nallagonda

ఆ సీట్లు గెలవకపోతే...నేను గెలిచినా రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి

Submitted by arun on Fri, 10/05/2018 - 13:12

నల్గొండలో జిల్లాలోని 12 స్థానాలకు 10 స్థానాల్లో గెలిచి చూపిస్తాం...10 సీట్లు గెలవకపోతే తాను ఎమ్మెల్యేగా గెలిచినా పదవికి రాజీనామా చేస్తానని  ప్రకటించారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. నల్గొండ సభలో కేసీఆర్ పూర్తిగా అబద్ధాలు మాట్లాడారని విమర్శించిన ఆయన... అభద్రతా భావంతోనే కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని... సాగర్ ద్వారా 10 లక్షలు ఎకరాలకు కాంగ్రెస్‌ హయాంలోనే నీరు ఇచ్చామన్నారు. జగదీశ్‌రెడ్డి, ఆయన అనుచరులు దోచుకునేందుకే దామరచర్ల థర్మల్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారని అని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దామరచర్ల ప్లాంట్‌ను ఆపేస్తామన్నారు.

బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్యకు నల్లగొండ అసెంబ్లీ సీటు?

Submitted by arun on Wed, 02/07/2018 - 10:57

తెలంగాణ కాంగ్రెస్, సెంటుమెంటు రగిలించడానికి సిద్దమవుతోందా..? నల్గొండలో హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబానికి టిక్కెట్టు ఇచ్చి.. తాము కార్యకర్తలను ఆదుకుంటామని చెప్పడానికి రెడీ అవుతోందా..?  కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి స్థానాన్ని, ఆ కుటుంబాన్ని త్యాగం చేయడానికి యోచిస్తున్నారా..?  తాజా పరిణామాలు పరిశీలిస్తే, అవుననే అనిపిస్తోంది.