vijay sai reddy

మోడీని విమర్శిస్తే.. విజయాసాయిరెడ్డికి బాధేంటి..?

Submitted by arun on Tue, 04/03/2018 - 10:46

రాష్ట్రానికి అన్యాయం చేశారని ప్రధాని మోడీని విమర్శిస్తే.. విజయసాయిరెడ్డికి బాధేంటని.. టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. చంద్రబాబుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం చూస్తే.. బీజేపీ, వైసీపీ మధ్య సంబంధం ఏంటో తెలుస్తుందన్నారు. జగన్ రిమోట్ కంట్రోల్.. మోడీ దగ్గర ఉందన్న ఆంజనేయులు.. మాల్యా దగ్గర చంద్రబాబు 150 కోట్లు తీసుకున్నారని చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు చూపించాలని సవాల్  విసిరారు. 

నాపై వ్యాఖ్యలు నిరూపిస్తే ఉరి తీసుకుంటా

Submitted by arun on Wed, 03/28/2018 - 16:44

ఏపీ సీఎం చంద్రబాబుపై.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బాబుతో పాటు ఆయన కేబినెట్‌లోని పలువురు మంత్రులు, టీడీపీ నేతల బండారాన్ని, ఎంపీల వ్యవహారాల గురించి సాయిరెడ్డి మాట్లాడటంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  తాజాగా మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పందిస్తూ..విజయసాయిరెడ్డిపై మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ఒక కుసంస్కారి అని...వైసీపి సంస్కారం లేని పార్టీ అని విమర్శించారు. తప్పుడు లెక్కలు, దొంగ కంపెనీలు పెట్టడంలో విజయసాయి దిట్ట అని అన్నారు. మోదీ కాళ్ళు పట్టుకున్న విజయసాయిని దేవుడు కూడా కాపాడలేడని తెలిపారు.

పీఎం కాళ్లుమొక్కిన విజ‌య‌సాయి..ఇదేనా మ‌న సాంప్ర‌దాయం

Submitted by lakshman on Wed, 03/28/2018 - 10:59

వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి పై సీఎం చంద్ర‌బాబు మండిప‌డ్డారు. త‌న‌పై విజ‌య సాయి చేసిన వ్యాఖ్య‌లు దారుణ‌మ‌ని  అన్నారు. నిన్న‌మీడియాతో మాట్లాడిన విజ‌య సాయి చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేశారు. 
ప్ర‌త్యేక‌హోదాపై చంద్ర‌బాబుకు చిత్త‌శుద్దిలేద‌ని క‌డిగిపారేశారు. టీడీపీ నేతలు దొంగలు , చంద్రబాబు గజ నేరగాడు , నిజం చెప్పాలంటే బ్యాంకులను టీడీపీ నేతలే దోచుకున్నారని, ప్రపంచంలోనే అతిపెద్ద నేరగాడు చార్లెస్ శోభరాజుకు చంద్రబాబు సమానం అని  మండిపడ్డారు.

విజయసాయికి సీఎం రమేష్‌ సవాల్

Submitted by arun on Tue, 03/27/2018 - 17:18

సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేరగాళ్లందరికీ చంద్రబాబు లీడర్‌ అని, చార్లెస్‌ శోభరాజ్‌ను మించిన గజదొంగ చంద్రబాబు అని ఆరోపించారు. ఆర్థిక నేరగాడు విజయ్‌ మాల్యాతో తనను పోల్చడాన్ని తప్పుబట్టిన విజయసాయి తాను ఇప్పటి వరకు ఏ ఒక్క బ్యాంకు నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అన్నారు. అయితే, విజయసాయి కామెంట్స్‌పై స్పందించిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు. విజయసాయి పార్లమెంట్‌లో మోడీ కాళ్లపై పడతారని, బయటకు వచ్చి సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తారని ఆరోపించారు.

