Kuldeep Yadav

తిప్పేసిన కుల్‌దీప్‌ దంచేసిన రాహుల్‌

Submitted by arun on Wed, 07/04/2018 - 11:05

ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది భారత్‌. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిటీష్ జట్టు జాసన్‌రాయ్, జోస్‌ బట్లర్, భారత బౌలర్లను ఆటాడుకున్నారు. ఓపెనర్ల దూకుడుకు ఇంగ్లండ్ జట్టు ఐదు ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. ఈ దశలో బౌలింగ్‌కు దిగిన కుల్దీప్‌ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు. 2వందల పరుగులు చేస్తుందకున్న బ్రిటీష్ జట్టు కుల్దీప్‌ దెబ్బకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒకే ఓవర్‌‌లో మూడు వికెట్లు తీసి భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు కుల్దీప్‌.

అశ్లీల ఫోటోపై కుల్దీప్‌ ట్వీట్..

Submitted by arun on Wed, 02/21/2018 - 13:03

భారత క్రికెట్ జట్టులో ప్రధాన బౌలర్ గా రాణిస్తున్న కుల్ దీప్ యాదవ్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు దానిలో అశ్లీల ఫోటోలు ఉంచారు. ఇన్ స్టాగ్రామ్ లో కుల్ దీప్ కు 3 లక్షల మందికి పైగా అభిమానులు ఫాలోవర్లుగా ఉండగా, సైబర్ నేరగాళ్ల పని గురించి తెలియని వారంతా, తమ ఫేవరెట్ క్రికెటర్ ఇలాంటి ఫోటో పెట్టాడేంటని అవాక్కవగా, దీనిపై కుల్ దీప్ ట్విట్టర్ మాధ్యమంగా వివరణ ఇచ్చాడు. సైబర్ నేరగాళ్లు తన అకౌంట్ను హ్యాక్ చేసి ఓ అశ్లీల ఫొటోను పోస్ట్ చేశారని, అందుకు తనను క్షమించాలని కోరాడు.