Sekhar Kammula

నాకేం సంబంధం లేదు : శేఖర్‌ కమ్ముల

Submitted by arun on Wed, 06/27/2018 - 13:22

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల పేరును వాడుకుంటూ, సినిమా అవకాశాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన ప్రబుద్ధుడిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శేఖర్ కమ్ముల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం పూర్వాపరాలను పరిశీలిస్తే, ఓ యువకుడు తాను శేఖర్ కమ్ముల అసిస్టెంట్ నని ప్రచారం చేసుకుంటూ, తాము తీయబోయే తదుపరి చిత్రానికి నటీ నటులు కావాలంటూ ఆన్ లైన్ లో ఫేక్ యాడ్స్ పెట్టాడు. వీటిని నమ్మి సంప్రదించిన అమ్మాయిలు, అబ్బాయిల నుంచి తన బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయించుకున్నాడు. అనంతరం తమకు అవకాశాలు ఎప్పుడు ఇస్తారంటూ శేఖర్ కమ్ములను కొందరు బాధితులు సంప్రదించారు.

శేఖర్ కమ్ములకు శ్రీరెడ్డి వార్నింగ్

Submitted by arun on Wed, 04/04/2018 - 12:44

శేఖర్ కమ్ముల అని పేరేమీ పెట్టకుండా ఆయన పేరు ధ్వనించేలా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ఇలాంటి వ్యాఖ్యల్ని ఇగ్నోర్ చేస్తే పోయేదేమో? కానీ మాట్లాడకుండా సైలెంటుగా ఉంటే జనాలు ఇందులో నిజం ఉందని భ్రమిస్తారేమో అని కమ్ముల కొంచెం ఘాటుగానే స్పందించాడు. క్షమాపణ చెప్పు లేదా లీగల్ యాక్షన్ కు రెడీగా ఉండు అంటూ హెచ్చరించాడు కమ్ముల. దీంతో శ్రీరెడ్డి డౌన్ అవుతుందనుకున్నారు చాలామంది. కానీ ఆమె మాత్రం ఘాటుగానే స్పందించింది. అయితే శేఖర్ కమ్ముల ఫేస్‌బుక్‌లో తనను ఉద్దేశించి పెట్టిన పోస్ట్‌పై శ్రీరెడ్డి ఘాటైన కౌంటర్ ఇచ్చింది.

ఆ నటికి శేఖ‌ర్ క‌మ్ముల వార్నింగ్‌

Submitted by arun on Tue, 04/03/2018 - 17:13

కొందరు దర్శకులు, నిర్మాతలు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు చేస్తూ ఓ తెలుగు నటి సోషల్‌మీడియాలో సంచలనాత్మక పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ములను కూడా ఉద్దేశిస్తూ సోమవారం ఆమె ఓ పోస్ట్‌ పెట్టారు. దీనిపై శేఖర్ కమ్ముల సీరియస్‌గా స్పందించారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. 'నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది.

ఒక‌టి లేదు..రెండు లేదు

Submitted by lakshman on Wed, 02/14/2018 - 06:11

నాని నిర్మాత‌గా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో  అ అనే చిత్రం ఈ వారం విడుద‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే.  ఈ చిత్రం మేకింగ్ నుంచి టీజ‌ర్ రిలీజ్ వ‌రుకు విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకుంది.  ఎవ‌రి పాత్ర ఏంటో అర్ధ‌కాకుండానే నిర్మాత నాని టీజ‌ర్ రిలీజ్ చేయ‌డం విశేషం.  ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ రెజీనా క‌సాండ్రా  వెస్ట్రన్ ఔట్ ఫిట్స్.. స్టైలింగ్ తో ఆక‌ట్టుకుంటుంది.  రెజీనా గెట‌ప్ చూస్తే హాలీవుడ్ లో ఆస్కార్ కు నామినేట్ అయిన  యాక్ట్రెస్ రూనీ మురా..లిజ‌బెత్ స‌లెండ‌ర్ పాత్ర‌లో  'ది గాళ్ విత్ ది డ్రాగన్ టాటూ' మూవీలో యాక్ట్ చేసింది. అందులో  రూనీ డ్ర‌గ్ ఎడిక్టర్.