Mahakutami

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు సహకరించలేదు..అందుకే ఓడిపోయా!: కూటమి నేత

Submitted by chandram on Sat, 12/15/2018 - 13:29

ఇటివల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు తనను చాలా మోసం చేశారంటూ మహాకూటమి వైరా అభ్యర్ధి విజయసాయి సంచలన ఆరోపణలు చేశారు. మహాకూటమి పొత్తు ధర్మానికి సరిగ్గా కట్టుబడి కాంగ్రెస్ నేతలు సహకరించి ఉంటే వైరాలో తప్పకుండా గెలుపుబావుట ఎగిరేసేవాళ్లమని విజయసాయి తెలిపారు. కాంగ్రెస్ నేతలు నాకు సహకరించకుండా స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్ కే పూర్తి మద్దతు ఇచ్చారని వాపోయారు. అయినా ఇప్పుడు ఎం జరిగిందో తెలుసుగా ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇస్తూ అధికార పార్టీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని పేర్కోన్నారు.

కుదేలైన కూటమి...మట్టికరచిన మహామహులు

Submitted by arun on Wed, 12/12/2018 - 12:18

కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమన్నారు ఆయన్ని ఫామ్‌ హౌజ్‌కే పరిమితం చేయడమే టార్గెట్‌ అన్నారు అందుకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అన్నారు నాలుగు పార్టీలు కలిసి కూటమి కట్టారు. ముమ్మర ప్రచారం చేశారు కానీ ఫలితాల్లో ఆ కూటమి కుదేలయ్యింది. కనీసం చాలాచోట్ల పోటీ ఇవ్వలేక కకావికలం అయ్యింది. కారు జోరుకు కూటమి కూకటి వేళ్లతో సహా కూలిపోయింది. కూటమిలో పెద్దన్న పాత్ర పోషించిన కాంగ్రెస్‌ తిరుగులేని పరాజయం మూటగట్టుకుంది. 

కేసీఆర్ వందల కోట్లు ఖర్చుచేసినా జనం మా వెంటే ఉన్నారు

Submitted by arun on Sat, 12/08/2018 - 16:35

తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ వందల కోట్లు ఖర్చుచేసినా జనం మా వెంటే ఉన్నారని టి టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. కూటమిగా ఏర్పడిన తర్వాత 86 సంఘాలు తమతో కలిసివచ్చాయని వారందరి సహకారంతో తాము 70 నుంచి 80 సీట్లు సాధిస్తామని రమణ ధీమా వ్యక్తం చేశారు. మోడీ కేసీఆర్ చర్యలు తెలంగాణకు ప్రమాదకరంగా మారాయని అందువల్లే ప్రజలు ప్రజాకూటమివైపు మొగ్గు చూపారని రమణ అన్నారు. 2014 కన్నా ఓటింగ్‌ మరింత శాతం పెరిగిందన్నారు. అధికారులను అడ్డుపెట్టుకొని ఓట్లు తొలగించినా, ఇష్టానుసారంగా ఓటరు లిస్టును తయారు చేసినా.. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసినా ఓటర్లు చైతన్యంతో ఓట్లు వేశారని అన్నారు. 
 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది గంటల్లో...

Submitted by chandram on Thu, 12/06/2018 - 18:49

తెలంగాణలో మహాయుద్ధాని మరికొన్ని గంటలే సమయం ఉంది. దీంతో పోల్ తెలంగాణ కోసం అధికారయంత్రాంగం సర్వం సిద్దం చేసింది. భారీ భద్రత మధ్య ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.  ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. మరికొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల సంగ్రామంలో ఆఖరి అంకానికి తెరలేవనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కు ఏర్పాటు పూర్తి చేసింది ఈసీ. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పోలింగ్ సాఫీగా జరిగేలా అన్ని రకాల చర్యలను తీసుకుంది. ఈసీ రజత్ కుమార్ నుంచి కిందిస్దాయి ఉద్యోగి వరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.

