Unnao

ఉన్నావ్‌లో కీచకపర్వం...రాహుల్ అనే కామాంధుడు అరెస్ట్

Submitted by arun on Fri, 07/06/2018 - 14:16

ఉన్నావ్ లో కీచకపర్వాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. రాహుల్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఉన్నావ్ జిల్లా ఎస్పీ హరీశ్ కుమార్ తెలిపారు. ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు అడవుల్లోకి లాక్కుపోయి.. అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని మరొకడు తన మొబైల్‌లో చిత్రీకరించాడు. గంగాఘాట్ గ్రామానికి చెందిన బాధితురాలు తనను వదిలేయమని ప్రాధేయపడినా ఆ కిరాతకులు పట్టించుకోకుండా ఆమెను దుర్భాషలాడుతూ, చంపేస్తామని బెదిరిస్తూ రాక్షసుల్లా ప్రవర్తించారు. ఈ వీడియోను వైరల్ చేస్తామని ఒకడు కేకలు పెట్టాడు.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి కొత్త తలనొప్పి

Submitted by arun on Tue, 04/17/2018 - 12:19

ఉత్తరప్రదేశ్‌లో కాషాయ దళానికి కొత్త తలనొప్పి మొదలైంది. సాధువు, బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ బార్, నైట్‌ క్లబ్‌ను ప్రారంభించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు షాకిచ్చారు. ఇప్పటికే ఎన్నో సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన సాక్షి మహారాజ్ తాజాగా లెట్స్‌ మీట్ అన్న క్లబ్‌ను ప్రారంభించి విమర్శలకు కేంద్ర బిందువయ్యారు.

ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్...

Submitted by arun on Fri, 04/13/2018 - 10:54

ఉన్నావ్  రేప్ ఘటనలో మరో అడుగు ముందుకు పడింది. మొత్తానికి నిందితుడు, అధికార పార్టీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో లక్నోలో అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు అతన్ని హజ్రత్ గంజ్ లోని సీబీఐ ఆఫీస్ కు తరలించారు. అతనిపై గతంలోనే పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. యోగి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఇవాళ కులదీప్‌ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

యూపీలో దారుణం...40 మందికి ఎయిడ్స్ ఎక్కించిన డాక్టర్..

Submitted by arun on Tue, 02/06/2018 - 14:36

ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఒకేసారి 40 మంది ఎయిడ్స్ బాధితులుగా తేలడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వైద్యుడినంటూ చెప్పుకునే ఓ వ్యక్తి తనవద్దకు వచ్చే రోగులందరికీ ఇంజక్షన్‌ల కోసం ఒకే సిరంజి ఉపయోగించినట్టు చెబుతున్నారు. ఆ కారణంగానే బాధితులకు ఎయిడ్స్ సోకినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఉన్నావో జిల్లా పరిధిలోని బంగర్ మావ్ ప్రాంతంలో గత సంవత్సరం చివర్లో ఈ ప్రాంతంలో ఓ హెల్త్ క్యాంప్ నిర్వహించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే సదరు క్లినిక్ కు వెళ్లిన అందరి రక్త నమూనాలను పరీక్షించాలని నిర్ణయించారు.