narandra modi

మెట్టు దిగిన మోడీ-అమిత్ షా: అద్వానీ-మురళీ మనోహర్ జోషిలకు బుజ్జగింపు

Submitted by arun on Wed, 06/06/2018 - 17:28

తాజా ఉప ఎన్నికల ఫలితాలతో మోదీ ,అమిత్‌ షాలకు తత్వం బోధపడిందా ?  2019 ఎన్నికల్లో విజయం సాధించాలంటే నాలుగు అడుగులు వెనక్కు వేయక తప్పదని భావిస్తున్నారా ? దూరమవుతున్న మిత్రులను కలుపు కునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారా ?  ఇందుకోసం వృద్థతరం నేతలను  తెర మీదకు తెచ్చేందుకు అధినేత  అమిత్‌ షా స్వయంగా రంగంలోకి దిగారా ? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలకు కమలనాథుల నుంచి అవుననే సమాధానాలు  వినిపిస్తున్నాయి. 

మోదీకి తొమ్మిది పైసల చెక్ విరాళం

Submitted by arun on Tue, 06/05/2018 - 15:47

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చందు గౌడ్ అనే వ్యక్తి పెట్రోల్ ధరల పెరుగుదలపై మండిపడుతున్నాడు. పెట్రోల్ ధరలు 9 పైసలు తగ్గడంతో తన ఆవేదనను ప్రదానికి తెలియజేయాలని భావించారు.  వినూత్నంగా ఆలోచించి రంగంలో దిగాడు. ప్రధానికి తన నిరసనను తెలియజేసేందుకు పూనుకున్నాడు. ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు 9 పైసలు చెక్‌ను విరాళంగా అందజేశాడు. సిరిసిల్ల ప్రజావాణిలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌కి చెక్ అందించాడు. ప్రధాని నరేంద్రమోడీకి అందజేయాలని కోరాడు. 
 

జేసీ దివాకర రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Wed, 02/14/2018 - 15:11

టీడీపీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  చంద్రబాబు జాతీయ స్థాయిలోఎదగ కూడదనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గతంలో మూడవ కూటమి ఏర్పాటులో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారనే భయం మోడీకి ఉందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినా ఫలితం ఉండదన్న జేసీ..పదవీ త్యాగాల వల్ల ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం లేదని అన్నారు.