Telangana

ప్రణయ్‌ హత్యలో మాజీ ఎమ్మెల్యే హస్తం? వీరేశంను కూడా విచారిస్తున్నారా?

Submitted by arun on Tue, 09/18/2018 - 13:16

సంచలనం సృష్టించన ప్రణయ్ హత్యకేసులో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్టు నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ప్రణయ్ హత్యకు మొత్తం కోటి రూపాయాల ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు. నల్గొండ గ్యాంగ్ తో కలిసి బీహార్ గ్యాంగ్ సుపారీ తీసుకుందన్నారు. అడ్వాన్స్ గా 18 లక్షలు తీసుకున్నారని విచారణలో తేలినట్టు ఎస్పీ రంగనాథ్ చెప్పారు. ప్రణయ్ ను చంపింది బీహార్ కు చెందిన వ్యక్తేనని తెలిపారు. నరిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశంని కూడా విచారిస్తున్నామని నల్గొండకి చెందిన ఐఎస్ఐఎస్ మాజీ టెర్రరిస్టులకు ప్రణయ్ హత్య కేసుతో సంబంధం ఉందన్నారు. 
  

ఫేస్‌బుక్‌ వేదికగా అమృత పోరాటం

Submitted by arun on Tue, 09/18/2018 - 11:42

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తండ్రి కుల దురహంకారం కారణంగా భర్తను పోగొట్టుకున్న అమృత న్యాయం కోసం సామాజిక మాధ్యమం వేదికగా ఉద్యమాన్ని ఆరంభించింది. హత్యకు గురైన భర్త పేరుతో ‘జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్‌’ పేరుతో ఫేస్‌బుక్‌ పేజీని సృష్టించింది. ‘ప్రణయ్‌ ఇప్పుడు ఒంటరి కాదు. నాతోపాటు కోట్ల మంది గుండెల్లో బతికే ఉన్నాడు’ అంటూ అమృత తొలి పోస్టు చేసింది. మిర్యాలగూడ పట్టణంలో ప్రణయ్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని , ఈ దిశగా అందరూ సహకరించాలని కోరింది.

ప్రాణం తీసిన భూ రికార్డుల తప్పిదాలు

Submitted by arun on Tue, 09/18/2018 - 11:27

మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. కోటపల్లి మండలం రాజారాంలో భూరికార్డుల తప్పిదాలకు ఒకరు బలయ్యారు. లక్ష్మి అనే మహిళకు చెందిన భూమిని.. శ్యామల పేరుపై అధికారులు రికార్డులో నమోదు చేశారు. దీంతో తనకు భూమి దక్కదేమోనని ఆందోళన చెందిన లక్ష్మి పురుగులమందు తాగి, ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన శ్యామల, తనపై కేసు నమోదు అవుతుందనే భయంతో ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది.  ప్రసుత్తం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్యామల పరిస్థితి విషమంగా ఉంది. 

డాక్టర్ తో ప్రణయ్ చివరి మాటలు..!

Submitted by arun on Tue, 09/18/2018 - 10:56

ప్రణయ్‌ దారుణహత్య మా ఆస్పత్రి సమీపంలోనే జరగడం చాలా బాధకలిగించిందన్నారు డాక్టర్‌ జ్యోతి. రెగ్యులర్‌ చెకప్‌ వచ్చినప్పుడు బేబీ హార్ట్‌బీట్‌ విని  ప్రణయ్‌ చాలా హ్యాపీగా  ఫీలయ్యాడని చెప్పింది. ఫ్యూచర్‌లో బిజినెస్‌ చేయాలనుకుంటున్నట్లు చెప్పిన ప్రణయ్‌ బయటకు వెళ్లగానే మృతి చెందడం కలిచివేసిదంటున్నారు డాక్టర్‌  జ్యోతి.

ప్రణయ్‌ కేసులో కొత్త పేరు...ఎవరీ అస్గర్ అలీ.. ప్రణయ్ హత్యతో అతనికి లింకేంటి?

Submitted by arun on Tue, 09/18/2018 - 10:25

సంచలనం సృష్టిస్తున్న మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో కొత్తపేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటిదాకా ఈ కేసులో ప్రధాన సూత్రధారి అబ్దుల్‌ బారీ అని భావిస్తుండగా తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాల ప్రకారం బారీ గురువు అస్గర్‌ అలీనే స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మారుతీరావును నుంచి కోటి సుపారీ తీసుకున్న అస్గర్‌ అలీ హత్యలో పాల్గొన్న వ్యక్తికి పది లక్షలు చెల్లించినట్లు తేలింది. 