బాలయ్యకు షాకిచ్చిన ఈసీ..

Submitted by arun on Wed, 12/05/2018 - 14:07

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు ఎన్నికల సంఘం(ఈసీ) షాకిచ్చింది. ఈ రోజు జరగాల్సిన రోడ్ షో లో పాల్గొనేందుకు అనుమతిని నిరాకరించింది. దీంతో టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి లోనయ్యాయి.  నిబంధనల ప్రకారం 48 గంటల ముందు రోడ్డుషోకు అనుమతి కోరాల్సి ఉండగా అలా చేయకపోవడంతో అనుమతివ్వలేదని ఈసీ పేర్కొంది. చివరి క్షణంలో రోడ్‌షోకు అనుమతి కోరడంతో ఈసీ అనుమతి నిరాకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. డిసెంబర్‌ 1 నుంచి హైదరాబాద్‌లో బాలకృష్ణ విస్తృతంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

టీఆర్‌ఎస్‌ ఎంపీ కేకే ఇంటికి వెళ్లిన ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌

Submitted by arun on Wed, 12/05/2018 - 12:14

తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రచారానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. దాంతో అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా ప్రచారంతో తెలంగాణను హీటెక్కిస్తున్నారు. ఎన్నికల ప్రచారం చివరి దశలో ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మహాకూటమి తరపున నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాసోజు శ్రవణ్‌, టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు (కేకే) ఇంటికి వెళ్లి ఆశ్చర్యపరిచారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే మంగళవారం శ్రవణ్‌ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు...తన నియోజకవర్గ పరిధిలో ప్రచారంలో పాల్గొన్నారు.

‘సీఎం సీటులో రేవంత్‌ కూడా ఉండొచ్చు’...కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ షాకింగ్ కామెంట్లు!

Submitted by arun on Wed, 12/05/2018 - 11:19

సింహాన్ని బోనులో బంధించి అడవిలో తిరగడం గొప్ప కాదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని కొడంగల్‌లోని ఆయన నివాసంలో ఆజాద్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డిని బయటకు వదిలి కేసీఆర్‌ కొడంగల్‌కు రావాలని సవాలు చేశారు. రేవంత్‌ను అరెస్ట్‌ చేసి ఇక్కడికి రావడం ప్రజాస్వామ్యమా?  అని ప్రశ్నించారు. అధికారం అన్నది ఎన్నటికీ శాశ్వతం కాదనీ, ఈ రోజు సీఎం కుర్చీపై కేసీఆర్ ఉన్నారనీ.. రేపు అదే కుర్చీపై రేవంత్ రెడ్డి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.

పొలిటికల్‌ హీట్‌ పెంచిన రేవంత్‌రెడ్డి అరెస్ట్ వ్యవహారం

Submitted by arun on Wed, 12/05/2018 - 10:28

సరిగ్గా 12 గంటల హైడ్రామా తర్వాత టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విడుదలయ్యారు. ఈసీ ఆదేశాలతో  జడ్చర్ల పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ నుంచి రేవంత్‌ను ప్రత్యేక వాహనాల్లో కొడంగల్‌కు తరలించారు. అంతకుముందు రేవంత్‌ ఆచూకీ తెలపాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు అర్ధరాత్రి అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించింది. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

సంక్రాతికి ముందే గంగిరేద్దులా కూటమి అభ్యర్థులు ప్రచారం: కేటీఆర్

Submitted by chandram on Mon, 12/03/2018 - 14:43

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుపై మరోసారి విమర్శలు గుప్పించారు ఆపదర్మ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను గాలికి వదిలేసివచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖానాపూర్‌ నియోజకవర్గంలోని ఉట్నూర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రేఖా నాయక్‌ తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 60ఏండ్లుగా మీరు చేసింది ఏమిలేదని నేడు తెలంగాణలో అన్ని వర్గాలకు టీఆర్ఎస్ మేలు చేసిందని వ్యాఖ్యనించారు.