Rangasthalam Movie

సుక్కూ.. దేవీ కాంబో.. మళ్లీ సూపర్ హిట్

Submitted by arun on Sat, 03/03/2018 - 09:12

సుకుమార్ సినిమాలంటే.. దేవిశ్రీప్రసాద్ ఎలాంటి ఊపున్న పాటలిస్తాడో.. అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ మాటను మరోసారి నిజం చేశాడు దేవీ. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న రంగస్థలం సినిమా మొదటి పాట ఎంత సక్కంగున్నవే ఎంతటి సెన్సేషన్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో.. రంగా రంగా రంగస్థలాన పాట కూడా వచ్చేసింది.

1984 నాటి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో.. రెండో పాట కూడా.. అదే తీరుగా పిక్చరైజ్ చేశారు. వినిపించేటట్టు కాదురా.. కనిపించేటట్టు కొట్టండి అంటూ.. రామ్ చరణ్ చెప్పడం.. అతని క్యారెక్టర్ గురించి మరోసారి హింట్ ఇచ్చినట్టయింది. సినిమాలో జాతర సీన్ సందర్భంగా ఈ పాటను పెట్టినట్టుగా కనిపిస్తోంది.

రామలక్ష్మి గా రాబోతున్న సమంత

Submitted by arun on Fri, 02/09/2018 - 10:30

రామ్‌చరణ్‌ – సమంత జంటగా రానున్న మూవీ ‘రంగస్థలం’. షూట్ దాదాపుగా పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా చిట్టిబాబుగా చెర్రీని పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌ సినీ లవర్స్‌ని ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సమంత పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ‘మా రామలక్ష్మిని శుక్రవారం 11 గంటలకు కలవండి’ అంటూ ఓ పోస్టర్‌ని అభిమానులతో షేర్ చేసింది యూనిట్. కాగా ఈ విషయాన్ని మన సమంత మళ్ళీ గుర్తుచేసేందుకు ట్విట్టర్ లో పోస్ట్ కూడా పెట్టింది.