ccdmc

అమ‌రావ‌తి ఎంట్ర‌న్స్ అదిరింది

Submitted by lakshman on Tue, 02/13/2018 - 08:20

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి రూపురేఖ‌లు రానున్నాయి. రాజధాని నిర్మాణం ఇక‌పై ఊపందుకోనుంది. నిన్న‌మొన్న‌టిదాకా భూ సేకర‌ణ‌, డిజైన్ల ఎంపిక‌కే ప‌రిమిత‌మ‌యిన రాజ‌ధాని నిర్మాణం.. ఇక వేగ‌వంతం కానుంది. ముఖ్యంగా త్వ‌ర‌లోనే అమ‌రావ‌తి ఎంట్ర‌న్స్‌ను పూర్తి చేయాల‌ని సంక‌ల్పించింది చంద్ర‌బాబు స‌ర్కార్‌. ఆ డిజైన్‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాను ఊపేస్తున్నాయి. అవి పూర్తి అయితే చంద్ర‌బాబు క‌ల‌లు కంటున్న ప్ర‌పంచ స్థాయి రాజ‌ధానికి బీజం ప‌డ‌నుంద‌ట‌. తాజాగా రిలీజ్ అయిన ఆ డిజైన్‌లు అంద‌రి మ‌దిని తొలుస్తున్నాయి.ఈ ఎంట్ర‌న్స్‌ను విజ‌య‌వాడ‌ను ఆనుకొని ఉన్న కృష్ణా న‌దిపై ఉన్న వార‌ధి నుంచే మొద‌లు కానుంద‌ట‌.