AMIT SHA

ఖాళీగా ఉండేకంటే పకోడా అమ్మడం మంచిదే

Submitted by arun on Mon, 02/05/2018 - 17:27

పకోడీలు అమ్ముకుంటే తప్పేంటని, అందులో సిగ్గుచేటైన వ్యవహారం ఏముందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రశ్నించారు. రోడ్డుపై ఎవరైనా పకోడీలు అమ్ముకుని రూ.200 సంపాదిస్తే, దానినే ఉద్యోగంగా భావించాలంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగడం, కాంగ్రెస్ సైతం విమర్శలు గుప్పించడంపై అమిత్‌షా రాజ్యసభలో స్పందించారు. పెద్దలసభలో శనివారంనాడు అమిత్‌షా తొలి ప్రసంగం చేస్తూ, కాంగ్రెస్ పకోడా రాజకీయాలు చేస్తోందన్నారు. ఉద్యోగం చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది సిగ్గుచేటు కాదని అన్నారు. 'పకోడీలు అమ్ముకునే వాళ్లు అడుక్కోవడం లేదు కదా?' అని ప్రశ్నించారు.