Boddupalli Srinivas

బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్యకు నల్లగొండ అసెంబ్లీ సీటు?

Submitted by arun on Wed, 02/07/2018 - 10:57

తెలంగాణ కాంగ్రెస్, సెంటుమెంటు రగిలించడానికి సిద్దమవుతోందా..? నల్గొండలో హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబానికి టిక్కెట్టు ఇచ్చి.. తాము కార్యకర్తలను ఆదుకుంటామని చెప్పడానికి రెడీ అవుతోందా..?  కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి స్థానాన్ని, ఆ కుటుంబాన్ని త్యాగం చేయడానికి యోచిస్తున్నారా..?  తాజా పరిణామాలు పరిశీలిస్తే, అవుననే అనిపిస్తోంది.
 

కాంగ్రెస్ విష సంస్కృతికే బొడ్డుపల్లి బలయ్యాడు: జగదీష్‌రెడ్డి

Submitted by arun on Tue, 02/06/2018 - 11:49

కాంగ్రెస్ అంతర్గత గొడవలతోనే నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చరిత్ర హత్యలు, దాడుల రాజకీయాలమయమని విమర్శించారు. వారిలో వారే గ్రూపులు కడుతూ ఆధిపత్య రాజకీయాలతో ఏనాడూ అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. శ్రీనివాస్ హత్య విషయంలో కాంగ్రెస్ నేతల దుష్ప్రచారాన్ని ఖండించారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేలతో కలిసి విలేకరులతో మంత్రి మాట్లాడుతూ..

మరో మాజీ ఎమ్మెల్యేను త్వరలోనే చంపేస్తారు!

Submitted by arun on Mon, 01/29/2018 - 16:36

సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. మిర్చి బండి దగ్గర కొట్లాట వల్లే నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేశారన్న నివేదికపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో జరుగుతున్న వరుస హత్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా చంపేస్తారని అన్నారు.  ఈ విషయం డీజీపీకి కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. కేసీఆర్ దోపిడీ రాజ్యానికి అండగా ఉండటానికే పోలీసులు ఉన్నారా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

శ్రీనివాస్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలి లేదంటే సీఎం హస్తం ఉందని భావించాల్సి వస్తుంది

Submitted by arun on Mon, 01/29/2018 - 16:14

నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త హత్య కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. మిర్చి బండి వద్ద జరిగిన గొడవలో శ్రీనివాస్ హత్య జరిగితే...మిర్చిబండి యాజమానిని పోలీసులు ఎందుకు విచారించలేదు అని ప్రశ్నించారు. స్థానిక డీఎస్సీ అండతో శ్రీనివాస్ మర్డర్ అయ్యాడన్నారు. ఎస్పీ మాట్లాడిన తీరు బాధాకరంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ కు నిజాయితీ ఉంటే శ్రీనివాస్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే ఈ కేసు వెనుక సీఎం హస్తం ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కన్నీరు కారుస్తూనే పాడె మోసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి!

Submitted by arun on Fri, 01/26/2018 - 12:03

నిన్న ప్రత్యర్థుల చేతిలో దారుణంగా హతుడైన తన కుడిభుజం, నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్నీరు కారుస్తూనే పాడె మోశారు. హత్య విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రాజగోపాల్‌ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి వచ్చారు. శ్రీనివాస్‌ కుమార్తెను ఓదారుస్తూ వెంకట్‌రెడ్డి బోరున విలపించారు. కుటుంబాన్ని ఓదార్చారు. అంతిమ యాత్రలో చివరికంటా ఉండి శ్రీనివాస్‌ పాడెను మోశారు. శ్రీనివాస్‌ హత్యకు కారకులను అరెస్టు చేయాలని, సీబీసీఐడీతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఉదయం మూడు గంటలపాటు ధర్నా చేశారు.