Chennai scientists grow ear

పాత చెవిని తీసేసి కొత్త చెవిని అమ‌ర్చుకోవ‌చ్చు

Submitted by lakshman on Tue, 02/13/2018 - 08:48

చెవి లోపంతో పుట్టిన ఐదుగురు పిల్లల కోసం ల్యాబ్‌లో చెవులను తయారు చేశామని వారం క్రితం చైనా ప్రకటించింది. సరిగ్గా వారం తిరిగిందో లేదో.. చెన్నై పరిశోధకులు కూడా ల్యాబ్‌లో కృత్రిమంగా చెవిని అభివృద్ధి చేశారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. కల్చర్ ఫ్లాస్క్‌లో తాము అభివృద్ధి చేసిన చెవి కార్టిలేజ్‌ను కుందేలులో ప్రవేశపెడితే.. చెవిగా అభివృద్ధి చెందిందని ఎస్ఆర్ఎం శాస్త్రవేత్తలు తెలిపారు. మునుపు అలా చేసిన ప్రయోగాలు ఎన్నో విఫలమయ్యాయని, తాము మాత్రం దీంట్లో విజయవంతమయ్యాయని శాస్త్రవేత్తలు చెప్పారు.