Tholi Prema

పవన్ కళ్యాణ్ ప్రయాణంలో తోలిప్రేమ

Submitted by arun on Wed, 10/17/2018 - 12:31

పవన్ కళ్యాణ్ సిని ప్రయాణంలో ఒక పెద్ద మైలురాయి తోలిప్రేమ సినిమా. ఈ తొలిప్రేమ 1998లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన విజయవంతమైన ప్రేమకథా చిత్రం. ఇందులో పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి ముఖ్యపాత్రల్లో నటించారు. ఇందు లోని పాటలు ఎంతో హిట్ అయ్యాయి... ముఖ్యంగా.. ఈ మనసే .. సే నా మనసే ... (రచన: సిరివెన్నెల; గానం: బాలు), ఏమి సోదరా.. మనసుకు ఏమయిందిరా (రచన: భువనచంద్ర; గానం: కృష్ణరాజ్), గగనానికి ఉదయం ఒకటే, కెరటానికి సంద్రం ఒకటే (రచన: సిరివెన్నెల; గానం: బాలు), ఏమైందో ఏమో (రచన: సిరివెన్నెల; గానం- బాలు), రొమాన్స్ లో రిథమ్ (రచన: భువనచంద్ర; గానం: సురేష్ పీటర్, ఉన్నికృష్ణన్).

మెగా కంపౌండ్ నుంచి గ్రహాంతరవాసి

Submitted by arun on Thu, 02/22/2018 - 15:01

వరుణ్ తేజ్ తొలిప్రేమ సూపర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. మిగతా అప్ కమింగ్ హీరోల్లా కాకుండా వెరైటీ కథలతో సూపర్ యాక్టింగ్ తో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో మెగా ప్రిన్స్ అనిపించుకుంటున్నాడు. వాట్ నెక్ట్స్ అంటే త్వరలో తాను గ్రహాంతరవాసిని కాబోతున్నానంటున్నాడు. దీంతో ఫజిల్ కి గురికావడం అభిమానుల వంతైంది.

టైటిల్‌ పెట్టావ్‌ సరే... జాగ్రత్తగా తియ్‌ అన్నారు

Submitted by arun on Mon, 02/12/2018 - 11:52

స్నేహగీతం సినిమాతో నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి తొలి ప్రేమసినిమాతో దర్శకుడిగా మారారు వెంకీ అట్లూరి. తొలి ప్రయత్నంలోనే విజయాన్ని సొంతం చేసుకున్న ఆయనపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తున్నది. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం తొలిప్రేమ. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో దర్శకుడు వెంకీ అట్లూరి పాత్రికేయులతో చ్చటించారు.

ఐటీ మంత్రికి ట్విట్టర్‌లో పంచ్‌

Submitted by arun on Mon, 02/12/2018 - 09:10

ఐటీ మంత్రికే ట్విట్టర్‌లో పంచ్‌ పడింది. ఓ సినిమా గురించి ట్వీట్‌ చేసినందుకు నెటిజన్లు కౌంటర్‌ ఇచ్చారు. రైతులు, విద్యార్థుల కష్టాలు పట్టించుకోకుండా సినిమాలు చూడ్డమేంటని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. నెటిజన్ల ప్రశ్నలతో చిర్రెత్తుకొచ్చిన ఆ మంత్రి వెంటనే తన డీపీ మార్చేశారు. కేటీఆర్‌... తెలంగాణ ఐటీ శాఖా మంత్రి. ట్విట్టర్‌లో బాగా యాక్టీవ్‌గా ఉంటారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించడమేకాదు, అధికారులను అలర్ట్‌ చేస్తూ ట్వీట్స్‌ చేస్తుంటారు.

‘తొలిప్రేమ’పై కత్తి మహేశ్ రివ్యూ

Submitted by arun on Sat, 02/10/2018 - 12:30

ఫిదా సినిమా తర్వాత..మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి ఆడియన్స్ ఆకట్టుకున్నాడు. క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీతో వచ్చిన తొలిప్రేమ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. టైటిల్‌తోనే అంచనాలను మరింత పెంచిన ఈ సినిమా శనివారం విడుదలైంది. తొలిప్రేమపై సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ రివ్యూ ఇచ్చాడు. తెలుగులో ఇప్పట్లో వచ్చిన మంచి ప్రేమకథా చిత్రాల్లో తొలిప్రేమ ఒకటి అని కత్తి మహేశ్ చెప్పాడు. బ్రిలియంట్ రైటింగ్ అంటూ దర్శకుడిపై ప్రశంసల జల్లు కురిపించాడు. హీరోహీరోయిన్లు, ఇతర నటులు ఆకట్టుకునే విధంగా నటించారని కత్తి చెప్పాడు.

తొలిప్రేమ : రివ్యూ

Submitted by arun on Sat, 02/10/2018 - 10:26

నిర్మాణ సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌
తారాగ‌ణం: వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా, సుహాసిని, సప్న ప‌బ్బి, ప్రియ‌ద‌ర్శి, హైప‌ర్ ఆది, విద్యుల్లేఖా రామన్ త‌దిత‌రులు
కూర్పు: న‌వీన్ నూలి
సంగీతం: ఎస్‌.త‌మ‌న్‌
ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్ సి.విలియ‌మ్స్‌
నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌
క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వెంకీ అట్లూరి

‘తొలిప్రేమ’ ట్రైలర్‌ విడుదల

Submitted by arun on Fri, 02/02/2018 - 10:13

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తొలిప్రేమ’. రాశీ ఖన్నా కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో వరుణ్‌ తేజ్‌..‘జ్ఞాపకాలు.. చెడ్డవైనా, మంచివైనా ఎప్పుడూ మనతోనే ఉంటాయి. మోయక తప్పదు’ అంటున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. రాశిఖన్నా, వరుణ్ కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. రాశి తన ఇంతకు ముందు సినిమాల్లో కన్నా చాలా అందంగా కనిపించింది. లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా సినిమా కనిపిస్తోంది. వరుణ్ ఇలాంటి సినిమాలో నటించడం ఇదే ఫస్ట్ టైమ్ అనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.