందిన శాస్త్రవేత్త హరికాంత్ తన వంతు కృషిని చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌ ఉన్న ద్రాక్షను భారత్‌ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేసి అధిక దిగుబడులను సాధిస్తున్నారు. 

మేడ మీద గోధుమ పంట...ఔరా అనిపిస్తున్న హైదరాబాద్‌ వాసి

Submitted by arun on Sat, 03/03/2018 - 12:03

భాగ్యనగరంలో ఎక్కడ చిన్న స్థలం కనిపించినా అక్కడ బిల్డింగ్ కట్టాల్సిందే ఉండేందుకు ఖాళీ స్థలం దొరకడమే గగనం అలాంటిది పంటలు పండించడం అంటే అస్సలు కుదరని పని అంతో ఇంతో ఈ మధ్యకాలంలో మేడపైన, ఇంటి ఆవరణలో కూరగాయలు, పండ్ల చెట్లను పెంచుకుంటూ తమకు కావాల్సిన ఆహారాన్ని పండించుకుంటున్నారు నగరవాసులు కానీ నేరేడ్‌మెట్‌కు చెందిన గణేష్‌ మాత్రం అందరికంటే భిన్నంగా తన మేడనే ఓ వ్యవసాయ క్షేత్రంలా మార్చేశాడు ప్రయోగాత్మకంగా డాబాపై గోధుమలు పండించాడు. వింటుంటే వింతగా ఉంది కదా .

160 గజాల మేడ...బంగారు పంటల మేళా

Submitted by arun on Thu, 03/01/2018 - 11:22

ఆలోచన ఉండాలే కాని నేలమీదే కాదు...ఎక్కడైనా పంటలు పండించవచ్చని నిరూపిస్తున్నారు భాగ్యనగరవాసి. వ్యవసాయ స్థలం లేకపోయినా మేడ మీద ఉన్న 160 గజాల స్థలం చాలు ఇంటికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పండించుకోవచ్చని నిరూపిస్తున్నారు. నారపల్లికి చెందిన రఘోత్తమరెడ్డి  చేపట్టిన వైవిద్యభరితమైన వ్యవసాయ కృషి మనల్ని అబ్బురపరుస్తుంది. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.