south africa

అదే జోరు.. అదే దూకుడు..

Submitted by arun on Sat, 02/17/2018 - 10:28

జోరు తగ్గలేదు.. ఊపు ఆగలేదు.. నామమాత్రమైన చివరి వన్డేలోనూ సేమ్ సీన్ రిపీట్  చేశారు. ఆతిథ్య జట్టుపై కనీస కనికరం లేకుండా.. విరుచుకుపడ్డారు. సెంచూరియన్ వన్డేలో విక్టరీ కొట్టి.. సరికొత్త చరిత్రను సృష్టించారు. గతంలో ఎవరికీ సాధ్యం కాని లెవెల్లో వన్డే సిరీస్ ను చేజిక్కించుకున్నారు. టెస్ట్ సిరీస్  ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. 5-1 తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని.. సౌతాఫ్రికా ఓటమిని పరిపూర్ణం చేశారు. 

మూడో వన్డేలో సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం

Submitted by lakshman on Thu, 02/08/2018 - 05:10

టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో  భారత్ ఘనవిజయం సాధించింది. 6 వన్డేల సిరీస్‌లో 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 304 పరుగుల స్కోరుతో వీర విహారం చేసింది. కెప్టెన్ కోహ్లీ 160 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిస్తే, ధవన్ 76 పరుగులు చేశాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఆల్ రౌండర్ డుమిని రెండు వికెట్లు పడగొట్టాడు. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు ఏదీ కలిసిరాలేదు. బ్యాట్స్‌మన్ ఆమ్లా తక్కువ స్కోరుకే ఔట్ అవడంతో టీమ్ ఇండియాను ఇతర ఆటగాళ్లు పోటీ ఇవ్వలేకపోయారు.

దక్షిణాఫ్రికాను చిత్తుచేసిన భారత్

Submitted by lakshman on Sun, 02/04/2018 - 18:28

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో భారత్ జయభేరి మోగించింది. టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించినా భారత్.. ఆది నుంచీ దక్షిణాఫ్రికాపై ఆధిపత్యం చెలాయించింది.

సౌత్ ఆఫ్రికాపై భార‌త్ ఘనవిజయం

Submitted by lakshman on Fri, 02/02/2018 - 03:33

సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లీ సేన ఘనవిజయం సాధించింది. ఛేజింగ్ వీరుడిగా పేరుగాంచిన టీం ఇండియా సారధి విరాట్ కోహ్లీ ఆ పేరుని మరోమారు సార్థకం చేసుకున్నాడు. ఓ వైపు టెస్టుల్లో పరాజయం, సఫారీలని సొంత గడ్డలో ఎదుర్కొనడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి నేపథ్యంలో ఒత్తిడి మొత్తం టీం ఇండియా పైనే. కానీ ఒత్తిడి ఛాయలేవీ కనిపించకుండా కోహ్లీ అద్భుత సెంచరీతో భారత జట్టుని గెలుపు తీరాలకు చేర్చాడు. సఫారీలు భారత జట్టుకు విధించిన లక్ష్యం 270 పరుగులు.