Anantapur

జోరుగా వజ్రాల వేట

Submitted by arun on Sat, 06/16/2018 - 16:10

ఇక తొలకరి జల్లులు పలకరించడంతో  అనంతపురం జిల్లాలోనూ వజ్రాల వేట ప్రారంభమయ్యింది. వజ్రకరూర్ మండలంలోని పలు గ్రామాల్లో  స్ధానికులు పోలాలను జల్లెడ పడుతున్నారు. ఎక్కడైనా ఓ వజ్రం  దొరకకపోతుందా అంటూ ఆశగా అన్వేషణ సాగిస్తున్నారు. తొలకరి జల్లులు కురవగానే అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలు వేసేందుకు సిద్ధమవుతుంటే ... వజ్రకరూర్‌‌లో మాత్రం స్ధానికులు, చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు పొలాల్లో తిష్టవేశారు. తెల్లవారుజాము నుంచి మసకమసక చీకటి పడే వరకు పోలాల్లోనే ఉంటూ రంగరాళ్ల కోసం అన్వేషిస్తున్నారు. ముసలి, ముతక, ఆడ, మగా, చిన్నా, పెద్ద తేడా లేకుండా రోజుల తరబడి పొలాల్లోనే ఉంటూ వజ్రాల వేట సాగిస్తున్నారు. 

చిన్నారి ప్రాణాలు తీసిన జెయింట్ వీల్

Submitted by arun on Mon, 05/28/2018 - 12:16

అనంతపురం నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో ఉన్న జెయింట్ వీల్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆనందాన్ని ఇస్తుందని ఆ జెయింట్ వీల్ ను ఎక్కిన చిన్నారులకు చేదు జ్ఞాపకాన్ని ఇచ్చింది. అలాగే ఓ చిన్నారి ప్రాణాలు పోయాయి.
అనంతపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన రోబో ఎగ్జిబిషన్ లో జరిగిన ప్రమాదంలో అమృత అనే 8 ఏళ్ళ చిన్నారి మరణించింది. మరో ఆరుగురు పిల్లలు గాయపడ్డారు. వీరు ఎక్కిన భారీ జెయింట్ వీల్ బోల్ట్ వదులై..ఒక్కసారిగా రెండు బాక్సులు ఊడి 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాయి.

జనసేన ఆపరేషన్ ఆకర్ష్ షురూ..జేసీకి జనసేన ఆహ్వానం..?

Submitted by arun on Thu, 04/12/2018 - 11:46

వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తానని చాలా కాలం కిందటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇప్పటికే ఒకసారి జిల్లాలో పర్యటించిన పీకే.. మరోసారి అనంతలో టూర్‌కి సన్నాహాలు చేస్తున్నారు. తన పోరాటాలకు కేంద్రంగా పవన్ అనంతపురం జిల్లాను ఎంచుకోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రాబోయే సాధారణ ఎన్నికలే లక్ష్యంగా జనసేనాని పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. పార్టీ ప్రారంభమై నాలుగేళ్లయినా ఏ ఒక్కరూ ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో జనసేనలోని కీలకనేతలు ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రారంభించినట్టు తెలుస్తోంది.

ప‌రిటాల కుటుంబంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ..ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Submitted by lakshman on Sun, 01/28/2018 - 12:03

పవన్ అనంతపురం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించడంపై ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్‌ హిందూపురాన్నే తన రాజకీయ కేంద్రంగా ఎంచుకున్నారు. తన సొంత ఊరుతో పాటు తిరుపతిని కూడా కాదని అనంత నుంచే ఆయన శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురం నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తాజాగా జనసేనాధినేత పవన్‌కల్యాణ్‌ అనంతపురం నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టడంపై పార్టీ నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

నా ఆఖరి శ్వాస వరకు సీమకు అండగా ఉంటా

Submitted by arun on Sat, 01/27/2018 - 13:10

రాయలసీమ సమస్యలపై తన తుది శ్వాస వరకూ పోరాడతానన్నారు పవన్‌‌. రాయలసీమ అంటే తనకు రక్తపాతం, ఫ్యాక్షనిజం కనిపించదన్న జనసేనాని సీమ పేరు చెబితే సస్యశ్యామలమైన ప్రాంతమే గుర్తుకొస్తుందన్నారు. రాయలసీమ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానన్న పవన్‌‌ ప్రత్యేక రైలులో ఢిల్లీ యాత్ర చేపడదామన్నారు.  ‘చలోరే.. చలోరే’ కార్యక్రమంలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ అనంతపురం జిల్లాలో పర్యటించారు. అనంతపురంలోని గుత్తి రహదారిలో జనసేన పార్టీ కార్యాలయానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలు తనపై చూపుతున్న ప్రేమను జీవితంలో మరచిపోలేనని అన్నారు.

కరువు యాత్రను కడదాకా లాగుతారా..మధ్యలోనే రాంరాం చెబుతారా?

Submitted by arun on Fri, 01/26/2018 - 18:54

అసలు సేనాధిపతి రణక్షేత్రం ఏమిటి? నాలుగేళ్లు దాటుతున్నా జనసేనకు పార్టీపరమైన సంస్థాగత నిర్మాణం లేదు. జనసేన అంటే ఇంకా ఒక్క పవన్‌కల్యాణ్‌ మాత్రమే వేదికల మీద కనపడుతున్నాడు. ఇంకా ఆయనలో ఓ క్లారిటీ మిస్‌ అవుతూనే ఉందని ఫ్యాన్స్‌ ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నారు. ఇంతకీ తన ఎజెండా ఏమిటి? సమస్యల కేస్‌ స్టడీ చేస్తున్నానని చెబుతూ జనానికి కనెక్ట్‌ అవుదామనుకుంటున్న పవన్‌ రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అన్ని సమస్యలను టచ్‌ చేసి చూడు... అన్నట్టుగానే కరువు యాత్రలో కూడా క్లారిటీ మిస్‌ అవుతారా? కన్ఫ్యూజన్‌ లేకుండా ముందుకు సాగుతారా?

పవన్‌ యాత్రకు స్ఫూర్తి ఇదేనా?

Submitted by arun on Fri, 01/26/2018 - 18:47

జనసేనాని పవన్‌కల్యాణ్‌ కరువు యాత్రను అనంతపురం నుంచి శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనున్న పవన్‌ యాత్రపై అభిమానులు, కార్యకర్తలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వీటన్నింటి మధ్య పవన్‌ టూర్‌ ఏ మేరకు సక్సెస్‌ అవుతుంది.? తన ఉనికికి ఆయువు పట్టుగా ఉన్న ఉత్తరాంధ్ర నుంచో లేక సొంత జిల్లా నుంచో కాకుండా... అనంతపురం నుంచి ఎంచుకోవడం వెనుకున్న అసలు నిజమేంటి? గతంలో ఆదరించిన పార్టీల్లాగేనే అనంతవాసులు పవన్‌ను ఆదరిస్తారా? అక్కున చేర్చుకుంటారా?