Assembly elections

ఎన్నికల వేళ తెలంగాణలో పట్టుబడుతున్న నోట్ల కట్టలు

Submitted by arun on Tue, 10/23/2018 - 12:07

ఎన్నికల వేళ తెలంగాణలో ధన ప్రవాహం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా భారీగా డబ్బు పట్టుబడుతోంది. పోలింగ్‌ ఇంకా నెలన్నర ఉండగా పెద్ద మొత్తంలో నగదు దొరకడం ఆందోళన కలిగిస్తోంది. ముందస్తు ఎన్నికల కోసం కొందరు అభ్యర్థులు ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు చాలా సమయం ఉన్నా డబ్బు తరలించే పనిలో నిమగ్నమైపోతున్నారు. వరుసగా దొరుకుతున్న డబ్బుల కట్టేలే ఇందుకు నిదర్శనం. ఖమ్మం జిల్లా ఏన్కూర్ లో కోటి రూపాయల నగదు పోలీసులకు పట్టుబడింది. కొందరు వ్యక్తులు ఈ డబ్బును ఓ వాహనంలో తరలిస్తూ దొరికి పోయారు.

టీఆర్ఎస్ లో మొదలైన టిక్కెట్ల లొల్లి

Submitted by arun on Thu, 07/26/2018 - 11:35

టీఆర్ఎస్ లో అప్పుడే టికెట్ల లొల్లి షురూ అయ్యింది. ఒకే నియోజ‌క‌వ‌ర్గంలో టికెట్ల కోసం పోటీ పడుతున్న నేత‌లు బ‌హిరంగ విమ‌ర్శలకు దిగుతున్నారు.  సిటింగ్ ల సీట్లపై ఆశావహులు కండువా పరుస్తుంటే సిటింగ్ లు మండిపడుతున్నారు. ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రు నియోజ‌క‌ వ‌ర్గాల్లో పార్టీ కార్యాల‌యాలు ఓపెన్ చేసి స‌వాల్ విసురుకుంటున్నారు. ఇంకొంద‌రు బ‌హిరంగంగా తిట్లు, విమర్శలకే దిగుతున్నారు.

జనసేన రణవ్యూహం... కదనరంగంపై పవన్‌ క్లారిటీ

Submitted by santosh on Thu, 05/03/2018 - 11:16

జనసేన రణవ్యూహం సిద్దమైంది. ఎన్నికల సమరానికి తొడగొట్టింది. ప్రజల్లోకి రావడంలేదంటూ, దూసుకువస్తున్న ప్రశ్నలకు సమాధానంగా, ఇక జనంలోనే ఉంటానంటూ జనసేనుడు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాడు. పార్టీ నిర్మాణమేదన్న విమర్శకు, ఇక బూత్‌లెవల్‌ నుంచే పోరాటం మొదలవుతుందని సంకేతమిచ్చాడు. ఎన్నికల మేనిఫెస్టోకు కొత్త రూపునిస్తున్నాడు. మీడియా, సోషల్ మీడియాలో వాడివేడిగా, ధాటిగా ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనేందుకు సైన్యాన్ని సిద్దం చేశాడు. ఇంతకీ జనసేనుడి రణవ్యూహం ఇంకా ఎలా ఉండబోతోంది.?

రాహుల్ గాంధీ ‘పకోడా’ బ్రేక్...!

Submitted by arun on Mon, 02/12/2018 - 18:04

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్ని టీ స్టాల్ లో కూర్చొని పకోడీ తిన్నారు. టీ తాగారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఊహించని విధంగా ఇలా చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఉన్నారు.

పకోడీలు అమ్మడం కూడా ఉద్యోగమేనంటూ ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఆగి మరీ మిర్చి పకోడాలు తినడంపై ఆసక్తికర చర్చ సాగింది. కాగా ఇవాళ ఉదయం రాహుల్ సీఎం సిద్ధరామయ్యను వెంటబెట్టుకుని రాయ్‌చూర్‌లోని దర్గాను దర్శించారు. అనంతరం నగరంలో రోడ్‌షో నిర్వహించారు.

కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది..

Submitted by arun on Mon, 02/05/2018 - 11:04

తెలంగాణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన తీవ్ర వివాదం రేపుతోంది. ఏకపక్షంగా నేతలకు టికెట్లు ఖరారు చేయడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓడిపోయే వారికి టికెట్లు ఇవ్వకుండా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.