ap special status

అధికారంలోకి రాగానే ఏపీకి హోదా ఇస్తాం: రాహుల్

Submitted by arun on Tue, 09/18/2018 - 15:59

కర్నూల్ బై రెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న రాహుల్ అనేక అంశాలపై స్పష్టత ఇచ్చారు. విద్యార్ధులు అడిగిన పలు ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు చెప్పారు. మోడీ ప్రభుత్వం కొంత మంది కార్పోరేట్ల కోసమే పని చేస్తోందని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని రాహుల్ గాంధీ అన్నారు. ఏపీకి కేంద్రం నుంచి ప్రత్యేక సాయం అందాలని అభిప్రాయపడ్డారు. చైనాలో రోజుకు 50 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుంటే భారత్‌లో కేవలం 450 ఉద్యోగాలు మాత్రమే లభిస్తున్నాయని రాహుల్ గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.

హోదా పోరులో కొత్త ట్విస్ట్...

Submitted by arun on Sat, 08/04/2018 - 11:27

హోదా పోరులో బిజెపి, టిడిపి మధ్య యుద్ధం కొత్త రూపు తీసుకుంటోంది. పార్లమెంటులో టిడిపి నిరసనల దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి బిజెపి మాస్టర్ ప్లాన్ వేసింది. 

బీజేపీతోనే ఏపీకి నిధులు, సంస్థలు వచ్చాయ్ : బీజేపీ

Submitted by arun on Tue, 07/24/2018 - 17:18

బీజేపీతోనే ఏపీకి నిధులు, సంస్థలు వచ్చాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఏపీ ప్రజలను రాజకీయ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆయన బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీతో ఏపీకి న్యాయం జరగలేదని బీజేపీతోనే ఏపీ ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. గత ప్రధాని ఇచ్చిన చాలా హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందన్న జీవీఎల్‌ ఏపీపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారన్న ఆయన చేతనైనంత సాయం కేంద్రం చేస్తోందన్నారు. 
 

టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చేయాలి

Submitted by arun on Sat, 07/21/2018 - 13:26

ప్రత్యేక హోదాను వద్దనడానికి చంద్రబాబు ఎవరని వైసీపీ అధినేతే జగన్ ప్రశ్నించారు. హోదా వద్దని, ప్యాకేజీ అంగీకరించే హక్కు ముఖ్యమంత్రికి ఎక్కడిదని నిలదీశారు. బీజేపీపై యుద్ధం చేస్తున్నానంటున్న చంద్రబాబు చేతల్లో మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తప్పు పట్టారు. వైసీపీ ఎంపీల లాగే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసిస్తూ మంగళవారం జగన్..ఏపీ బంద్‌‌కు పిలుపునిచ్చారు.

స్పెషల్ స్టేటస్ కి "స్టేతస్కోప్"

Submitted by arun on Wed, 07/11/2018 - 13:01

1816 లో రేని లేన్నెక్ అనే వైద్యుడు, తన దగ్గర వచ్చిన ఓ లావుపాటి మహిళ, గుండెచప్పుడు చెవులతో వినడానికి ఇబ్బంది పడి 'స్టేతస్కోప్" ఆలోచన వచ్చిందట, మరి ఆంధ్రుల గుండెచప్పుడు అయిన "స్పెషల్ స్టేటస్" ఇవ్వటానికి కేంద్రం కోసం మనం ఏ మెషిన్ కనిపెట్టాలో! శ్రీ.కో

ఏపీకి ప్రత్యేక హోదాపై సంచలన ప్రకటన

Submitted by arun on Wed, 07/04/2018 - 13:16

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదనే విషయం స్పష్టమైంది. విభజన చట్టంలో ఉన్నవన్నీ ఏపీకి ఇచ్చేశామని, ఇక ఇచ్చేదేమీ లేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ప్రత్యేక హోదాను ఇవ్వలేమంటూ అధికారికంగా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని తెలిపింది. ఈ అఫిడవిట్ లో విశాఖ రైల్వే జోన్ ఊసే లేకపోవడం గమనించాల్సిన విషయం.

ఏపీలో హోదా హోరీ... ఎవరి దారి ఏంటి?

Submitted by nanireddy on Wed, 05/02/2018 - 15:52

ఏపిలో హోదాపోరు పక్క దారి పడుతోందా? ఐక్యంగా ఉద్యమించాల్సిన నేతలు సొంత కుంపట్లు పెట్టుకుని.. వ్యక్తిగత ప్రచారాలతో కాలక్షేపం చేస్తుంటే హోదా వస్తుందా?కలసి కట్టుగా కేంద్రంపై పోరాడాల్సిన వారు.. విడి విడిగా, ఒకరినొకరు మాటల దాడులతో టార్గెట్ చేసుకుంటున్నారు.. నిన్నటి తిరుపతి, వైజాగ్ మీటింగ్ లు చూసిన వారికి కలిగిన భావాలివి..

స్పీకర్ కోడెల సైకిల్ యాత్రలో అపశృతి

Submitted by arun on Thu, 04/19/2018 - 12:19

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సైకిల్‌ యాత్ర మొదలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. యలమందల వద్ద సైకిల్ తొక్కుతూ స్పీకర్ కిందపడిపోయారు. దీంతో ఆయన తలకు స్వల్ప గాయమైంది. అయితే గాయాన్ని కూడా లెక్క చేయకుండా స్పీకర్ సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నారు. కేంద్రం తీరును నిరసనగా ఈ రోజు ఉదయం స్పీకర్ కోడెల సైకిల్ యాత్ర చేపట్టారు. వేలాది మందితో భారీ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. నరసరావుపేట నుంచి కోటప్పకొండ వరకు యాత్ర కొనసాగనుంది. రేపు నరసరావుపేట, సత్తెనపల్లిలో స్పీకర్‌ కోడెల దీక్ష చేయనున్నారు.

వైఎస్ కు చంద్ర‌బాబుకు మ‌ధ్యఉన్న తేడా అదేనా

Submitted by lakshman on Thu, 04/12/2018 - 11:53

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సీఎం చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తుంటే ..తాము బీజేపీ తో కుమ్మ‌క్క‌య్యామ‌ని అన‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని అన్నారు. బీజేపీ కుమ్మక్కైతే హ‌స్తిన‌లో ఆమ‌ర‌ణ దీక్ష చేయాల్సిన అవస‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రం అంతా వైసీపీ ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం పోరాటం చేస్తుంటే చంద్ర‌బాబు ఆనంద న‌గ‌రాల పేరుతో వేడుక‌లు జ‌ర‌ప‌డం సిగ్గుచేట‌ని మండిప‌డ్డారు. ఇలాంటి ప‌నికిమాలిన కార్య‌క్ర‌మానికి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు హాజ‌ర‌వ్వ‌డం విడ్డూరంగా ఉంద‌ని అన్నారు.