Jana Reddy

మా నాన్న సీఎం అయితే..

Submitted by arun on Fri, 10/12/2018 - 13:23

కాంగ్రెస్ పార్టీలో తాను 2004 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నానని సీనియర్ నేత మాజీ హోంమంత్రి జానా రెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి తెలిపారు. ఓ కుటుంబానికి ఒకే టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గతంలో ఎన్నడూ చెప్పలేదని వెల్లడించారు. ఈసారి కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎల్‌పీ నేత జానారెడ్డి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, తన తండ్రి సీఎం కావడం కన్నా ఇంకేం కావాలని వ్యాఖ్యానించారు.
 

ప్రణయ్ హత్య కేసులో కాంగ్రెస్ సంచలన నిర్ణయం

Submitted by arun on Mon, 09/17/2018 - 14:48

కులాంతర వివాహం చేసుకుని హత్యకు గురైన ప్రణయ్ కేసు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ దిద్దుపాటు చర్యలకు ఉపక్రమించింది. ప్రణయ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిర్యాలగూడ కాంగ్రెస్ నేత కరీంను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, సీఎల్పీ నేత జానారెడ్డి ప్రణయ్‌ ఇంటికి వచ్చి.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రణయ్‌ భార్య అమృతవర్షిణితో మాట్లాడారు. జరిగిన ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కేసీఆర్‌పై జానారెడ్డి ఫైర్

Submitted by arun on Fri, 09/07/2018 - 15:50

కాంగ్రెస్ త్యాగాల పునాదులపైనే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. అలాంటి కాంగ్రెస్‌ పెద్దలపై కేసీఆర్‌ నోటికొచ్చినట్లు మాట్లాడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ మాటలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముందస్తుకు వెళ్తున్నారని జానా ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు

Submitted by arun on Thu, 07/19/2018 - 12:37

ఎన్నికల వేళ ప్రత్యర్ధులపై కత్తి దూయాల్సిన కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీ వారిపైనే గురిపెడుతున్నారా? పార్టీపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుంటే అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్లు భగ్గుమంటున్నారు ఇంతకీ ప్రభుత్వం వారిపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది?

సైలెంట్‌గా ఉండే జానారెడ్డిలో సడన్‌ ఛేంజ్

Submitted by arun on Thu, 07/05/2018 - 11:04

బేసిగ్గా ఆయన సైలెంట్ లీడర్. కానీ ఈసారి ఓపెన్ అయిపోయారు. తీవ్రదుమారం రేపుతున్న కత్తి మహేష్ వ్యాఖ్యలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఎవరైనా విమర్శించినా పెద్దగా పట్టించుకోని జానారెడ్డి ఈసారి ఆయనే పట్టించుకొని మరి ఎందుకు తిట్టారు. ఎన్నడూ లేనిది సీఎల్పీ నేత జానారెడ్డిలో కోపం కట్టలు తెంచుకునేందుకు కారణమేంటి.? 

కత్తిపై జానా గుస్సా

Submitted by arun on Wed, 07/04/2018 - 14:25

శ్రీరాముడిపై కత్తి మహేశ్‌ మాట్లాడిన విధానం సరైంది కాదన్నారు కాంగ్రెస్‌ సీనియర్ నేత జానారెడ్డి. కత్తి మహేశ్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ ఖండిస్తుందన్న ఆయన టెర్రిరిస్టులకు, కత్తి మహేశ్‌కు తేడా లేదన్నారు. రెచ్చగొట్టే విధంగా కత్తి మహేశ్‌ మాట్లాడటం సరైంది కాదన్న ఆయన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ కత్తి మహేశ్‌ లాంటి వారి వ్యాఖ్యలు వర్గాలను రెచ్చ గొట్టే  విధంగా ఉన్నాయన్నారు. సమాజంలో ఆందోళనలు కలిగించే విధంగా మాట్లాడటం క్షమించరానిదన్నారు. ఇలాంటి విషయాల్లో జర్నలిస్టులు సంయనం పాటించాలని, అసహ్యమైన మాటలు ప్రచురించకూడదన్నారు.

ఇదేం పద్ధతి..? కోమటిరెడ్డికి జానా క్లాస్‌

Submitted by arun on Sat, 06/09/2018 - 13:09

కాంగ్రెస్‌ రెబల్‌స్టార్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరు పార్టీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జానారెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో జానా ఆగ్రహంతో ఉన్నారు. సీఎల్పీ సమావేశంలో  కోమటిరెడ్డి తన తీరును మార్చుకోవాలని జానా హెచ్చరించినట్లు తెలిసింది. బహిరంగంగా ఎలా ప్రశ్నిస్తావంటూ నిలదీసినట్లు సమాచారం. 

ముందు నేనే రాజీనామా చేస్తా: జానారెడ్డి

Submitted by arun on Mon, 06/04/2018 - 14:54

ఎమ్మెల్యేలంతా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సీఎల్పీ నేత జానారెడ్డి స్పందించారు. రాజీనామాల అంశం తనకు తెలియదని... ఆ విషయాన్ని కోమటిరెడ్డి ఇప్పుడే ప్రస్తావించారని హెచ్ఎంటీవీతో చెప్పారు. మూకుమ్మడి రాజీనామాలపై పార్టీలో చర్చిస్తామని... పీసీసీ అధ్యక్షుడు, అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని జానారెడ్డి తెలిపారు. అధిష్ఠానం నిర్ణయం ఎలా ఉంటే అలాగే ముందుకెళ్తామన్న జానారెడ్డి... రాజీనామా చేసేందుకు తానెప్పుడూ ముందుంటానని చెప్పారు.

‘తాగి వచ్చాడు’ అన్న పల్లా మాటలకు గట్టి సమాధానం

Submitted by arun on Mon, 03/12/2018 - 17:12

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాగి సభకు వచ్చారంటూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి మద్యం తాగి అసెంబ్లీకి వచ్చారన్న ఆరోపణలు సభకే అవమానమని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన తప్పు పట్టారు. గవర్నర్‌ ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపే సమయంలో తమను మార్షల్స్‌ బలవంతంగా తోసేశారని దీంతో తాను వెనక కూర్చున్నానని జానారెడ్డి వివరించారు. అయినా సభ్యులెవరైనా తాగి వస్తే స్పీకర్ చర్యలు తీసుకుంటారని జానా అన్నారు.

రేవంత్ రెడ్డి ప్ర‌తాపం చూపిస్తాడు

Submitted by arun on Thu, 02/01/2018 - 10:51

ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్‌ పార్టీ రెడీ ఉందని తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నేత జానారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ శ్రేణులను టీఆర్ఎస్‌ బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తోందన్న జానా రేవంత్‌రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పారు.