kesineni nani

చంద్ర‌బాబు ఉండ‌గా..పొలిటిక‌ల్ జేఏసీ ఎందుకు దండ‌గా

Submitted by lakshman on Mon, 02/12/2018 - 02:15

ఏపీ సీఎం చంద్రబాబు ఉండగా జేఏసీ ఎందుకు అంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు..ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏపీలో సంచలనం సృష్టిస్తున్నాయి..ఏపీ కి ప్రత్యేక హోదా ఏర్పాటు కై జేఏసీ ఏర్పాటు చేయాలని యోచించిన పవన్ కళ్యాణ్ కి ఆదిలోనే ప్రశ్నలు మొదలయ్యాయి..ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో జెఎసిని ఏర్పాటు చేయాలని జనసేన పవన్ నిర్ణయించుకున్న విషయం అందరికీ తెలిసిందే.జేఏసీలో  ఏపీకి కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయమై ఒత్తిడి పెంచేందుకు కార్యాచారణపై చర్చించనున్నారు…అయితే ఏపీ కి చంద్రబాబు సీఎం గా ఉండగా ఏపీ హక్కుల విషయంలో ,నిధుల విషయంలో, ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రశక్తిలేదని తెలిపారు.