Vangaveeti Radha

వంగవీటి రాధా ఎపిసోడ్‌పై క్లారిటీ ఇచ్చిన జగన్

Submitted by arun on Mon, 10/22/2018 - 16:03

వంగవీటి రాధా ఎపిసోడ్‌పై వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చారు. రాధాని విజయవాడ తూర్పుకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి బాలశౌరిని బరిలోకి దింపుతున్నట్టు జగన్ తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటుస్థాయి నేతల సమావేశంలో జగన్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. 
 

సముదాయింపులు... బుజ్జగింపులు.. రాధ దారికొచ్చినట్టేనా?

Submitted by santosh on Thu, 10/11/2018 - 10:51

వంగవీటి రాధను బుజ్జగించేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు.. విజయవాడలో లో రాధా నివాసానికి వెళ్లిన సాయిరెడ్డి అరగంట పాటు చర్చలు జరిపారు. సెంట్రల్ నుండి ఎందుకు తప్పించాల్సి వచ్చిందో రాధాకు వివరణ ఇచ్చిన సాయిరెడ్డి. బందర్ పార్టమెంటుకు వెళ్లాలని సూచించారు.. 

రాధా ఎపిసోడ్ లో నయా ట్విస్ట్

Submitted by arun on Wed, 09/19/2018 - 14:51

విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వైసీపీలో రేగిన చిచ్చు మరో మలుపు తిరిగింది. విజయవాడ సెంట్రల్ స్ధానాన్ని తనకు కేటాయించారంటూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రకటించారు.  నియోజకవర్గంలో తనకు ఎవరితో విభేదాలు లేవన్న ఆయన ... తన వల్లే వంగవీటి రాధాను తప్పించారనే ఆరోపణలు సరికాదన్నారు. అందరితో కలిసి పార్టీని బలోపేతం చేస్తానంటూ ప్రకటించారు. అధినేత జగన్ ప్లీనరిలో ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి  తీసుకెళ్లేందుకు ఇంటింటి ప్రచారం చేస్తున్నట్టు మల్లాది ప్రకటించారు. 

తేల్చి చెప్పిన అధిష్ఠానం.. రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడించనున్న రాధా

Submitted by arun on Wed, 09/19/2018 - 10:29

బెజవాడలో మరోసారి పొలిటికల్‌ హీట్ పెరిగింది. విజయవాడ సెంట్రల్‌ సీటుపై ఆశలు పెట్టుకున్న వంగవీటిని కాదని మల్లాది విష్ణుకు కేటాయించడంతో వైసీపీలో అసమ్మతి మళ్లీ భగ్గుమంది. అయితే సెంట్రల్‌ వద్దంటున్న పార్టీ తూర్పును ఆఫర్‌ చేసింది. మరి వైసీపీపై తిరుగుబావుటా ఎగురవేస్తారా..? లేక అధిష్టానం నిర్ణయానికి కట్టుబడుతారా..? వంగవీటి రాధా భవిష్యత్‌ ప్రణాళిక ఏంటి..? 

వైసీపీపై వంగవీటి రాధా ఫైర్

Submitted by arun on Tue, 09/18/2018 - 14:56

వైసీపీ హైకమాండ్ పై ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని... అయినా తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్‌ సీటు మల్లాది విష్ణుకు కేటాయించారన్న వార్తల నేపథ్యంలో ఇవాళ తన సన్నిహితులతో రాధా సమావేశమయ్యారు. రాధాకు పార్టీ అన్యాయం చేసిందని రాధా వర్గీయులు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఐతే.. మూడు రోజులు ఓపిక పెట్టాలని వారికి రాధా సూచించారు. 'మనం ఇంకా పార్టీలోనే ఉన్నాం..అధిష్టానంతో మాట్లాడదాం' అని చెప్పారు. అధిష్టానంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందామని రాధా తెలిపారు.  

విజయవాడ వైసీపీలో ముదురుతున్న సెంట్రల్ సీటు వివాదం

Submitted by arun on Tue, 09/18/2018 - 09:01

విజయవాడ వైసీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. విజయవాడ సెంట్రల్ సీటు వంగవీటి రాధాకు కాకుండా మల్లాది విష్ణుకు కేటాయించారని వచ్చిన వార్తలతో రాధా వర్గంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. రాధాకు విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వాలంటూ ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. ఒక దశలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

వంగవీటి రాధా ఇంటి వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకున్న అనుచరులు

Submitted by arun on Mon, 09/17/2018 - 15:37

వైసీపీలో విజయవాడ్ సెంట్రల్ నియోజక వర్గం సీటు వివాదం ముదురుతోంది. వంగవీటి రాధాకు సెంట్రల్ సీటుపై హామీ ఇవ్వకపోవడాన్ని రాధా అనుచరులు నిరసిస్తున్నారు. రాధాకు కాకుండా సెంట్రల్ సీటు ఎవ్వరికి ఇచ్చినా  ఆ ప్రభావం చాలా నియోజక వర్గాలమీద పడుతుందని రాధా అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాధా ఇంటి వద్దకు భారీగా చేరుకున్న ఆయన అనుచరులు అక్కడున్న ఫ్లెక్సీలను చించేశారు. రాధాకు సెంట్రల్‌ సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కొందరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. గమనించిన రాధా అడ్డుకుని వారించారు. ఇద్దరి కళ్లల్లో పెట్రోల్‌ పడడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఇటువంటి చర్యలను తాను సహించేది లేదని..

అలిగిన మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది

Submitted by arun on Wed, 02/21/2018 - 17:19

వైసీపీ శిక్షణా తరగతుల్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అలిగారు. తనకు స్టేజ్‌పైకి ఆహ్వానం రాకపోవడంతో ఆయన స్టేజ్‌పైకి వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయనను బుజ్జగించారు. అయినా వినని విష్ణు సాధారణ కార్యకర్తలాగే కిందనే ఉండిపోయారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే ఆయన అలాంటిదేమీ లేదని చెప్పారు. 

రాధా దారెటు?

Submitted by arun on Wed, 01/31/2018 - 11:49

విజయవాడ వైసీపిలో కలకలం రేగింది. పార్టీ నేత వంగవీటి రాధా మరోసారి పార్టీ అదినాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. గత కొంత కాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న రాధా.. ఇటీవల పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. దీనికితోడు పార్టీ నుండి సస్పెండైన గౌతంరెడ్డి జగన్ ను కలవడంతో రాధా అసంతృప్తి తారా స్థాయికి చేరింది. పార్టీ నుండి సస్పెండ్ చేసిన వారిని కలవడమేంటంటూ మండిపడుతున్నారు రాధా.

వైసీపీని వీడ‌నున్న‌వంగ‌వీటి రాధ‌..జోరుగా ప్ర‌చారం..?

Submitted by arun on Tue, 01/30/2018 - 15:24

విజయవాడ వైసీపీలో వ్యూహాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగడంతో పార్టీ అధినేత వై.ఎస్.జగన్ విజయవాడపై దృష్టిపెట్టారు. దీంతో వంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గౌతంరెడ్డిని మళ్లీ దగ్గరకు చేర్చుకున్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్‌ను గౌతంరెడ్డి కలుసుకున్నారు. విజయవాడ సెంట్రల్ సీటు కోసం ఇప్పటికే వంగవీటి రాధా, మల్లాది విష్ణు పోటీపడుతుంటే... ఇప్పుడు గౌతంరెడ్డి రాక ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది.