nirav modi

ఆర్ధిక నేరగాళ్లంతా బ్రిటన్‌లోనే ఎందుకు తలదాచుకుంటున్నారు?

Submitted by arun on Mon, 06/18/2018 - 14:32

లలిత్‌మోడీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌మోడీ... ఇలా ఆర్ధిక నేరగాళ్లంతా బ్రిటన్‌లోనే ఎందుకు తలదాచుకుంటున్నారు? వీళ్లంతా బ్రిటన్‌నే ఎందుకు ఎంచుకున్నారు? భారత్‌లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారంతా... బ్రిటన్‌‌కే ఎందుకు చెక్కేస్తున్నారు? నేరగాళ్లకు బ్రిటన్‌ స్వర్గధామమా? అసలు రీజనేంటి?
 

నీరవ్‌ మోడీ అరెస్ట్‌కు రంగంసిద్ధం

Submitted by arun on Mon, 04/09/2018 - 16:15

బ్యాంకులకు 13వేల కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్‌మోడీ అరెస్ట్‌కు రంగంసిద్ధమైంది. అసలు నీరవ్‌ మోడీ ఎక్కడున్నాడో తెలిసింది. హాంకాంగ్‌లో నీరవ్‌ ఉన్నట్లు చైనా ధృవీకరించింది. దాంతో నీరవ్‌ను అరెస్ట్‌ చేయాలంటూ హాంకాంగ్‌ పోలీసులను భారత్‌ కోరింది. దాంతో నీరవ్‌ను అరెస్ట్‌ చేసి భారత్‌కు అప్పగించే అవకాశముంది. ఇక రెండ్రోజుల క్రితమే నీరవ్‌మోడీపై సీబీఐ నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. 

రింగ్ రూ.10 కోట్లు, వాచీ రూ.1.40 కోట్లు

Submitted by lakshman on Sat, 03/24/2018 - 13:54

మూడు రోజుల పాటు సిబిఐ, ఈడీ నిర్వహించిన సోదాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసు నిందితుడు నీరవ్ మోడీకి సంబంధించి దిమ్మ తిరిగే సంపద బయటపడింది.
నీరవ్ మోడీ. ఫోర్బ్స్‌ ధనవంతుడు. సెలబ్రిటీ వజ్రాల వ్యాపారి. తన పేరుమీదనే డైమండ్‌ రిటైల్ స్టోర్‌ స్థాపించాడు. మూడు ఖండాల్లో బంగారు వ్యాపార సామ్రాజ్యాలను నెలకొల్పాడు. ముఖ్యంగా లండన్, న్యూయార్క్‌లో ప్రధాన దుకాణాలున్నాయి. ఢిల్లీ, ముంబై, పూణేతో పాటు దేశంలోని చాలా నగరాల్లో స్టోర్స్‌ ఉన్నాయి. ఎందరో హాలీవుడ్, బాలీవుడ్ స్టార్లు మోడీ క్లైంట్స్. అన్ని పార్టీల రాజకీయ నాయకులకు ఇతను ఎంత చెబితే అంత. పార్టీలకు కోట్లకు కోట్లు విరాళాలు ఇచ్చేస్తాడు.

నీరవ్ మోడీని పట్టుకోవడంలో విఫలం

Submitted by lakshman on Sat, 03/03/2018 - 20:10

బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి విజయ్ మాల్యా దారిలో చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ విషయంలో.. కేంద్రం ఘోరంగా విఫలమైంది. విచారణకు రావాలని మెయిల్ పెడితే.. తాను వ్యాపారాల కారణంగా రాలేనని మాత్రమే రిప్లై మెయిల్ ఇవ్వడం మినహా.. నీరవ్ మోడీకి సంబంధించి ఎలాంటి సమాచారం బయటికి రాకపోవడం.. ఇప్పుడు సంచలనంగా మారింది.

చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకొని పోతుంది మోడీ

Submitted by lakshman on Sat, 02/24/2018 - 12:43

మాల్యా వార‌సుడు డైమండ్ వ్యాపారి నీర‌వ్ మోడీ పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకులో 11000కోట్ల‌ను ముంచేసి ద‌ర్జాగా విదేశాల‌కు చెక్కేసిన విష‌యం తెలిసిందే. దీంతో మోడీ కుంభ‌కోణం ఇలా చేశాడు. ఆ బ్యాంకును అలా ముంచాడు. ఈ బ్యాంకులో ఇంత తిన్నాడు. అంటూ నెట్టింట్లో ప్ర‌చారం జోరందుకుంది. అయితే వేల‌కోట్లు అప్ప‌నంగా తిన్న‌ది కాకుండా రివ‌ర్స్ లో బ్యాంకర్ల‌పై కౌంట‌ర్ అటాక్ కు దిగాడు. మీ వ‌ల్ల నాపేరు ప్ర‌తిష్ట‌లు దెబ్బ‌తిన్నాయి. దీంతో మీరు నా నుంచి రిక‌వరీ చేసుకునే అదృష్టాన్ని కోల్పోయారు. 

ఒకటి కాదు, రెండు కాదు పది లక్షల కోట్ల లూటీ

Submitted by arun on Sat, 02/24/2018 - 12:01

జన్‌ధన్‌ ఖాతాలు తెరవండి...డబ్బులతో నింపండి....అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగానే పిలుపునిచ్చారు. పాపం జనం కూడా ప్రధాని మాట విని, బ్యాంకుల్లో డబ్బు జమ చేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో పెద్ద మొత్తంలో అకౌంట్లలో వేశారు. ఇప్పుడు ఆ అకౌంట్లే లక్ష్యంగా బడాబడా పారిశ్రామిక దొంగలు దోచుకెళ్తున్నారు. నిన్న విజయ్ మాల్యా, నేడు నీరవ్‌ మోడీ, రేపు ఇంకెందరో...ఇలా లెక్కేసుకుపోతే, పారిశ్రామికవేత్తలు బ్యాంకులను దోచేసింది ఎంతో తెలుసా...

కారులేని ప్రధాని ఎవరో తెలుసా మీకు?

Submitted by arun on Wed, 02/21/2018 - 16:44

వేల కోట్ల రుణాలు ఎగనామం పెట్టిన నీరవ్ మోడీ విదేశాల్లో విందులు ఆరగిస్తూ జల్సా చేస్తున్నాడు. ఆయన తరఫు వకీళ్లు, అనుచర వర్గం మాత్రం ఇందులో నీరవ్ మోడీ నిర్దోషి అని, టూజీ కేసులో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుందని బుకాయిస్తున్నారు. కానీ మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇదే పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి ఓ చిన్న అవసరం కోసం చాలా చిన్న మొత్తం లోన్ తీసుకున్నారు. మరి శాస్త్తి చెల్లించారా చిన్న మొత్తమే కదా అని లైట్ తీసుకున్నారా? ఈ స్టోరీలో చూడండి. 

నీరవ్‌ మోడీ దుబాయ్‌లో ఉన్నట్టు గుర్తించిన అధికారులు

Submitted by arun on Tue, 02/20/2018 - 17:39

పంజాబ్ నేషనల్ బ్యాంకుని నిండా ముంచేసి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోడీ దుబాయ్‌లో ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు సమాచారం. దీంతో ఇప్పుడు ఆయనను వెనక్కి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే, అదంత సులువైన పని కాదని నిపుణులు చెబుతున్నారు. దేశం విడిచి పారిపోయి విదేశాల్లో తలదాచుకుంటున్న నిందితులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం మొత్తం 47 దేశాలతో ఒప్పందాలు చేసుకోగా, 9 దేశాలతో సర్దుబాట్లు చేసుకుంది. ప్రస్తుతం నీరవ్‌ మోడీకి చెందిన ఆస్తులు ఎక్కడెక్కడున్నాయో గుర్తించి, జప్తు చేసుకునే పనిలో ఉంది ఈడీ.

దేశంలో దొంగలు పడ్డారు..

Submitted by arun on Sat, 02/17/2018 - 12:06

దేశంలో దొంగలుపడ్డారు. కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. కానీ వీళ్లు దొంగలా చోరీ చేయరు. దొరలా జనం సొమ్మును కాజేస్తారు. దర్జాగా విదేశాలకు పారిపోతారు. బ్యాంకులు, అధికారులు, పాలకులు అందరూ నిద్రలేవకముందే, డబ్బుల మూటలు సర్దుకుని ఎగిరిపోతారు. దొంగలు బాబోయ్ దొంగలు. టక్కు టమార టక్కరి దొంగలు.

దేశం వ‌దిలి పారిపోతున్న మాల్యా వార‌సులు

Submitted by lakshman on Fri, 02/16/2018 - 00:18

దేశంలో విజ‌య్ మాల్యా వార‌సులు వెలుగులోకి వ‌స్తున్నారంటూ నేష‌న‌ల్ మీడియా క‌థ‌నాల్ని ప్ర‌చారం చేస్తుంది. వ్యాపార కార్య‌క‌లాపాల్ని కొన‌సాగించేందుకు ఈ జ‌ల్సారాయుడు ప‌లు బ్యాంకులు వ‌ద్ద రూ. 9 వేల‌కోట్ల రుణాల్ని పొందాడు. ఆ రుణాల్ని చెల్లించే స‌మ‌యానికి మాల్యా డ‌బ్బుక‌ట్ట‌కుండా మార్చి2న దేశ వ‌దిలి పారిపోయి లండ‌న్ లో త‌ల‌దాచుకుంటున్నాడు. ఆ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తూ..ప‌లు కోర్టుల్లో తాను అమాయ‌కుడినంటూ సానుభూతి పొందే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.
బ్యాంకులకు ఎగ్గొట్టిన రుణాలు :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - రూ. 1600 కోట్లు
ఐడీబీఐ - రూ. 800 కోట్లు