105 మంది గులాబీ అభ్యర్థుల్లో గుబులు...జాబితాలో 20 మందికి టికెట్‌ కష్టమని ప్రచారం...?

Submitted by arun on Tue, 09/18/2018 - 10:04

తాను ప్రకటించిన 105 మంది అభ్యర్ధుల్లో కనీసం 20 మందిని మార్చేందుకు గులాబి బాస్ సిద్దమవుతున్నారా కాంగ్రెస్ కూటమి అభ్యర్ధులను ప్రకటించిన వెంటనే  టిఆర్ఎస్, పాత అభ్యర్ధులను మార్చి కొత్త అభ్యర్ధులను కేసిఆర్  తెరమీదకు తెస్తారా? అందుకే చాలా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని మొదలు పెట్టలేదా? టికెట్ల మార్పు ఆలోచన వల్లే  చాలా మంది అభ్యర్ధులను ప్రచారానికి వెళ్లనీయడం లేదా? టికెట్ కట్ చేయాల్సిన 20 మంది తాజా మాజీల జాబితాను కేసీఆర్ రెడి చేశారా? 

ప్రణయ్‌ హత్య కేసులో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు...అమృతను మర్చిపోతే కోటిన్నర ...

Submitted by arun on Tue, 09/18/2018 - 09:38

ప్రణయ్‌ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల విచారణలో మారుతీరావు నుంచి కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. అమృతను మర్చిపోతే కోటిన్నర ఇస్తానంటూ ప్రణయ్‌కు మారతీరావు ఆఫర్‌ ఇచ్చాడని.. మిర్యాలగూడ వదిలివెళ్లాలంటూ ప్రణయ్‌ కుటుంబంపై ఒత్తిడి తెచ్చినట్టు విచారణలో తేలింది. ప్రణయ్‌, అమృత కలిసి ఉన్న వీడియో, ఫొటోలు చూసి.. వారిపై మహుతీరావు మరింత కక్ష పెంచుకున్నట్లు విచారణలో వెల్లడించాడు. ప్రణయ్‌ హత్య కేసులో నిందితులను సాయంత్రం 5 గంటలకు.. పోలీసులు  మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. 

రాజకీయంగా ఎదుర్కోలేకే ఓటుకు నోటు కేసును తెరపైకి తెస్తున్నారు

Submitted by arun on Tue, 09/18/2018 - 09:29

రాజకీయంగా ఎదుర్కోలేకే ఓటుకు నోటు కేసును మళ్లీ తిరగదోడుతున్నారని కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మత్తయ్యపై క్వాష్‌ పిటీషన్‌ వేస్తే హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన ఇదే కేసులో సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బలు తగిలాయన్నారు. మోడీకి ఎదురుతిరిగిన చంద్రబాబును, కేసీఆర్‌ ప్రత్యర్థి రేవంత్‌రెడ్డిని దెబ్బకొట్టేందుకు మోడీ, కేసీఆర్‌లు కలిసి కుట్ర పన్నుతున్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు.

ఎట్టకేలకు రాజకీయ మౌనం వీడిన విజయశాంతి

Submitted by arun on Tue, 09/18/2018 - 08:52

తెలంగాణ కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి ఎట్టకేలకు మౌనం వీడారు. 2014 ఎన్నికల తర్వాత పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా లేని విజయశాంతి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీకాంగ్రెస్‌ ఎన్నికల సన్నద్ధత, వ్యూహాలపై తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. సీనియర్ లీడర్లు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. మధుయాష్కీ, డీకే అరుణ, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిపి ఒక టీమ్‌గా కమిటీ వేస్తే ప్రభావముంటుందని విజయశాంతి అభిప్రాయపడ్డారు.

ప్రణయ్ హత్య కేసులో కాంగ్రెస్ సంచలన నిర్ణయం

Submitted by arun on Mon, 09/17/2018 - 14:48

కులాంతర వివాహం చేసుకుని హత్యకు గురైన ప్రణయ్ కేసు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ దిద్దుపాటు చర్యలకు ఉపక్రమించింది. ప్రణయ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిర్యాలగూడ కాంగ్రెస్ నేత కరీంను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, సీఎల్పీ నేత జానారెడ్డి ప్రణయ్‌ ఇంటికి వచ్చి.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రణయ్‌ భార్య అమృతవర్షిణితో మాట్లాడారు. జరిగిన ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.