Telangana CM K Chandrasekhar Rao

తెర‌పైకి సీఎం కేసీఆర్ మ‌రో వార‌సుడు

Submitted by lakshman on Mon, 02/12/2018 - 03:04

తెలంగాణ‌లో అధికార‌ప‌క్ష‌మైన టీఆర్ఎస్ పార్టీలో మ‌రో ఎన్నిక‌ల సంద‌డి తెర‌మీద‌కు వ‌చ్చింది. కీల‌క‌మైన రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ ప‌డే ఆశావ‌హుల పేర్లు జోరుగా తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. అయితే ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజ‌కీయ వార‌సుల జాబితాలో మ‌రో పేరు జ‌త కానుంద‌ని అంటున్నారు. ఆయ‌నే ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌దిన కుమారుడు, టీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంతోష్‌కుమార్‌. ఆయ‌న పేరు ముఖ్య‌మంత్రి కేసీఆర్ సీరియ‌స్‌గా  ప‌రిశీలిస్తున్నార‌ని తెలుస్తోంది.