jfc

జేపీ ప్రకటనపై స్పందించిన పవన్‌కల్యాణ‌్

Submitted by arun on Sat, 03/31/2018 - 10:52

రాష్ట్ర విభజన సమస్యలపై అధ్యయనానికి స్వత్రంత్ర నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్న లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ చేసిన ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ స్పందించారు. జేపీ ఏర్పాటుచేయబోయే స్వతంత్ర కమిటీని స్వాగతించారు. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యలు, ప్రత్యేక హోదా, ఇతర సమస్యలపై లోతుగా అధ్యయనం చేయాలని కోరుతూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. 

పవన్‌కల్యాణ్‌కు ఝలక్‌ ఇచ్చిన జేఎఫ్‌సీ

Submitted by arun on Sat, 03/31/2018 - 10:32

సీన్‌ మారిపోయింది. ఇంకా చెప్పాలంటే సితారైపోయింది. పాలక పెద్దలకు సినిమా చూపిస్తామన్న జేఎఫ్‌సీలో చిన్నపాటి చీలిక కనిపించింది. పవన్‌కల్యాణ్‌కు ఝలక్‌ ఇచ్చింది. జేపీ ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల కమిటీతో పాటు జేఎఫ్‌సీ సభ్యుడు పద్మనాభయ్య వేరు కుంపటి వరకు ఎన్నో కారణాలు? కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన దానిపై జేఎఫ్‌సీ కొన్ని లెక్కలు తేల్చింది. మ‌రిప్పుడు ఈ క‌మిటీ ఏం చెప్పబోతుంది? ఏం చేయబోతోంది? 

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా రాదు..ఆ విష‌యం ప‌వ‌న్ కి తెలుసు

Submitted by lakshman on Sat, 03/31/2018 - 04:33

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ మండిప‌డ్డారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ జేఎఫ్ సీ ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే క‌మిటీ ఏర్పాటు చేసిన ప్రారంభంలో చురుగ్గా ఉన్న ప‌వ‌న్ ఆ త‌రువాత శ్ర‌ద్ధ చూపించ‌డం లేద‌ని ఆరోపించారు. నిధుల విష‌యంలో  నానా హ‌డావిడి చేసిన జ‌సేనాని ఆ విష‌యం మ‌రిచిపోయి సైలెంట్ గా ఎందుకు ఉన్నారని ప్ర‌శ్నించారు. 

జనసేనాని అంటే మీటింగులు.. ప్రెస్‌మీట్లేనా.?

Submitted by arun on Tue, 03/06/2018 - 11:40

పార్టీలో ప్యూరిటీ ఉంది.. కానీ పర్సన్‌లో క్లారిటీ లేదు. ప్రశ్నలున్నాయి.. కానీ సమాధానాల్లేవ్.. ఆశయాలున్నాయ్.. ఆచరణ లేదు. ఏదో చేయాలన్న తపన ఉంది.. కానీ.. ఎలా ముందుకెళ్లాలన్న కార్యాచరణ లేదు.. మీటింగులున్నాయి.. ప్రెస్ మీట్లున్నాయి.. కానీ.. అసలు విషయమేంటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇంతకీ.. ఆయన చర్యలు ఎందుకు ఊహతీతంగా మారాయి.?

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఏపీ బ‌డ్జెట్ నివేదిక

Submitted by lakshman on Sun, 02/18/2018 - 16:02

సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన జాయింట్‌ ఫ్యాక్ట్స్‌ ఫైండింగ్‌ కమిటీ కోరిన విధంగానే ఏపీ ప్రభుత్వం తాజాగా ఆ కమిటీకి నివేదిక అందజేసింది. విభజనచట్టంలో పేర్కొన్న అంశాలు, ప్రత్యేక ప్యాకేజీ హామీల వివరాలు, భవిష్యత్‌లో కేంద్రం నుంచి ఏపీ పొందాల్సి వున్న లబ్ధి, ఇప్పటి వరకు కేంద్రం అందించిన ఆర్థిక సహాయం, ఇంకా అందాల్సి వున్న సాయం, ఏపీలో కేంద్రం ఏర్పాటు చేయాల్సి వున్న సంస్థలు, రాష్ట్రానికి రావాల్సి వున్న ప్రాజెక్టులు, కేంద్ర బడ్జెట్ కోసం ఏపీ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలు, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి దక్కిన ఫలాలు....