komatireddy venkat reddy

జిమ్‌లో ఉల్లాసంగా గడుపుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Submitted by arun on Wed, 12/12/2018 - 11:27

టెన్షన్‌ను అధిగమించేందుకు జిమ్‌ చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమేనని, 20ఏళ్లుగా ఎమ్మెల్యేగా తనను ఎన్నుకున్న ప్రజలు ఈ సారి మార్పు కోరుకున్నారని చెప్పారు. తాను రోజు వారి లాగే దినచర్యను కొనసాగిస్తున్నానన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇవాళ నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. మరోవైపు అధిష్టానం ముందు పట్టుబట్టి సాధించుకున్న మునుగోడు, నకిరేకల్ సీట్లలో ఆయన తమ్ముడు రాజగోపాల్‌ రెడ్డి, ప్రధాన అనచరుడు చిరుమర్తి లింగయ్యలు గెలుపొందారు.

70 నంచి 80 స్థానాలు గెలుస్తాం : కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

Submitted by arun on Sat, 12/08/2018 - 16:01

తెలంగాణ ప్రజల తీర్పు ప్రజాకూటమికి అనుకూలంగా ఉండబోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 70 నంచి 80 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేషనల్ ఛానెల్స్ చేస్తున్న సర్వేలకు విశ్వసనీయత లేదని కోమటిరెడ్డి అన్నారు. గత 15 సంవత్సరాలుగా లగడపాటి సర్వేలు చేస్తున్నారని తెలంగాణ ఎన్నికలపై లగడపాటి చేపట్టిన సర్వేలో విశ్వసనీయత ఉందని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. టీఆర్‌ఎస్‌ చిల్లర రాజకీయాలను నల్లగొండ ప్రజలు నమ్మలేదన్నారు. నకిరేకల్‌లో చిరుమర్తి, మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి గెలుస్తారని అన్నారు. ప్రజాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు.

కోమటిరెడ్డికి భారీ షాక్

Submitted by chandram on Thu, 11/29/2018 - 12:16

కాంగ్రెస్ పార్టీకి షాక్ లా మీద షాక్ తగులుతునే ఉన్నాయి. తాజాగా నల్లగొండ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కొలుకోలేని భారీ షాక్ తగిలింది. నల్లగొండ జిల్లాలో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్‌కు టాటా చెప్పి  కారు ఎక్కనున్నారు. వరసగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా ఉన్న చిలకల గోవర్ధన్‌తో పాటు మరో సీనీయర్ నేత, ప్రముఖ న్యాయవాది ధరనికోట రాము నేడు ఆపద్దర్మ మంత్రి కల్వకుంట్ల రామారావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్ధంపుచ్చుకొనున్నారు. ఆపద్దర్శ మంత్రి జగదీశ్ రెడ్డి మంతనాలు జరపడంతో ఎట్టకేలకు వీరిరువురు కారుఎక్కడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

గెలిచేవారికే తొలి జాబితాలో టికెట్లు వచ్చాయి

Submitted by arun on Tue, 11/13/2018 - 10:47

కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాపై ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. తొలి జాబితాలో గెలిచేవారికి టికెట్లు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రకటించిన తొమ్మిది స్థానాలలో కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేపటి నుంచి ప్రచారం ముమ్మరంగా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సభలతో కొత్త జోష్‌ తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.
 

కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి అల్టిమేటమ్‌... ఎందుకు?

Submitted by arun on Fri, 11/09/2018 - 17:53

నకిరేకల్‌ టికెట్‌ను చిరుమర్తి లింగయ్యకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌ అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేశారు. నకిరేకల్‌ స్ఠానాన్ని తెలంగాణ ఇంటిపార్టీకి కేటాయిస్తే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఎస్పీ తరపున నల్గొండ జిల్లాలో మొత్తం 12 స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 12 స్థానాల్లో ఆరు స్థానాల్లో గెలుస్తామని ధీమాతో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ మరో ఆరు స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీని ఓడిస్తామని అధిష్ఠానికి హెచ్చరికలు జారీ చేసినట్టు గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు...అయనకు టికెట్ ఇవ్వకపోతే నేనూ పోటీ చేయను...

Submitted by arun on Fri, 11/09/2018 - 11:33

కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకపోతే తాను కూడా నల్గొండ నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. కార్యకర్తల మనోభీష్టానికి వ్యతిరేకంగా పార్టీ నడుచుకుంటే ఎంతటి వారినైనా ఓడిస్తారని హెచ్చరించారు. ఇవాళ నార్కట్‌పల్లి వచ్చిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యకర్తల ఆందోళనపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నకిరేకల్‌ టికెట్ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకుంటే నల్గొండలో తాను పోటీ చేయనని తేల్చి చెప్పారు.

కేసీఆర్ లా మాట తప్పే తత్వం కాంగ్రెస్ పార్టీకి లేదు

Submitted by arun on Thu, 09/20/2018 - 17:11

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం దగ్గర నుంచి వంద హామీలను కేసీఆర్ ఇచ్చారని... ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించి, ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ లా మాట తప్పే తత్వం కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలను కేసీఆర్ బానిసలుగా చూశారని విమర్శించారు. కేసీఆర్, టీఆర్ఎస్ పతనం నల్గొండ నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు.
 

టీడీపీతో పొత్తుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Submitted by arun on Thu, 09/13/2018 - 16:14

తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తుపై మరోసారి ఆలోచించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఓటు బ్యాంకు లేదని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. పొత్తుపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నిశితంగా వివరిస్తానని చెప్పారు. మహాకూటమిలోని పక్షాలను కేవలం పది సీట్లకు మాత్రమే పరిమితం చేయాలని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.