TDP MPs

ఢిల్లీలో టీడీపీ హోదా పోరు

Submitted by arun on Mon, 04/09/2018 - 10:52

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఎంపీలు ఢిల్లీలో పోరు ఉధృతం చేశారు. నిన్న ప్రధాని నివాసం ముట్టడికి యత్నించిన టీడీపీ ఎంపీలు ఈ ఉదయం మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. ఉదయం ప్రత్యేక బస్సులో రాజ్‌ఘాట్‌కు చేరుకున్న ఎంపీలు జాతిపితకు నివాళులర్పించారు. ప్రత్యేక హోదా సాధనకు శాంతియుత మార్గంలో నిరసన చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

మోడీకి భార్య - పిల్ల‌లుంటే ఇలా చేయ‌రు క‌దా

Submitted by lakshman on Sun, 04/08/2018 - 16:01

ప్రత్యేక హోదా కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయి. పైచేయి కోసం టీడీపీ, వైసీపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ వైపు ఢిల్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమరణ దీక్ష చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు ఆదివారం ప్రధాని మోడీ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష, మరోవైపు టీడీపీ ఎంపీల ఆందోళన.. ఇలా డిల్లీలో ఇరు పార్టీలు పైచేయి కోసం ప్రయత్నిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. 

ఏపీ ఎంపీలకు స్పీకర్ ఝలక్

Submitted by arun on Fri, 04/06/2018 - 16:26

టీడీపీ ఎంపీలకు శుక్రవారం విచిత్రమైన అనుభవం ఎదురైంది. లోక్ సభ స్పీకర్ కార్యాలయం తమను తప్పుదారి పట్టించడంతో వారు ఖంగుతిన్నారు. ఈరోజు లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడినప్పటికీ తెదేపా ఎంపీలు బయటకు వెళ్లకుండా ప్రధానమంత్రి కుర్చీ వద్ద ఆందోళన చేపట్టారు. భద్రతా వారించినప్పటికీ వారు వినిపించుకోలేదు. గంటకు పైగా ఆందోళన కొనసాగిన అనంతరం భద్రతా సిబ్బంది వచ్చి..  స్పీకర్‌ మీతో మాట్లాడతానని చెప్పారని,  కార్యాలయానికి రావాలంటూ సందేశం పంపారని ఎంపీలతో చెప్పారు. వారి మాటలు నమ్మిన తెదేపా ఎంపీలు స్పీకర్‌ కార్యాలయం వద్దకు వెళ్లగానే భద్రతా సిబ్బంది లోక్‌సభ తలుపులు మూసివేశారు.

మరోసారి ఆందోళనకు సిద్ధమైన టీడీపీ

Submitted by arun on Fri, 03/02/2018 - 10:37

విభజన హామీల అమలుపై ఏపీ ప్రజల్లో వెల్లువెత్తిన నిరసన సెగలు ఢిల్లీ పీఠానికి చేరినట్లే కనిపిస్తోంది. మిత్రపక్షం డిమాండ్లతో బీజేపీ పెద్దల్లో చలనం వచ్చింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో టీడీపీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీలో టీడీపీ డిమాండ్లపై సుదీర్ఘ చర్చ జరిగింది. రైల్వే జోన్‌తో పాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని, అమిత్‌ షాను టీడీపీ ప్రతినిధులు కోరారు. టీడీపీ డిమాండ్లపై అమిత్‌షా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా TDP అధ్యక్షుడు చంద్రబాబు ఈ ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్న గ్రీవెన్స్ హాలులో పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు.

‘ఈ జోకర్లు పరువు తీస్తున్నారే!’

Submitted by arun on Mon, 02/12/2018 - 10:24

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి టీడీపీ ఎంపీలను లక్ష్యం చేసుకున్నాడు. వివిధ అంశాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసే వర్మ... పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను జోకర్లుగా అభివర్ణించాడు. టీడీపీ ఎంపీల ఫొటో ఒకటి పోస్టు చేసిన వర్మ...రెండు పోస్టులు పెట్టాడు. 

అరకు ఎంపీ కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 02/09/2018 - 13:47

అరకు ఎంపీ కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు చేశారు. హోదా కంటే ప్యాకేజీ మేలని సన్మానాలు చేసి...ఇప్పుడెందుకు మాట మార్చారని మండిపడ్డారు. టీడీపీతో కలిసున్నా ఇవ్వని ప్రత్యేక హోదా....వైసీపీ కలిస్తే ఎలా వస్తుందని ప్రశ్నించారు. జగన్‌ బీజేపీని తిట్టకుండా టీడీపీనే ఎందుకు తిడుతున్నారో చెప్పాలన్నారు. టీడీపీ, వైసీపీలకు చిత్తశుద్ది లేదని పార్లమెంట్‌లో నిరసన అంతా ఒక డ్రామా అన్నారు. చిత్తశుద్ది ఉంటే అందరూ కలసి కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.

పార్లమెంట్‌లో ఆందోళన ఉదృతం చేసిన టీడీపీ ఎంపీలు

Submitted by arun on Fri, 02/09/2018 - 11:38

పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. నేటితో పార్లమెంటు బడ్జెట్ మొదటి విడత సమావేశాలు ముగుస్తున్నందున ఆందోళన మరింత ఉధృతం చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన సూచన మేరకు ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. విభజన హామీలు నెరవేర్చాలంటూ వారు డిమాండ్ చేశారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టీడీపీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విచిత్ర వేషంతో ఆందోళనలో పాల్గొన్నారు.

లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం..టీడీపీ ఎంపీలతో సోనియా మంతనాలు!

Submitted by arun on Thu, 02/08/2018 - 12:39

విభజన హామీలను అమలు చేయాలంటూ లోక్‌సభలో టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మరోవైపు సభలోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ సభాపక్ష ఉపనేత జ్యోతిరాదిత్యతో టీడీపీ ఎంపీలు కేశినేని నాని, తోట నర్సింహం, రామ్మోహన్‌నాయుడు మంతనాలు జరిపారు. ఏపీలో పరిస్థితిని సోనియాకు ఎంపీలు వివరించారు. తమకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వారిని కోరారు.
 

లోక్‌సభలో టీడీపీ ఎంపీల ప్రేక్షకపాత్ర

Submitted by arun on Wed, 02/07/2018 - 12:53

లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు వారి సీట్లలో సైలెంట్‌గా కూర్చొన్నారు. అంతకు ముందు ప్లకార్డులతో హడావిడి చేసిన ఎంపీలు తమ స్ట్రాటజీ ప్రకారం మౌనం వహించారు. దీంతో ప్రధాని ప్రసంగాన్ని కాంగ్రెస్, వైసీపీ , తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. గందరగోళం మధ్యే మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించాల్సి వచ్చింది.