ys jagan padayatra

రేపటి జగన్‌ పాదయాత్ర వాయిదా

Submitted by arun on Fri, 11/02/2018 - 12:37

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడి నుంచి జగన్‌ ఇంకా కోలుకోలేదు. భుజానికి గాయం కారణంగా లోపలి కండరాలు మానలేదు. గాయం మానడానికి మూడు వారాల సమయం పట్టే అవకాశముందని అప్పటి వరకు కుట్లు అలాగే ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గాయం పూర్తిగా మానే వరకు రెస్ట్‌ తీసుకోవాలని సూచించారు. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం జగన్‌ ప్రజాసంకల్పయాత్ర రేపటి నుంచి కొనసాగించాల్సి ఉంది. అయితే, గాయం ఇంకా మానకపోవడంతో వారం రోజుల రెస్ట్‌ అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో విజయనగరం జిల్లాలో జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర ఈ నెల 10 తర్వాత నుండి ప్రారంభమయ్యే అవకాశముంది.

జగన్ పాదయాత్రకు కాపు రిజర్వేషన్ సెగ

Submitted by arun on Mon, 06/18/2018 - 12:07

జగన్ పాదయాత్రకు కాపు రిజర్వేషన్ సెగ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా పీ గన్నవరం మండలం పెదపూడిలో కాపు వర్గానికి చెందిన యువత.. జగన్ పాదయాత్రను అడ్డుకున్నారు. కాపు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలంటూ పాదయాత్రలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అయితే దీనిపై ఏమాత్రం స్పందించకుండానే.. జగన్ ముందుకు వెళ్లారు. ఇటు పోలీసులు మాత్రం.. నిరసన తెలుపుతున్న యువకులను పక్కకు లాగేశారు. 
 

జగన్ పై యువ హీరో సంచలన వాఖ్యలు..

Submitted by arun on Sat, 06/02/2018 - 11:25

ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయ నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు జరగుతున్న ఈ పాదయాత్రలో జగన్ కు ప్రజల నుండి పెద్దఎత్తున మద్దతు లభిస్తుంది. అయితే సినీ ప్రముఖుల వద్ద నుండి కూడా జగన్ కు మద్దతు లభిస్తుంది. తాజాగా నటులు పోసాని కృష్ణమురళి, పృథ్వి రాజ్ పాదయాత్రలో కలిసి పాల్గొనగా జగన్ సీఎం అయ్యే ఛాన్స్ కనపడుతుందంటూ సూపర్ స్టార్ కృష్ణ అభివర్ణించాడు. అయితే జగన్ పాదయాత్రను కొనియాడడం ఇప్పుడు ఇంకో కుర్ర హీరో వంతయింది. 

అందుకే పాదయాత్రలో పాల్గొన్నా: పోసాని

Submitted by arun on Sat, 05/26/2018 - 14:59

ప్రముఖ సినీదర్శకుడు, విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి ... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జగన్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు ఇరువురి కలిసి మాట్లాడుకున్నారు. అనంతరం పోసాని మాట్లాడుతూ..‘జగన్‌లోని ధృడ సంకల్పం నన్ను ఆకర్షించింది. అందుకే ఆయనకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నాను.  అన్ని వర్గాల సమస్యలు పరిష్కరించే నాయకుడు వైఎస్‌ జగన్‌. ఆయనలో సంకల్పం చూసి ఆశ్చర్యం వేసింది.

సంతోషం అంతా ఆ ప‌చ్చ‌చొక్కాలోనే : జ‌గ‌న్

Submitted by lakshman on Wed, 04/11/2018 - 04:10

వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా జగన్ గుంటూరు జిల్లా  లో సీఎం చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలలో అధికారంలోకి రావడం కోసం ప్రజలకు అబద్దాల హామీలు ప్రకటించి మోసం చేసి గెలిచారు అన్నారు.
అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలువునా మోసం చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలను అవినీతిమయం చేశారు. చంద్రబాబు  అయ్యాక కేవలం తన ధన దాహం కోసం ప్రభుత్వాధికారులను వాడుకుంటూ తన ఖజానాను నింపుకుంటున్నారు అని అన్నారు.

మ‌రో అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్న జ‌గ‌న్

Submitted by lakshman on Fri, 01/26/2018 - 00:01

ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జ‌గ‌న్ చేప‌ట్టిన  పాదయాత్ర  900 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నేష‌న‌ల్ మీడియాతో మాట్లాడిన జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ తో క‌లిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు. కాక‌పోతే  త‌నకు ముందుగా బీజేపీ ఓ హామీ ఇవ్వాల‌ని సూచించారు. ప్ర‌త్యేక హోదా ఇస్తే మరోమారు ఆలోచించ‌కుండా బీజేపీతో క‌లిసి పోటీ చేస్తామ‌ని తెలిపారు. చంద్ర‌బాబు అస‌త్య ప్ర‌చారాల‌తో మ‌భ్య‌పెడుతున్నార‌ని అన్నారు. ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి 4ఏళ్లు అవుతున్నా ఏపీ రాజ‌ధాని నిర్మాణం ప్రారంభం కాలేద‌ని .. రాజధాని పేరిట చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు.

వైసీపీ ఎల్పీ కార్యాల‌యంలో బీజేపీ నేత క‌ల‌కలం

Submitted by lakshman on Thu, 01/25/2018 - 10:02

వైసీపీ ఎల్పీ కార్యాల‌యంలో బీజేపీ నేత ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం క‌ల‌క‌లం రేపుతుంది. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ నేత‌ల,  ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీ ఛైర్మ‌న్   బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ ఆఫీస్ రూంలో బీజేపీ ఫ్లోర్ లీడ‌ర్ విష్ణుకుమార్ రాజు ప్ర‌త్యేక్ష‌మయ్యారు. ఓ ఛాన‌ల్ నిర్వ‌హించిన డిబెట్ లో పాల్గొనేందుకు వ‌చ్చిన ఆయ‌న ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై మండిప‌డ్డారు. వైసీపీ నుంచి పోటీ చేసి, టీడీపీలో ఉన్న నేత‌ల‌దంరూ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే పార్టీలు మారే నాయ‌కుల‌కోసం ప్ర‌త్యేక చ‌ట్టం తేవాలంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌ద‌రు ఛాన‌ల్ యాంక‌ర్ మీరు వైసీపీ ఆఫీస్ లో ఎందుకు ఉన్నార‌ని ప్ర‌శ్నించ‌డంతో...