somu veerraju

రమణదీక్షితులు అమిత్‌షాను కలిస్తే తప్పేంటి: వీర్రాజు

Submitted by arun on Wed, 05/23/2018 - 13:53

తిరుమల తిరుపతి దేవస్ధానంలో నెలకొన్న వివాదాలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా స్పందించారు. టీటీడీలో పరిపాలన చేస్తున్నది ఈవో ఏకే సింఘాలా? లేక రాజు గారా? అంటూ ప్రశ్నించారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆలయ మర్యాదలను బహిరంగంగా ప్రశ్నించిన రమణదీక్షితులు అమిత్‌షాను కలిస్తే తప్పేంటన్నారు వీర్రాజు. వేంకటేశ్వరస్వామిపై జరుగుతున్న ప్రయత్నాలకు ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు.  

టీడీపీకి సోము వీర్రాజే కరెక్ట్..

Submitted by arun on Mon, 04/02/2018 - 17:36

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ లాబీలో సోమవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంత్రి కళా వెంకట్రావు, మాజీ మంత్రి, భాజపా నేత మాణిక్యాలరావు, రాష్ట్ర మహిళా ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కొత్త శత్రువులకు నమస్కారం అంటూ.. నవ్వుతూ మాణిక్యాలరావును కళా వెంకట్రావు పలకరించారు. అడ్వాన్స్ కంగ్రాట్స్ అంటూ.. మాణిక్యాలరావుకు నన్నపనేని అభినందనలు తెలిపారు. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికపై సరదాగా మాట్లాడుకున్నారు. తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడిని కావడం లేదని, సోము వీర్రాజు అవుతున్నారని, వీర్రాజును తానే ప్రతిపాదించానని ఆయన చెప్పారు.

జగన్ ప్రతినిధులతో సోమువీర్రాజు రహస్య మంతనాలు

Submitted by arun on Mon, 04/02/2018 - 14:02

బీజేపీ నేత సోమువీర్రాజుపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రతినిధులతో సోము వీర్రాజు రహస్య మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేలా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి సోము వీర్రాజు శకునిలా మారారని అన్నారు. భారతంలో శకుని గతే సోము వీర్రాజుకు పడుతుందని బుద్దా వెంకన్న హెచ్చరించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం: బీజేపీ

Submitted by arun on Sat, 03/24/2018 - 12:54

తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీకి తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తామని అందుకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అవినీతికి పట్టిసీమ పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అవినీతిని తవ్వడానికి పలుగు సరిపోదని.. ఏకంగా బుల్డోజరే కావాలని వ్యాఖ్యానించారు. పట్టిసీమలో ఒక లారీ మట్టి తీయడానికి రూ. 4 లక్షల ఖర్చా అంటూ ఆయన ఆశ్చర్యపోయారు. పట్టిసీమ ప్రాజెక్టులో తీయడానికి కేంద్రం రూ. 67 కోట్లు ఇచ్చిందన్నారు. రూ. 1120 కోట్లతో మొదలైన పట్టిసీమ రూ.

టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ

Submitted by arun on Sat, 03/24/2018 - 11:50

ఏపీలో విపరీతమైన అవినీతి జరుగుతోందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు. అవినీతిని పెకిలించడానికి బుల్డోజర్లు కావాలన్నారు. రాష్ట్రంలో ఏ మేర అవినీతి జరుగుతుందో చెప్పడానికి పట్టిసీమ ప్రాజెక్టే నిదర్శనమన్నారు. పట్టిసీమకు 16 వందల కోట్లు, స్పిల్ వేకు 1400 కోట్లు ఎందుకు ఖర్చు చేశారన్నారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అన్నారు ఎమ్మెల్సీ సోమువీర్రాజు. నాయకుల దగర్నుంచి కిందిస్థాయి కార్యకర్తల దాకా.. ప్రతి ఒక్కరూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చెట్టు నీరుకు 4 వేల కోట్లు ఖర్చయ్యిందని.. ఆ డబ్బులతో పోలవరం స్పిల్ వే కట్టొచ్చన్నారు.

సీఎం రాజీనామా చేస్తే.. నేనూ చేసేస్తా!!

Submitted by arun on Wed, 03/21/2018 - 16:58

బీజేపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారనే ప్రచారం అవాస్తవం అని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కలిసి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చినందున బీజేపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారనే ప్రచారం పూర్తి అవాస్తవమన్నారు. టీడీపీ, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చామన్న వీర్రాజు సీఎం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తే అప్పుడు తాను కూడా రాజీనామా చేస్తానని వీర్రాజు స్పష్టం చేశారు. అంతగా అనుకుంటే ఇప్పుడే అందరూ కలిసి రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు.

విడాకులకు ముహూర్తం ?

Submitted by arun on Sat, 02/24/2018 - 12:10

ఏపీ రాజకీయాల్లో సరికొత్త అంకం మొదలైందా? ఇప్పటివరకూ పొత్తు సంసారాన్ని కాపాడుకుంటూ వస్తున్న టీడీపీ-బీజేపీ నేతలు ఇకపై ఆ అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చారా? హోదా కోసం కేంద్రం మీద ఒత్తిడి చేయాలంటూ చంద్రబాబు స్వరం మార్చడంతో ఏపీ బీజేపీ నేతలు కూడా గొంతులు పెకిలిస్తున్నారు. ఏకంగా చంద్రబాబుపై, టీడీపీ నేతలపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు విరుచుకుపడటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. మిత్రబంధానికి రోజులు చెల్లాయా అన్న అనుమానాలనూ రాజేస్తోంది. 

ఏపీలో పొత్తు వ్యవహారం చిత్తవుతోందా?..టీడీపీ-బీజేపీ స్నేహానికి కాలం చెల్లినట్టేనా?..సద్దు మణిగిందనుకున్న హోదా అంశం సైరన్ మోగిస్తోందా?

టీడీపీని టార్గెట్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్సీ ప‌ర్య‌ట‌న‌లు..?

Submitted by lakshman on Mon, 01/29/2018 - 22:11

సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ పార్టీ నేత‌లు గ‌ణాంకాలు సిద్ధం చేసుకుంటుంది. ఆ గ‌ణాంకాల ఆధారంగా  టీడీపీ ఎలా వెన్నుపోటు పొడిచిందో కేడ‌ర్ కు చెప్పే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు టాక్. ఇందులో భాగంగా ఆ పార్టీ  జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్యెల్సీ సోము వీర్రాజు అమరావతి, రాజమండ్రి, విజయనగరాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌ర్య‌ట‌నలో టీడీపీ మిత్ర ధ‌ర్మం, పార్టీపై  కేడ‌ర్ కు ఉన్న అపోహ‌లు, టీడీపీ - బీజేపీ మిత్రబంధం వాజపేయి హయాంలో ఎలా వున్నది ? పీఎం మోడీ వచ్చాక ఎలా ఉంది ? టీడీపీ  నాడు ఎలాంటి వెన్నుపోట్లు  పొడించింది..?