Akshay Kumar

700 కోట్ల క్ల‌బ్‌లో చేరిన తొలి కోలీవుడ్ సినిమా

Submitted by chandram on Fri, 12/14/2018 - 15:17

శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్‌గా అత్యంత విజువల్ వండర్ 2.0 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సూనామి సృష్టిస్తోంది. కేవలం ఒక్క హిందీలోనే వంద కోట్లలకి పైగా వసూళ్లు రాబట్టింది. ఎనిమిది రోజుల‌కి గాను 500 కోట్లు సాధించింది. కాగా ప‌దిహేను రోజుల‌లో 700 కోట్ల క్లబ్‌లో చేరింద‌ని స‌మాచారం. ఇంత పెద్ద వసూళ్ల పైసల వర్షం కూరిపించిన తొలి కోలీవుడ్ మూవీగా 2.0 రికార్డుల‌కి ఎక్కింద‌ని చెబుతున్నారు.

‘2.0’కు ఉమైర్ సంధు ఎంత రేటింగ్ ఇచ్చారంటే...

Submitted by chandram on Thu, 11/29/2018 - 14:38

రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్లతో కూడిన ఏస్ డైరెక్టర్ శంకర్ 2.0 మెన్యువల్ ఓపస్ 2.0 ను గ్రాండ్ గా విడుదల చేశారు. టిక్కెట్లు హాట్ కేక్స్ లాగా విక్రయించబడతాయి మరియు వాణిజ్య మొదటి వారాంతంలో పెద్ద సేకరణలు చేయబోతున్నామని ఆశిస్తున్నారు. సినిమా విడదలై కొన్ని గంటలు కాకుండానే ఇప్పటికే విమర్శకులు వారి అభిప్రాయలను సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రారంభించారు. యూకే సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు తన రివ్యూని ట్విటర్ ద్వారా ఇచ్చేశారు. 2.0 చిత్రం కోసం 4-నక్షత్రాల రేటింగ్ ఇవ్వడంతో, ఈ చిత్రం ప్రారంభం నుండి చివరి వరకు రజినీకాంత్ షో అని అన్నారు.

'2.ఓ' హిందీ వెర్షన్ తొలిరోజే 25 కోట్లు వసూళ్లా ?

Submitted by chandram on Thu, 11/29/2018 - 14:23

ఇటు రజనీ  అటు అక్షయ్ అభిమానుల నిరీక్షణకు తెరదించేస్తూ '2.ఓ' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. '2.ఓ' సినిమా చూసిన సినీ ప్రముఖులు తమదైన శైలిలో చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఈ మూడు భాషల్లోను తొలి షో నుంచే మంచి స్పందన వస్తుంది. ఈస వసూళ్ల విషాయానికి వస్తే గతంలో 'రోబో' సినిమా హిందీ వెర్షన్ ఫుల్ రన్ లో 20 కోట్లను వసూలు చేసింది. ఇక '2.ఓ' సినిమా హిందీ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజునే 25 కోట్లను వసూలు కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మిగత భాషల్లోనూ 2 ఓ జోరుగా ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూకడుతున్నారు.

‘రోబో 2.ఓ’ ట్విట్టర్ రివ్యూ...

Submitted by arun on Thu, 11/29/2018 - 09:57

భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన సినిమా రోబో 2.ఓ. ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించారీ సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్, యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్, అందాల భామ అమీ జాక్సన్ లాంటి భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీకి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.యూఎస్ లో, ఇండియాలోని ప్రధాన నగరాలలో ప్రీమియర్స్ సందడి మొదలైంది. సోషల్ మీడియాలో ఈ చిత్రానికి ఎలాంటి స్పందంగా వస్తుందో ఇప్పుడు చూద్దాం.

మీటూ ఎఫెక్ట్‌తో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న అక్ష‌య్

Submitted by arun on Fri, 10/12/2018 - 14:33

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని ‘మీటూ’ మూమెంట్ కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లండన్‌లో ఉన్న తాను గతరాత్రే ఇండియాకు వచ్చానని.. ఇక్కడ జరుగుతున్నదంతా తెలుసుకున్నానని.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ ఒక్కరితోనూ ఇకపై పనిచేసేది లేదని ఆయన ట్విటర్ ద్వారా స్పష్టం చేశారు. అక్షయ్ ప్రస్తుతం నటిస్తున్న ‘హౌస్‌ఫుల్ 4’ మూవీ డైరెక్టర్ సాజిద్ ఖాన్‌పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమా షూటింగ్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. గ‌త రాత్రి ఇట‌లీ నుండి ఇండియాకి వ‌చ్చాను. ఇక్క‌డి వార్త‌లు నన్ను చాలా డిస్ట్ర‌బ్ చేశాయి.

రోబో 2.O టీజర్ రిలీజ్...నెట్ లో హల్ చల్ చేస్తోన్న టీజర్

Submitted by arun on Thu, 09/13/2018 - 10:43

సూపర్ స్టార్ రజనీ కాంత్ అప్ కమింగ్ మూవీ రోబో 2.O టీజర్ రిలీజైంది. వినాయక చవిత సందర్భంగా ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో తీస్తున్నారు. బాహుబలిని మించిపోయేలా గ్రాఫిక్స్ తో రోబో.2. O రాబోతోంది. విడుదలైన గంటల్లో ఈ టీజర్ కు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. రజనీ మరోసారి సైంటిస్ట్‌ అవతారం ఎత్తి చిట్టి (రోబో) రూపంలో అన్ని సమస్యలు తీర్చనున్నాడు. ఈ టీజర్‌లో శంకర్‌ తన మార్క్‌ చూపించాడు. అక్షయ్‌కుమార్‌ బయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ టీజర్‌లోనే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అదరగొట్టేశాడు.

‘గీత గోవిందం’ హవా.. ఇద్దరు స్టార్ హీరోలను వెనక్కి నెట్టేసిన విజయ్

Submitted by arun on Mon, 08/20/2018 - 12:08

విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాజమౌళి, చిరంజీవి లాంటి ప్రముఖులు.. సినిమా బాగుందని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అందుకు పూర్తి విరుద్ధమైన గెటప్‌లో విజయ్ కనిపించిన ఈ సినిమాకు ప్రశంసలే కాదు కలెక్షన్లు కూడా బాగున్నాయి. ఇప్పటికే అమెరికాలో వన్ మిలియన్ క్లబ్‌లో చేరిన గీత గోవిందం, ఆస్ట్రేలియాలో ఈ చిత్రం ‘గోల్డ్’, ‘సత్యమేవ జయతే’ చిత్రాలతో పోటీ పడి అగ్రస్థానంలో ఉంది.

ప్యాడ్ మ్యాన్..ప్యాడ్ మ్యాన్..ప్యాడ్ మ్యాన్

Submitted by lakshman on Mon, 02/12/2018 - 02:31

గత కొన్నేళ్లలో అద్భుతమైన పాత్రలు.. కథలతో సినిమాలు చేసి తన స్టేచర్ ఎంతో పెంచుకున్నాడు అక్షయ్ కుమార్. ఒకప్పుడు మైండ్ లెస్ యాక్షన్ సినిమాలు... కామెడీ మూవీస్ చేసిన అక్షయ్ నుంచి ఇప్పుడు వస్తున్న సినిమాలు షాకిచ్చేవే. ముఖ్యంగా నిరుడు ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ లాంటి షాకింగ్ అండ్ బోల్డ్ మూవీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు అక్షయ్. ఆ సినిమాకు మంచి ఫలితం కూడా దక్కింది.