tholi prema movie

‘తొలి ప్రేమ’ సినిమా క‌లెక్ష‌న్స్

Submitted by lakshman on Mon, 02/12/2018 - 02:47

ఒక సినిమాకు ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉండి.. రిలీజ్ తర్వాత కూడా పాజిటివ్ టాక్ వచ్చి.. దానికి పోటీగా వచ్చిన సినిమాలకు పూర్తి నెగెటివ్ టాక్ వస్తే.. అంతకంటే కావాల్సిందేముంది..? వసూళ్లు అంచనాల్ని మించిపోతాయి. ‘తొలి ప్రేమ’ విషయంలో అదే జరుగుతోంది. ఈ చిత్రానికి వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యధికంగా తొలి రోజు రూ.5 కోట్లకు పైగా షేర్ రావడం విశేషం. అమెరికాలో అయితే ఈ సినిమా అదరగొట్టేస్తోంది. ఈ సినిమా రిలీజైంది శనివారమే అయినా.. రెండు రోజుల ముందే.. అంటే గురువారమే ప్రిమియర్లు వేసేశారు. రిలీజ్ కొంచెం పెద్ద స్థాయిలోనే చేయడం. ప్రిమియర్లకు పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లు వచ్చాయి.

‘తొలిప్రేమ’ టాక్: మాట నిలబెట్టుకున్న వరుణ్

Submitted by arun on Sat, 02/10/2018 - 10:56

ఫిదా సినిమా తర్వాత..మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి ఆడియన్స్ ఆకట్టుకున్నాడు. క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీతో వచ్చిన తొలిప్రేమ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. యూత్ కి నచ్చేలా..అందమైన ప్రేమకథని అంతే అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ వెంకి అట్లూరి. మ్యూజిక్ కూడా మనుస్సుకు హత్తుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ, ఫస్ట్ ఆఫ్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. 

' తొలిప్రేమ ' ఓవ‌ర్సీస్ రిపోర్ట్ ఎలా ఉందంటే..

Submitted by arun on Fri, 02/09/2018 - 11:18

బాబాయ్ సినిమా టైటిల్ ను ఉపయోగించుకుంటూ సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నాడు వరుణ్ తేజ్. తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో తొలిప్రేమ సినిమాకు ప్రత్యేక ప్రస్థానం ఉంది. మరి ఆ టైటిల్ రేంజ్ ను వరుణ్ తేజ్ ఏ మేరకు నిలబెడతాడో త్వరలోనే పూర్తి స్పష్టత వస్తుంది. బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ నిర్మించిన ఈ సినిమాకు కొత్త ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ప్రోమోలు ఆస‌క్తిగా ఉండ‌డంతో టాప్ డిస్ట్రిబ్యూట‌ర్ కం ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌ను కొనేశారు.