Allahabad

షాకింగ్... ఒకే ఇంట్లో ఐదు మృతదేహాలు..

Submitted by arun on Tue, 08/21/2018 - 11:33

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ ఇంట్లో అయిదుగురు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. భార్యాభర్తలు, ముగ్గురు కూతుళ్ల మృతదేహాలను.. తాళం వేసిన ఇంటి నుంచి పోలీసులు రికవర్ చేశారు. అలహాబాద్‌లోని దమన్‌గంజ్‌లో ఈ ఘటన జరిగింది.  దుమన్ జంగ్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంటిలో మనోజ్ కుష్వాహా(35) తన భార్య, ముగ్గురు కుమార్తెలతో ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు కనిపించకపోవడంతో ఇంటి పక్కన వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేసరికి ఇంటికి తాళం వేసి ఉంది.

న్యాయ శాస్త్ర విద్యార్థిని కొట్టి చంపిన దుండ‌గులు

Submitted by arun on Mon, 02/12/2018 - 12:10

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో దారుణం జరిగింది. న్యాయ శాస్త్రం చదువుతున్న విద్యార్థిని కొంతమంది దుండగులు కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అలహాబాద్‌లోని కాలికా రెస్టారెంట్‌లో గత శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన సంబంధించిన సీసీ ఫుటేజీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దిలీప్‌ అనే లా సెకండియర్‌ విద్యార్థి తన స్నేహితులతో డిన్నర్‌ చేయడానికి కాలికా రెస్టారెంట్‌కు వెళ్లాడు. విజయ్‌ శంకర్‌ అనే వ్యక్తికి దిలీప్‌ కాలు తగిలిందన్న విషయంలో చిన్నగొడవ మెదలైంది. డిన్నర్‌ అనంతరం మరో సారి వీరి మధ్య గొడవ జరగడంతో రెస్టారెంట్‌ బయట కొట్టుకున్నారు.