చంద్ర‌బాబును చార్లెస్ శోభరాజ్ తో పోల్చిన విజ‌య‌సాయి

Submitted by lakshman on Tue, 03/27/2018 - 17:04

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సీఎం చంద్ర‌బాబు, టీడీపీ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు. న‌న్ను మాల్యాతో పోల్చాతారా అని ప్ర‌శ్నించిన విజ‌య‌సాయి ..ప్ర‌త్యేక‌హోదాపై చంద్ర‌బాబుకు చిత్త‌శుద్దిలేద‌ని క‌డిగిపారేశారు. టీడీపీ నేతలు దొంగలు , చంద్రబాబు గజ నేరగాడు , నిజం చెప్పాలంటే బ్యాంకులను టీడీపీ నేతలే దోచుకున్నారని, ప్రపంచంలోనే అతిపెద్ద నేరగాడు చార్లెస్ శోభరాజుకు చంద్రబాబు సమానం అని  మండిపడ్డారు. ఇక ప‌దే ప‌దే పీఎంవోలో విజ‌య్ సాయిరెడ్డి ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డంపై స్పందించిన ఆయ‌న ఎన్టీఏపై అవిశ్వాస తీర్మానం ప్ర‌క‌టించిన త‌రువాత తాను క‌ల‌వ‌లేద‌ని చెప్పుకొచ్చారు.  

విజ‌య్ సాయిరెడ్డి పీఎంవోలో తిరిగితే త‌ప్పేంటీ

Submitted by lakshman on Fri, 03/23/2018 - 14:59

ఆపరేషన్ గరుడ, ద్రవిడ అంతా అబద్ధమని, అదంతా ఓ ఫ్లాప్ హీరో ఊహాజనిత కథలని బిజెపి అదికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల హీరో శివాజీ ఆరోపణలను కొట్టి పారేశారు. కారెం శివాజీ లాగా ఈ శివాజీ కూడా ఏదో పదవి వచ్చే వరకు ఇలాగే చేస్తుంటారని ఆయన అన్నారు.
 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డే అయితే సీమలో ఎందుకు అభివృద్ధి జరగలేదని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. బిజెపిని తిడతారని అనుకుని పవన్ కల్యాణ్ సభకు టిడిపి నేతల జనాన్ని తరించారని, అయితే అక్కడ సీన్ రివర్స్ అయిందని అన్నారు.

పీఎంవోలో కాపురాలు పెట్టుకోండి

Submitted by lakshman on Thu, 03/22/2018 - 17:31

ఏ1 ఏ2 నిందితులకు ప‌విత్ర‌మైన పీఎంవో కార్యాల‌యంలో ఏం ప‌నిఅంటూ సీఎం చంద్ర‌బాబు టెలీ కాన్ఫ‌రెన్స్ లో విమ‌ర్శించారు. అంతేకాదు పీఎం వో చుట్టూ విజ‌య్ సాయిరెడ్డి ఎందుకు ప్ర‌దక్షిణ‌లు చేస్తున్నారని అని అన్నారు. పీఎంవోలో విజ‌య్ సాయి మ‌కాం వెనుక సంకేతాలేంటి అని అనుమానం వ్య‌క్తం చేశారు. ప్రధాని కార్యాలయం చుట్టూ ప్రధాన నిందితులు ప్రదక్షిణలు చేస్తున్నారని, దీని ద్వారా ఏ సంకేతాలు పంపుతున్నారు...

పార్టీ ప‌రువును గంగ‌లో క‌లిపేస్తున్న జ‌గ‌న్ ఆత్మ ..?

Submitted by lakshman on Mon, 02/12/2018 - 08:30

వైసీపీ నేత‌, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు పై సొంత పార్టీ నేత‌లే నిప్పులు చెరుగుతున్నారు. ఆయ‌న‌ను నిలువ‌రించండి.. పార్టీ ప్ర‌తిష్ట దెబ్బ‌తీస్తున్నాడు.. మ‌న ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నాడ‌ని అధినేత జ‌గ‌న్‌కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందుతున్నాయ‌ట‌.