chennai

రేపు చెన్నైలో పర్యటించనున్న పవన్.. కీలక ప్రకటన చేసే అవకాశం

Submitted by arun on Tue, 11/20/2018 - 12:44

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాజకీయాల్లోనూ పవన్ క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన చెన్నై  వెళ్తున్నట్టు సమాచారం. అక్కడ తన మద్దతుదారులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు సమాచారం. రేపు మక్కళ్ నీది మయ్యం అధినేత కమల్‌తో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హోటల్‌ కన్నెమోరాలో ప్రెస్‌మీట్‌ పెట్టనున్న పవన్‌  కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. 
 

పిల్లలను చంపేసి...ప్రియుడితో పారిపోయింది...

Submitted by arun on Sun, 09/02/2018 - 10:17

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన మహిళ ఇద్దరు పిల్లలకు విషం పెట్టి చంపేసింది. రాత్రి ఇంటికి వచ్చే భర్తను కూడా హత్య చెయ్యాలని నిర్ణయించింది. అయితే ఉద్యోగరీత్యా భర్త రాత్రి ఇంటికి రాకపోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. పిల్లలను హత్య చేసి ప్రియుడితో కలిసి ఎస్కేప్ అయ్యింది. పల్లావరం సమీపంలోని కుండ్రత్తూర్‌కి చెందిన బ్యాంక్‌ ఉద్యోగి విజయ్‌(34), అభిరామి(28) దంపతులకు అజయ్‌(5) అనే కుమారుడు, కారుణ్య(4) అనే కుమార్తె ఉన్నారు. అదే ప్రాంతంలోని ఓ బిర్యానీ దుకాణంలో పనిచేస్తున్న సుందరం అనే యువకుడితో అభిరామికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

పెళ్లైన మహిళలే టార్గెట్: 10 మందికి కారులో లిఫ్టిచ్చి రేప్

Submitted by arun on Thu, 08/16/2018 - 11:02

చెన్నైలో రోడ్డుపై వెళ్లే మహిళలను కత్తితో బెదిరించి కారులో అత్యాచారాలు జరుపుతూ వచ్చిన కామాంధుడిని పోలీసులు ఎట్టకేలకూ మంగళవారం అరెస్టు చేశారు.తమిళనాడు రాష్ట్రంలోని  చెన్నై, ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో ఒంటరిగా వెళ్లే మహిళలను  లక్ష్యంగా చేసుకొని  నిందితుడు అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై పోలీసులకు అందించిన సమాచారం మేరకు  పక్కా ప్లాన్ ప్రకారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే  ఓ 35 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేశారు. 

టెడ్డీబేర్‌తో అత్తను హతమార్చిన మేనల్లుడు

Submitted by arun on Mon, 08/06/2018 - 12:42

తన కూతురిని కలవొద్దని, ఆమెతో మాట్లాడవద్దని హెచ్చరించినందుకు పదో తరగతి చదువుతోన్న 15 ఏళ్ల కుర్రాడు సొంత మేనత్తనే హత్య చేశాడు. అది కూడా టెడ్డీ బేర్‌తో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు. ఆ తరవాత చేతి మణికట్టును కత్తితో కోసి ఆత్మహత్యగా నమ్మించాలనుకున్నాడు. అయితే సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆ విద్యార్థిని అనుమానించి విచారించారు. మేనత్తను తానే హత్యచేసినట్లు పోలీసుల ఎదుట అతను ఒప్పుకున్నాడు. ఈ ఘటన చెన్నైలోని అమింజికరైలో చోటుచేసుకుంది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. చెన్నై అమింజికరై వల్లలార్‌వీధికి చెందిన శంకర్‌ సుబ్బు (45) అదే ప్రాంతంలో కిరాణ దుకాణం నడుపుతున్నాడు.

చోరీ చేస్తూ దొరికిన మహిళా పోలీస్‌..

Submitted by arun on Thu, 07/26/2018 - 13:27

దొంగలను పట్టుకోవాల్సిన ఓ పోలీస్ అధికారిణి ఏకంగా దొంగ అవతారం ఎత్తింది. ఓ సూపర్ మార్కెట్ లోని వస్తువుల్ని ఎంచక్కా జేబులో దాచుకోవడం మొదలు పెట్టింది. ఈ తతంగాన్ని గమనించి నిలదీసిన ఆ సంస్థ ఉద్యోగి వస్తువుల్ని వెనక్కు ఇవ్వాలని కోరడంతో కోపంతో రెచ్చిపోయిన ఆమె తన భర్తతో చావగొట్టించింది. ఈ ఘటన తమిళనాడులో బుధవారం చోటుచేసుకుంది. సూపర్‌ మార్కెట్‌లో మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ వస్తువులను జేబులో పెట్టడాన్ని అక్కడే పనిచేస్తున్న ప్రణవ్‌ గమనించాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి చోరీ చేసిన వస్తువులను తిరిగి ఇవ్వాలని కోరాడు. అంతేకాకుండా తప్పు చేసినట్టు క్షమాపణ పత్రం రాసి ఇవ్వాలన్నాడు.

విషాదం.. ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తూ నలుగురు దుర్మరణం!

Submitted by arun on Tue, 07/24/2018 - 12:30

చెన్నైలో ఘోర ప్రమాదం జరిగింది. సబర్బన్‌ రైల్‌లో ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్స్‌కి షిఫ్ట్‌ చేశారు. చెన్నైలోని సెయింట్‌ థామస్‌ మౌంట్‌ స్టేషన్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సబర్బన్‌ రైల్‌లో విపరీతమైన రద్దీ కారణంగా పలువురు ప్రయాణికులు ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తుండగా ఈ దారుణం జరిగింది. ట్రాక్‌ పక్కనుండే విద్యుత్‌ స్తంభాలు తగిలి పలువురు ప్రయాణికులు ట్రైన్‌ నుంచి కిందపడిపోయారు. వేగంగా విద్యుత్‌ స్తంభాలను ఢీకొట్టడంతో తలలు పగిలాయి. దాంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

12 ఏళ్ల చెవిటి బాలికపై 17 మంది అత్యాచారం

Submitted by arun on Wed, 07/18/2018 - 10:31

తమిళనాడులోని ఐనవరంలో దారుణం జరిగింది. 12 ఏళ్ల వినికిడి లోపం ఉన్న బాలికపై 6 నెలలుగా 17 మంది అత్యాచారానికి పాల్పడుతున్నారు. బాలికకు మత్తు మందు ఇచ్చి లిఫ్టులు, బాత్‌రూమ్‌లలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక అనారోగ్యానికి గురి కావడంతో విషయం బయటపడింది.

11 ఏండ్ల బాలికపై 22 మంది అత్యాచారం

Submitted by arun on Tue, 07/17/2018 - 15:55

అభం శుభం తెలియని చిన్నారిపై కొంతమంది మానవ మృగాళ్లు విరుచుకుపడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 22 మంది.. 11 ఏండ్ల బాలికపై వరుసగా అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన చెన్నైలో వెలుగు చూసింది. వినికిడి సంబంధ సమస్య ఉన్న బాలికపై నెలల తరబడి అత్యాచారం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు 18 మందిని సోమవారం అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి, ఇంజెక్షన్ల రూపంలో డ్రగ్స్ ఇచ్చిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. రేప్ ఘటనను వీడియో తీసి ఎవరికైనా చెబితే దాన్ని బయట పెడతామని బెదిరించారు. దీంతో భయపడిన బాలిక వారు చెప్పినట్టు వినాల్సి వచ్చింది.

డేటింగ్‌ పేరుతో హైటెక్‌ వ్యభిచారం... సినీ నటికి రూ.30 లక్షల ఆఫర్

Submitted by arun on Sat, 07/14/2018 - 10:24

చెన్నైలో భారీ సెక్స్ రాకెట్‌ గుట్టురట్టు చేశారు పోలీసులు. సోషల్ మీడియా ద్వారా డేటింగ్ సర్వీస్ పేరుతో కుర్రాళ్లకు వల వేస్తున్న ఇద్దర్ని కేటుగాళ్ల ఆటకట్టించారు పోలీసులు. ఓ తమిళ నటి చేసిన ఫిర్యాదుతో ఈ గుట్టు మొత్తం బయటపడింది. చాలా రోజులుగా వీరిద్దరూ తమిళ సినిమా సెలబ్రిటీల ఫోటోలతో ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు తేలింది. వీరిద్దర్ని ప్రశ్నించిన పోలీసులకు దర్యాప్తులో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఆ బ్రోకర్ల సెల్‌ఫోన్లలో సుమారు 70 మంది తమిళ సినీ, టీవీ హీరోయిన్ల ఫోటోలు, వారి మొబైల్‌ నెంబర్లు, వారితో డేటింగ్‌కు చెల్లించాల్సిన రేట్ల వివరాలు చూసి పోలీసులు సైతం విస్తుపోయారు.

పెళ్లి చూపులకొచ్చి బిడ్డ తల్లితో యువకుడు పరార్

Submitted by arun on Fri, 06/01/2018 - 12:36

పెళ్లి సంబంధం కోసం పెళ్లి చూపులకు వచ్చిన ఓ యువకుడు పెళ్లైన ఆమె అక్కతో ఉడాయించిన ఘటన చెన్నైలో కలకలం రేపింది. చెన్నైలో చోటుచేసుకున్న ఈ విచిత్రం వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై మైలాపూరు ఏకాంబరం పిళ్‌లై వీధికి చెందిన ఓ వ్యక్తికి 26, 22 ఏళ్ల వయసులో ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్దమ్మాయికి పెళ్లయి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.