railway zone

రైలు ముచ్చట "తూచ్చు"

Submitted by arun on Mon, 07/30/2018 - 13:37

ఆంధ్రప్రదేశ్లో రైల్వేజోన్ కదలిక,

ఇక లేదని తెలిపిన హోంశాఖ,
 
తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి,
 
పెట్టను మెలిక, ఆ"హోమ్" శాఖ. శ్రీ.కో

జోన్‌ మీద రివిజన్‌

Submitted by arun on Mon, 02/12/2018 - 09:18

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై కేంద్రం ఆలోచన మొదలుపెట్టిందా? దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్న డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించే అవకాశాలు ఏమేరకు వున్నాయి? జోన్ ఏర్పాటుకు  వుండే అవకాశలు పరిశీలిస్తే  వాల్తేర్ రైల్వే డివిజన్ ఏమీ తక్కువకాదేనే అంశాన్ని ఇప్పుడిప్పుడే కేంద్రం గుర్తించిందా? ఒక వేళ జోనే ఏర్పాటైతే భువనే‌శ్వర్ కేంద్రంగా వున్న తూర్పుకోస్తారైల్వేతో ముడిపడి వుండే అంశాలపై ఆచితూచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? విశాఖ రైల్వే జోన్‌ని ఏ రకంగా ఏర్పాటు చేస్తే ఆదాయవనరులను నష్టపోకుండా వుంటుంది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

విశాఖ రైల్వేజోన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌!

Submitted by arun on Sat, 02/10/2018 - 18:06

విభజన హామీల అమలు కోసం అటు మిత్రపక్షం టీడీపీ నుంచి ఇటు ఏపీ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో కేంద్రం జాగ్రత్తగా అడుగులేస్తోంది. పరిస్థితి చేయి దాటకముందే శాంతింపజేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ప్రస్తుతానికి రైల్వే జోన్‌‌పై ప్రాథమిక ప్రకటన చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించిన కేంద్రం విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో కలిపి కొత్త రైల్వే జోన్‌పై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అతిత్వరలో ప్రాథమిక ప్రకటనచేసి వారం రోజుల్లో బౌండరీస్‌ డిసైడ్‌ చేయనున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.