National

విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో షాక్

Submitted by chandram on Mon, 12/10/2018 - 21:02

బ్యాంకులకు రూ.9వేల కోట్లు అప్పు ఎగేవేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో షాక్ తగిలింది. మాల్యాను అప్పగించాలన్న భారత్ ప్రభుత్వ వాదనను వెస్ట్ మినిస్టర్ కోర్టు సమర్థించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఎమ్మా అర్బుత్నాట్ నేడు తీర్పు వెలువరించారు. ఈ నిర్ణయం యుకే హోమ్‌ ఆఫీస్‌లోని హోమ్‌ సెక్రటరీకి చేరుతుంది. ఆయన తీర్పు ఆధారంగా ఆదేశాలు జారీ చేస్తారు. ఐతే కోర్టు తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు మాల్యాకు 14 రోజుల సమయం ఇచ్చారు. కోర్టు తీర్పుపై మాల్యా స్పందించారు. తదుపరి ఏం చేయాలనే విషయాన్ని లాయర్లు చూసుకుంటారని చెప్పారు.
 

బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో మరో ముందడుగు

Submitted by chandram on Mon, 12/10/2018 - 20:30

జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్‌ హాల్‌లో 14 పార్టీల నేతలు సమావేశమయ్యారు.

ఉర్జిత్‌ను మెచ్చుకున్న మోదీ, జైట్లీ

Submitted by chandram on Mon, 12/10/2018 - 19:44

ఉర్జిత్ పటేల్, ఆర్బీఐ గవర్నర్ గా రాజీనామా చేసిన విషయం తెలిసిందే అయితే ఆదే విషయంపై తాజాగా  భారతదేశ ప్రధాన మంత్రి మోడీ స్పందించారు. అత్యంత ఆందోళ‌న‌క‌రంగా ఉన్న బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ను ఉర్జిత్ ఓ దిశ‌కు తీసుకువ‌చ్చార‌ని, ఉర్జిత్ పటేల్ కు స్థూల ఆర్థిక అంశాల‌పై చాలా లోత‌నైన అవ‌గాహ‌న ఉంద‌ని ప్ర‌ధాని త‌న ట్వీట్‌లో తెలిపారు. కాగా దినిపై ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా స్పందించారు. ఉర్జిత్ సేవ‌ల‌ను తప్పకుండా ప్ర‌భుత్వం గుర్తిస్తుంద‌ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు. ప‌బ్లిక్ స‌ర్వీసులో మ‌రి కొన్ని సంవ‌త్స‌రాలు ఆయ‌న ఉండాలని జైట్లీ తెలిపారు.

 

 

 

 

నాలుగు రాష్ట్రాల కౌంటింగ్ కు కౌంట్ డౌన్

Submitted by chandram on Mon, 12/10/2018 - 18:44

దేశమంతా ఆసక్తితో ఎదురుచూస్తున్న బీజెపీ పాలిత రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. తెలంగాణా, మిజోరం రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో సైతం కౌంటింగ్ కు విస్త్రుత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ అన్నట్లుగా జరుగుతున్న ప్రస్తుత ఐదురాష్ట్రాల ఎన్నికలు ఫలితాల దశకు చేరాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తెలంగాణాతో పాటు బీజెపీ పాలిత రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రం మిజోరమ్ లో సైతం కౌంటింగ్ కు రంగం సిద్ధమయ్యింది.

బ్రేకింగ్ : ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా

Submitted by arun on Mon, 12/10/2018 - 17:22

ఉర్జిత్ పటేల్, ఆర్బీఐ గవర్నర్ గా రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా పలు అంశాల విషయంలో ఉర్జిత్, కేంద్ర ప్రభుత్వంతో విభేదిస్తూ వచ్చారు. అయితే, వ్యక్తిగత కారణాల వల్లే తాను ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్టు ఉర్జిత్ వెల్లడించారు. 

భర్తకు విషపు ఇంజక్షన్‌ ఇచ్చి హత్య

Submitted by chandram on Mon, 12/10/2018 - 17:04

వివాహేతర సంబంధం మానుకోవాలని భార్యకు నచ్చచెప్పాడు. దింతో ఆగ్రహించిన భార్య ప్రయుడితో కలిసి తన భర్తను హతమర్చింది. కాగా తనకేం తెలియనట్లు భర్త హత్యను ఆత్మహత్యగా నమ్మింపచేసే యత్రంచేసిన భార్యను ఎట్టకేలకు పోలీసులు గుట్టురట్టుచేసి కటకటాలకు నెట్టిరు. ఇక వివారాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి తాలూకా జంబుకూడబట్టి గ్రామంలో రాజలింగం(35), సోనియా(25) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

బీజేపీకి ఊహించని షాక్.. ఎన్డీయేకి కేంద్రమంత్రి గుడ్‌బై!

Submitted by arun on Mon, 12/10/2018 - 15:26

పార్లమెంటు సమావేశాలకు సరిగ్గా ఒక్కరోజు ముందు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి ఇవాళ ఊహించని షాక్ తగిలింది. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) చీఫ్ ఉపేంద్ర కుశ్వాహ ఎన్డీయే ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పేశారు. కుష్వాహా తన రాజీనామా లేఖను ప్రధానమం‍త్రి కార్యాలయానికి (పీఎంఓ) ఆమోదం కొరకు పంపినట్టు తెలిసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీఏ సీట్ల సర్ధుబాటు ప్రతిపాదనలతో పాటు బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ వైఖరితో గత కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.

చివరి పూర్తిస్థాయి పార్లమెంట్ సమావేశాలివే

Submitted by arun on Mon, 12/10/2018 - 13:01

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం  ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికలు ముందు ఇవే పూర్తి స్దాయి సమావేశాలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే రోజు తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఫలితాలు వెలువడతూ ఉండటం ఇందులో మూడు రాష్ట్రాలు బీజేపీ పాలిత ప్రాంతాలు కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభం..

Submitted by nanireddy on Mon, 12/10/2018 - 09:49

దేశీయ స్టాక్‌ మార్కెట్లు డిసెంబర్ 10 న భారీ నష్టాలతో  ప్రారంభమయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 158 పాయింట్లు పడిపోయి 10,581 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లలో మరోసారి అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రధాన ఇండెక్సులు 3 శాతం స్థాయిలో పతనమయ్యాయి. ఈ కారణంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమవుతాయని అంచనా వేస్తోంది. అలాగే రేపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశమున్నట్టు కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.  

ఘనంగా సోనియాగాంధీ బర్త్‌డే వేడుకలు

Submitted by chandram on Sun, 12/09/2018 - 13:17

ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ బర్త్‌డే వేడుకలను కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని  పెద్దమ్మ గుడిలో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల అభీష్టం మేరకు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి ప్రతిఒక్కరూ రుణపడి ఉంటారని చెప్పారు. మధుయాష్కీతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఇతరులు పెద్ద ఎత్తున్న పాల్గోన్నారు.