Jammu And Kashmir

లడఖ్ అందాలు..అద్వితీయం

Submitted by arun on Sat, 10/27/2018 - 15:56

చాలామందికి కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని కోరిక వుంటుంది..అందమైన సరస్సులు, బౌద్ధారామాలు, మంత్రం ముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలు, పర్వత శిఖరాలు వున్నా ప్రదేశం మన దేశంలోనే వున్నది, అది ఎక్కడో మీకు తెలుసా! అదే అందమైన లడఖ్. లడఖ్ (జమ్మూ-కాశ్మీర్) సింధు నదీ తీరాన ఉన్న లడఖ్, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రం లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం మరియు జిల్లా కూడా. దీనికి "ఆఖరి శాంగ్రి లా" ( ది లాస్ట్ శాంగ్రి లా) , " చిట్టి టిబెట్" ( లిటిల్ టిబెట్), " చంద్ర ప్రదేశం" ( ది మూన్ ల్యాండ్), " విరిగిన చంద్రుడు" ( ది బ్రోకెన్ మూన్) అనే పేర్లు కూడా ఉన్నాయి. శ్రీ.కో.

మరో ఘోర బస్సు ప్రమాదం : 13మంది మృతి

Submitted by arun on Fri, 09/14/2018 - 14:04

జమ్మూకశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి చీనాబ్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా  మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 30మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఘోర విషాదం...యువకులు స్నానం చేస్తుండగా పైనుంచి పడ్డ బండరాయి

Submitted by arun on Mon, 07/16/2018 - 13:40

జమ్మూకశ్మీర్‌లో విషాదం చోటు చేసుకుంది. సరదా గడుపుదామని వెళ్లిన యువకులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లా సియార్‌బాబా జలపాతం చాలా ఫేమస్‌. ఈ జలపాతం అందాలను చూసిన తర్వాత యువకులంతా కలిసి స్నానం చేసేందుకు జలపాతంలోకి దిగారు. యువకులు జలకాలాడుతుండగా పెద్ద బండరాయి యువకులపై పడింది. దీంతో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

జమ్మూ కశ్మీర్‌లో గవర్నర్ పాలన

Submitted by arun on Wed, 06/20/2018 - 09:15

జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించారు. గవర్నర్ పాలనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో మూడున్నరేళ్లుపాటు సాగిన పొత్తుకు బీజేపీ నిన్న గుడ్‌బై చెప్పింది. దీంతో మొహబూబా ముఫ్తీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేనందున కేంద్రపాలన విధించాలని గవర్నర్ ఎన్‌.ఎన్. వోహ్రా సిఫారసు చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఒక నివేదికను పంపారు. నివేదికను పరిశీలించిన రాష్ర్టపతి కోవింద్.. జమ్మూకశ్మీర్ లో గవర్నర్ పాలనకు ఆమోదం తెలిపారు.

మైనార్టీలో పడ్డ ముఫ్తీ సర్కార్...ముఫ్తీ దారెటో..?

Submitted by arun on Tue, 06/19/2018 - 18:10

జమ్ము కశ్మీర్‌లో పిడిపి బిజెపి సంకీర్ణానికి తెర పడింది. మెహబూబా ముఫ్తీ సంకీర్ణ సర్కార్ నుంచి బిజెపి బయటకు వచ్చింది. మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో మొహబూబా సర్కార్ సంక్షోభంలో పడింది. త్వరలోనే గవర్నర్  పాలన విధించే అవకాశం ఉంది. బిజెపి మద్దతు ఉపసంహరించుకోవడంతో పిడిపికి మరోదారి లేకపోయింది. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గవర్నర్‌కు తన రాజీనామా లేఖను అందించారు.

పీడీపీకి బీజేపీ గుడ్‌బై

Submitted by arun on Tue, 06/19/2018 - 17:28

జమ్ముకశ్మీర్‌లో పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చేసింది. పీడీపీతో కలిసి సాగడం ఇక తమ వల్ల కాదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు  బీజేపీ ప్రధాన కార్యదర్శి, జమ్ముకశ్మీర్ ఇన్‌చార్జ్ రాంమాధవ్ ప్రకటించారు. బీజేపీ ప్ర‌భుత్వం నుంచి వైదొల‌గ‌డంతో సీఎం ప‌ద‌వికి మెహ‌బూబా ముఫ్తీ రాజీనామా చేశారు. 

బీజేపీ బ్రేకప్‌.. సీఎం రాజీనామా!

Submitted by arun on Tue, 06/19/2018 - 15:57

జమ్ముకశ్మీర్ రాష్ట్ర రాజకీయాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఆమె మంత్రివర్గ సహచరులు తన పదవులకు రాజీనామా చేశారు. ఆమె రాజీనామా నిర్ణయాన్ని పీడీపీ వర్గాలు ధ్రువీకరించాయి. కాసేపటి క్రితమే... పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)తో ఉన్న సంకీర్ణ బంధాన్ని బీజేపీ తెగతెంపులు చేసుకుంది. ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగుతున్నట్టు ఆ పార్టీ ప్రతినిధి రామ్ మాధవ్ ప్రకటించడంతో జమ్మూకశ్మీర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ నిర్ణయంతో మూడేళ్ల సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడింది. దీంతో సంఖ్యాబలం కోల్పోయిన ముఫ్తీ తన రాజీనామాను గవర్నర్‌ ఎన్.ఎన్.వోహ్రాకు పంపినట్టు తెలిసింది.

బీజేపీ సంచలన నిర్ణయం... రాష్ట్రంలో గవర్నర్ పాలనకు రంగం సిద్ధం?

Submitted by arun on Tue, 06/19/2018 - 14:56

జమ్మూ కశ్మీర్‌లో పీడీపీ, బీజేపీ మధ్య బంధం ముగిసిపోయింది. జమ్మూకశ్మీర్‌‌లో ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు. మద్దతు ఉపసంహరిస్తూ...గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రాకు లేఖను పంపారు. బీజేపీ మంత్రులతో అమిత్ షా చర్చించిన తర్వాత...మద్దతు ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా రాష్ట్రంలో గవర్నర్ పాలనకు ఆదేశాలు వెలువడతాయని సమాచారం. ఈ పరిణామాలపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ ఇది ఎప్పుడో జరగవలసిందని, ఇది ఊహించిన పరిణామమేనని చెప్పారు.

శ్రీనగర్‌లో ఉగ్ర కాల్పులు.. పాక్ ఖైదీ పరారీ

Submitted by arun on Tue, 02/06/2018 - 12:39

జమ్మూ కశ్మీర్‌లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని శ్రీ మహరాజా హరి సింగ్‌ హాస్పిటల్‌లో...పోలీసులే టార్గెట్‌ చేసుకొని కాల్పులకు తెగబడ్డారు. టెర్రరిస్టుల కాల్పుల్లో ఓ పోలీస్ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయ్.  పాకిస్థాన్‌కు చెందిన ఖైదీ నవీద్‌ను చికిత్స నిమిత్తం భద్రతా బలగాలు ఆస్పత్రికి తీసుకువచ్చాయి. ఈ సమయంలో ఆస్పత్రి వద్ద మాటు వేసిన ఉగ్రవాదులు.. పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఖైదీ నవీద్ బలగాల చెర నుంచి తప్పించుకున్నాడు. తక్షణమే ఉగ్రవాదులు కూడా పారిపోయారు. ఉగ్రవాదులు, ఖైదీ నవీద్ కోసం భద్రతాబలగాలు తనిఖీలు చేపట్టాయి. ఆ ప్రాంతంలో బలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి.